‘రిమోట్ ఇవ్వలేదని ఉరేసుకుంది’
హైదరాబాద్: క్షణికావేశం ఓ బాలిక ప్రాణాలు తీసింది. వివరాలు..నిజాంపేట రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే విమల, ప్రకాష్లిద్దరూ భార్యాభర్తలు. దంపతులకు జోత్స్న(13), ప్రవీణ్(16) అనే ఇద్దరు పిల్లలున్నారు. అన్నా చెల్లెళ్లు గత రాత్రి టీవీ రిమోట్ కోసం గొడవపడ్డారు. టీవీ రిమోట్ ఇవ్వకపోవడంతో క్షణికావేశంలో జోత్న్స గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన జరిగిన సమయంలో తల్లి వంట చేస్తూ ఉంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.