Turnbull
-
ఉమ్మడిగా ఉగ్రపీచం అణచేద్దాం
మనీలా: ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదుర్కొం టున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని ‘ఆసియాన్–భారత్’ సదస్సులో మంగళవారం మోదీ నొక్కి చెప్పారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని పరోక్షంగా ఇలా సూచించారు. తూర్పు ఆసియా సదస్సులో ప్రసంగిస్తూ... కూటమితో పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. ‘ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల కూటమి) ప్రాంతంలో నిబంధనల ఆధారిత భద్రతా వ్యవస్థ రూపకల్పనకు భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది. ఆసియాన్ కూటమి ప్రయోజనాలు, శాంతియుత అభివృద్ధికి ప్రామాణికమైన ఈ విధానానికి మేం అండగా ఉంటాం’ అని ఆసియాన్‌లో మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సోమవారం చర్చల అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అలాగే ఈ ప్రాంతంలోని దేశాలన్ని కలసికట్టుగా ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమష్టిగా ప్రయత్నించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మనం విడిగా చాలా ప్రయత్నించాం. ఈ ప్రాంతంలో ప్రధాన సవాలును ఉమ్మడిగా పరిష్కరించేందుకు సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన తరుణమిదే’ అని చెప్పారు. ఆసియాన్ దేశాధినేతలకు ఆహ్వానం భారత్, ఆసియాన్ మధ్య ‘పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం’పై ప్రధాని ప్రసంగిస్తూ.. ‘ఆసియాన్–భారత్ 25వ స్మారక వార్షికోత్సవాలకు సరైన ముగింపు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. 25, జనవరి 2018న న్యూఢిల్లీలో ఇండో–ఆసియాన్ ప్రత్యేక సదస్సులో మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ప్రధాని చెప్పారు. భారత 69వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా ఆసియాన్ నేతలకు ఆహ్వానం పలికేందుకు భారత్‌లో 125 కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రభావవంతమైన కూటమిలో ఒకటైన ఆసియాన్‌లో భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియాలు చర్చల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఆసియాన్ సదస్సుతో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్’(ఆర్సీఈపీ) సదస్సులో కూడా పాల్గొన్నారు. ఆర్సీఈపీలో 10 ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ భాగస్వాములుగా ఉన్నాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ఈ దేశాలు చర్చలు కొనసాగించాయి. ‘తూర్పు ఆసియా’ది కీలక పాత్ర ఆసియాన్–భారత్ సదస్సుతో పాటు.. తూర్పు ఆసియా సదస్సులో కూడా ప్రధాని ప్రసంగించారు. తూర్పు ఆసియా ప్రాంతంలో రాజకీయ, భద్రత, వాణిజ్యపర అంశాల పరిష్కారంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుందని, ఆ కూటమితో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తూర్పు ఆసియా సదస్సు కీలక పాత్ర పోషించాలని భారత్ ఆశిస్తుందన్నారు. