సాక్షి,ఖమ్మం : ఎన్నికల్లో వినూత్న ఫలితాలను ఇచ్చే ఖమ్మం జిల్లా ఈ సారి తన పరంపరను కొనసాగించింది. రాష్ట్రం మొత్తం టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉండగా ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చింది. జిల్లాలోని పది స్థానాలకుగాను 6 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాదించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భంగపడింది. జిల్లాలోని పాలేరులో టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, కేసీఆర్‌కు ఆప్తుడైన తుమ్మల నాగేశ్వర రావు ఓడిపోయారు. 1950 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు.సీనియర్ నాయకుడు , జిల్లాలో పలుకుబడి ఉన్న నాయకుడు అయిన తుమ్మల ఓటమి టీఆర్ఎస్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాదించారు.
2014లో గెలిచిన కొత్తగూడెం స్థానాన్ని కూడా టీఆర్‌ఎస్ కోల్సోయింది. మదిర (మల్లుభట్టివిక్రమార్క), పినపాక (రేగకాంతారావు), ఇల్లందు శ్రీమతి బానోతు హరిప్రియా నాయక్), పాలేరు (కె ఉపేందర్ రెడ్డి), కొత్తగూడెం (వనమా వెంకటేశ్వరరావు), భధ్రాచలం (పోడెం వీరయ్య) లలో తన సత్తా చాటింది. ఆశ్వారావ్‌పేట (మచ్చా నాగేశ్వరరావు), సత్తుపల్లి (సండ్రవెంకట వీరయ్య) లలో టీడీపీ గెలవగా, ఖమ్మం (పువ్వాడ అజయ్)లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి , వైరా (రాముల్‌నాయక్)లో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు.
నియోజకవర్గాలు | అభ్యర్ధిపేరు | పార్టీ పేరు |
పినపాక (ఎస్టీ) | రేగ కాంతారావు | కాంగ్రెస్ |
ఇల్లందు (ఎస్టీ) | బానోతు హరిప్రియా నాయక్ | కాంగ్రెస్ |
ఖమ్మం | పువ్వాడ అజయ్ | టీఆర్‌ఎస్ |
పాలేరు | కె ఉపేందర్ రెడ్డి | కాంగ్రెస్ |
మధిర (ఎస్సీ) | మల్లు భట్టి విక్రమార్క | కాంగ్రెస్ |
వైరా (ఎస్సీ) | రాముల నాయక్ | స్వతంత్ర అభ్యర్ధి |
సత్తుపల్లి (ఎస్సీ) | సండ్రవెంకట వీరయ్య | టీడీపీ |
కొత్తగూడెం | వనమా వెంకటేశ్వరరావు | కాంగ్రెస్ |
ఆశ్వారావ్‌పేట (ఎస్టీ) | మచ్చా నాగేశ్వరరావు | టీడీపీ |
భధ్రాచలం (ఎస్టీ) | పోడెం వీరయ్య | కాంగ్రెస్ |
Comments
Please login to add a commentAdd a comment