మోతెలో పసుపు శుద్ధి కర్మాగారం
- నెరవేరనున్న కల
- ప్రసంగంలో ప్రస్తావించిన గవర్నర్
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
మోర్తాడ్ : పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న రైతుల కల నెరవేరనుంది. తెలంగాణ తొలి శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో మోతెలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. గవర్నర్ ప్రసంగంలో తమ గ్రామం పేరు రావడంతో మోతెకు ప్రాధాన్యత పెరిగిందని గ్రామస్తులు అంటున్నా రు. పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తే పసుపు రైతుల సమస్యలు తీరుతాయంటున్నారు.
పసుపును ఉడికించి ఆరబెట్టిన తర్వాత శుద్ధి కోసం కర్మాగారానికి తరలించాల్సి ఉంది. పసుపును శుద్ధి చేసిన తర్వాత మార్కెట్కు తరలిస్తే ఆశించిన ధర లభిస్తుందని రై తులు పేర్కొంటున్నారు. రైతులు ఇప్పుడు పసుపును స్వ యంగా శుద్ధి చేస్తున్నారు. కర్మాగారంలో శుద్ధి చేస్తే నాణ్యత పెరుగుతుందని వారంటున్నారు. గతంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పసుపు శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
అయితే ఇందిరా క్రాంతి పథంలో నిధుల కొరత, అధికారుల్లో శ్రద్ధ లోపించడం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గతంలో మో తె గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో పసుపు పం ట ఎక్కువగా సాగు అవుతున్నందున గ్రామంలో పసుపు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ హామీకి కట్టుబడ్డారని, అందుకే గవర్నర్ ప్రసంగంలో పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు ఆంశాన్ని చేర్పించారని గ్రామస్తులు భావిస్తున్నారు.