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఈస్ట్ ఆసియా సదస్సు ఎంతో ముఖ్యమైన వేదిక. 2005లో ప్రారంభమైన ఈ సదస్సు వ్యూహాత్మక అంశాలు, అంతర్జాతీయ రాజకీయాలు, తూర్పు ఆసియా ఆర్థిక వికాసంలో గణనీయమైన పాత్ర పోషిస్తోంది. తూర్పు ఆసియా సదస్సులో ఆసియాన్ సభ్య దేశాలతో పాటు, భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. చతుర్భుజంపై అబే, టర్న్‌బుల్‌తో చర్చలు ఆసియాన్ సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. జపాన్ ప్రధాని షింజో అబే, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో విడిగా భేటీ అయ్యారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాల మధ్య చతుర్భుజ కూటమి ఏర్పాటు కోసం జరుగుతున్న కసరత్తుపై ఈ భేటీల్లో చర్చించినట్లు సమాచారం. ఆసియాన్ సదస్సు రెండో రోజున మోదీ వియత్నాం ప్రధాని న్యుయెన్ గ్జుయాన్ ఫుక్, బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా, న్యూజిలాండ్ ప్రధాని జసిందా అడెర్న్లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అబేతో భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేస్తూ.. ‘అబేతో సమావేశం అద్భుతంగా సాగింది. ఆర్థిక అంశాలతో పాటు ఇరు దేశ ప్రజల మధ్య సంబంధాల మెరుగుపై చర్చించాం’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రధానితో చర్చలు ఆ దేశంతో స్నేహ సంబంధాల్లో కొత్త ఉత్తేజం తీసుకొచ్చాయని ప్రధాని చెప్పారు. న్యూజిలాండ్, బ్రూనై దేశాధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగాయని మోదీ ట్వీటర్లో వెల్లడించారు. కాగా తూర్పు ఆసియా సదస్సు వేదికగా చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో ప్రధాని కొద్ది సేపు చర్చించారు. ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సుల కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి భారత్‌కు బయల్దేరారు. -
ఆస్ట్రేలియా వీసాలపై మోదీ ఆందోళన
టర్న్‌బుల్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని న్యూఢిల్లీ: అధికశాతం భారతీయులు వినియోగిస్తున్న ఆస్ట్రేలియన్ వర్క్ వీసాలో మార్పులతో నెలకొన్న ఆందోళనల్ని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారని పీఎంఓ కార్యాలయం పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణల్లో ఈ అంశంపై చర్చ సాగిందని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయంలో ఇరు దేశాల అధికారులు చర్చలు కొనసాగించేలా మోదీ, టర్న్బుల్లు అంగీకారానికి వచ్చారని పీఎంఓ తెలిపింది. అలాగే ఇటీవలి భారత పర్యటన విజయవంతంగా సాగినందుకు ప్రధాని మోదీకి టర్న్‌బుల్ అభినందనలు తెలిపారని, పర్యటన సందర్భంగా చర్చించిన అంశాల పురోగతిపై ఇరు నేతలు చర్చించారని ప్రకటనలో పేర్కొంది. జీఎస్టీ, నల్లధనం ఏరివేతపై ప్రధాని సమీక్ష జీఎస్టీ అమలుతో పాటు నల్లధనం అరికట్టేందుకు ఆర్థిక శాఖ చేపట్టిన చర్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సమీక్షించారు. జీఎస్టీ సన్నద్ధతపై రెవెన్యూ అధికారులతో ప్రధాని చర్చించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం స్వచ్ఛందంగా వెల్లడించిన నల్లధనం వివరాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. నల్లధనం పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ మనీ పురోగతిపై సమీక్ష జరిపారు. స్వచ్ఛందంగా వెల్లడించిన నల్లధన వివరాలతో పాటు ఇంతవరకూ వసూలైన పన్ను వివరాల్ని కూడా రెవెన్యూ విభాగం ప్రధానికి తెలిపినట్లు సమాచారం. భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
అమెరికా బాటలో ఆస్ట్రేలియా
-
ట్రంప్ బాటలోనే ఆస్ట్రేలియా
-
ట్రంప్ బాటలోనే ఆస్ట్రేలియా
