వరిసాగులో మెళకువలు పాటించాలి
తుంగపహాడ్ (మిర్యాలగూడ రూరల్) : వరి సాగులో రైతులు అప్రమత్తంగా ఉండి మెలుకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫైనలియర్ విద్యార్థులు అన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన రావెప్ ఫోగ్రాంలో భాగంగా గురువారం మండలంంలోని త్రిపురారం, వెంకటాద్రిపాలెం, శ్రీనివాస్‌నగర్, తుంగపహాడ్ గ్రామాల్లో పర్యటించి వరి పొలాలను పశీలించారు. కొందరు వరినారునాటుతుండగా వారికి లోతు తక్కువ నాటాలని, తక్కువ మొక్కలు నాటాలని, కాలిబాటలు వదలాని సూచించారు. ఎరువుల యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏజీబీఎస్సీ విద్యార్థులు కరుణాకర్, వసత్ కుమార్, వేణు, కృష్ణ, రమేష్, శశాంక్ పాల్గొన్నారు.