వర్క్ వీసా పాలసీ ‘457 వీసా’ రద్దు ► దాని స్థానంలో కొత్త విధానం తీసుకురానున్న ఆసీస్ ► ఇంగ్లిషు సామర్థ్యం, వృత్తి నైపుణ్యం ఉన్న వారికే అవకాశం ► భారతీయులు సహా 95 వేల మంది విదేశీయులపై ప్రభావం మెల్బోర్న్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే ఆస్ట్రేలియా కూడా పయనిస్తోంది. తమ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగాన్ని నియంత్రించేందుకు అత్యంత ప్రాచుర్యం పొందిన వర్క్ వీసా పాలసీ 457 వీసాను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారతీయులు సహా 95 వేల మంది విదేశీ ఉద్యోగులు ఈ వర్క్ వీసా ద్వారానే ఆస్ట్రేలియాలో ఉపాధి పొందుతున్నారు. దీని స్థానంలో ఇంగ్లిషులో మెరుగైన సామర్థ్యం.. వృత్తి నైపుణ్యానికి ప్రాముఖ్యతలను ఇచ్చే కొత్త పాలసీని తీసుకురానుంది. కాగా, ఆస్ట్రేలియా తాజా నిర్ణయం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం చూపుతుందని వీసా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏమిటీ 457 వీసా.. ‘457 వీసా’.. ఆస్ట్రేలియాలో విదేశీయులను నైపుణ్య ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఉపయోగించే విధానమిది. 1990ల్లో వ్యాపారులకు, అత్యున్నత నిపుణత కలిగిన వలసదారుల కోసం తెచ్చిన ఈ విధానాన్ని ఆ తర్వాత మరింత విస్తరించారు. ఈ వీసాపై వచ్చిన వాళ్లు నాలుగేళ ్లపాటు ఆస్ట్రేలియాలో పని చేయవచ్చు. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఆస్ట్రేలియాలో ప్రాథమిక 457 వీసాలపై పని చేస్తున్న వారి సంఖ్య 95,757. సెకండరీ వీసాదారులు(457 వీసా కలిగిన వారి కుటుంబ సభ్యులు) 76,430 మంది ఉన్నట్టు సమాచారం. 457 వీసాలను వినియోగించుకునే వాళ్లలో మెజారిటీ సంఖ్య భారతీయులదే. ఈ వీసాలను తీసుకునే భారతీయుల సంఖ్య 19.5% కాగా.. యూకే, చైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే నైపుణ్యంలేని వారిని తక్కువ వేతనం కోసం తీసుకుంటూ ఈ విధానాన్ని పక్కదారి పట్టిస్తున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పాలసీని రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యత: టర్న్‌బుల్ ‘‘మాది ఒక వలస దేశమనే విషయం తెలుసు. కానీ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆస్ట్రేలియా ఉద్యోగాల్లో ఆస్ట్రేలియన్లకే తొలి ప్రాధాన్యత దక్కాలి. అందువల్ల ‘457 వీసా’ను రద్దు చేయాలని నిర్ణయించాం. ఇకపై 457 వీసాలను జారీ చేయబోం. ఈ వీసా కింద ఇచ్చే ఉద్యోగాలు ఇకపై ఆస్ట్రేలియన్లకే దక్కాలి’’ అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మాల్కం టర్న్‌బుల్ స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన విదేశీయుల కోసం కొత్తగా ‘ఆస్ట్రేలియా ఫస్ట్’ అనే విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని చెప్పారు. కొత్త వీసా విధానం తక్షణం అమలులోకి వస్తుందని, దీనిని పూర్తిగా అమలులోకి తీసుకువచ్చే ప్రక్రియ 2018 మార్చి నాటికి పూర్తవుతుందని చెప్పారు. కొత్త విధానంలో ఉన్నతమైన ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం, క్రిమినల్ హిస్టరీ చెక్, లేబర్ మార్కెట్ టెస్టింగ్, నాన్ డిస్క్రిమినేషన్ వర్క్‌ఫోర్స్ టెస్ట్, మార్కెట్ శాలరీ రేట్ అసెస్మెంట్ వంటి నిబంధనలతో పాటు కొత్తగా రెండేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను తప్పనిసరి చేయనున్నారు. కొత్తగా రూపొందించనున్న ‘టెంపరరీ స్కిల్ షార్టేజ్ వీసా’ విధానం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అనే రెండు స్ట్రీమ్‌లుగా ఉండనుంది. షార్ట్‌టర్మ్ వీసాలను రెండేళ్లకు.. మీడియం టర్మ్ వీసాలను మరింత కఠినమైన స్కిల్ షార్టేజ్ ఉద్యోగాల కోసం నాలుగేళ్ల వరకూ జారీ చేస్తారు. హెచ్–1బీపై సంతకం! హెచ్–1బీ వీసాల జారీని కఠినతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం (ఏప్రిల్ 18న) సంతకం చేయనున్నట్లు సమాచారం. దీని ప్రభావం భారతీయ ఐటీ కంపెనీలు, నిపుణులపై తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి హెచ్–1బీ వీసాలను అత్యున్నత వృత్తి నిపుణులకు మాత్రమే జారీ చేయనున్నారు. కాగా, 2018 ఏడాదికి హెచ్–1బీ వీసా కోసం మొత్తం 1,99,000 దరఖాస్తులు రాగా, 65 వేల వీసాలను లాటరీ పద్ధతిలో కేటాయించారు. వీటితోపాటు మరో 20 వేల వీసాలు అమెరికా ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న విదేశీయులకు దక్కాయి. -
‘ఉగ్ర’ పోరులో పరస్పర సాయం
ప్రధాని మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని భేటీ న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరుకు పరస్పరం సహకరించుకోవాలని భారత్, ఆస్ట్రేలియా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన టర్న్‌బుల్ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఇద్దరు ప్రధానులు ఢిల్లీలోని మండి మెట్రో రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి దాదాపు 15 నిమిషాలు మెట్రో రైల్లో ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ప్రధాని మోదీ ప్రయాణికులకు అభివాదం చేశారు. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే టర్న్‌బుల్ మోదీ ఇద్దరు నిల్చుని కొద్దిసేపు, కూర్చుని కొద్దిసేపు సెల్ఫీలు దిగారు. ప్రయాణిస్తున్న సమయంలోనే ఇద్దరు ప్రధానులు తమ సెల్ఫీలను ట్వీటర్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ చోటు చేసుకుంది. అనంతరం వీరిద్దరూ అక్షర్ ధామ్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ఇద్దరు ప్రధానులను పూలమాలలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. అక్షర్ ధామ్ ఆలయం లోపల ఇద్దరు కలియ తిరిగారు. ఆస్ట్రేలియా–భారత్ మధ్య 6 ఒప్పందాలు అంతకుముందు భారత్ ప్రధాని మోదీతో టర్న్‌బుల్ పలు అంశాలను చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న భారత విద్యార్థుల భద్రతతో సహా పలు అంశాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా భారత్–ఆస్ట్రేలియా దేశాలు ఆరు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించుకోవాలన్నది ప్రధానమైనది. ఆరోగ్యం, మందులు, క్రీడలు, పర్యావరణం, వాతావరణం, విమానయాన భద్రత, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాల్లో సహకరించుకోవాలని ఒప్పందాలు చేసుకున్నారు. లాంఛనప్రాయమైన రాష్ట్రపతి భవన్లో విందు సందర్భంగా టర్న్‌బుల్ విలేకరులతో మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియాలోని 5 లక్షలమందికి భారత నేపథ్యముంది. ఇరుదేశాలు ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి’అని అన్నారు. అంతేకాదు ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ప్రధాని మోదీ ఈ దేశాన్ని ఎంతో అసాధారణమైన రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. భారత్ సాధించిన విజయాలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. భారత్‌తో మరింత సన్నిహితంగా కలసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు. డీఆర్ఎస్పై సరదా సంభాషణ ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లి మధ్య డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పై వివాదం జరిగిన నేపథ్యంలో దీనిపై భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు మోదీ, టర్న్‌బుల్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య ఒప్పందాలను మోదీ క్రికెట్ పరిభాషలో చెబుతూ ‘మా నిర్ణయాలు డీఆర్ఎస్ రివ్యూ పరిధిలోకి రానందుకు సంతోషం’ అని చమత్కరించారు.