two students injured
-
గణతంత్ర వేడుకలకు వెళుతూ..
సాక్షి, ఉరవకొండ: కళాశాలలో జరిగే జెండా వందనానికి వెళ్తూ ఓ విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. చిన్నముస్టూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. మూలగిరిపల్లికి చెందిన సునీల్ (18) ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కళాశాలలో జరిగే గణతంత్ర వేడుకలకు హాజరయ్యేందుకు స్నేహితుడు సుధాకర్‌తోపాటు తమ గ్రామానికే చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినితో కలిసి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. చిన్నముస్టూరు సమీపంలో ఎద్దుల బండిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని వీరి బైక్ ఢీకొనడంతో సునీల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులు, కళాశాల విద్యార్థులతోపాటు అధ్యాపకులు రాజశేఖర్, లత, పద్మ, అనితలు ఆసుపత్రికి చేరుకుని సునీల్ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. -
లారీని ఢీకొన్న స్కూటర్
కూడేరు : కూడేరులో షిర్డీసాయి బాబా ఆలయం వద్ద ఆదివారం అనంతపురం– బళ్లారి ప్రధాన రహదారిపై వెళ్తున్న లారీని స్కూటర్ ఢీకొనింది. దీంతో స్కూటర్‌పై వెళ్తున్న కూడేరుకు చెందిన విద్యార్థులు అరవింద్ (9వ తరగతి), పవన్ (9వ తరగతి, కడదరగుంట) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. -
ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు
ధర్మవరం రూరల్ : నిమ్మలకుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు... ధర్మవరం పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన వన్నూర్‌స్వామి కొత్తపేట మున్సిపల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దుర్గాప్రసాద్ ‘సాయి కృప’ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. వీరిద్దరూ నిమ్మలకుంటలో జరుగుతున్న పెళ్లికి బుధవారం ద్విచక్రవాహనంలో వెళ్లారు. అక్కడ నుంచి పట్టణానికి తిరిగి వస్తుండగా వెనుకవైపు నుంచి సుమో వాహనం ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. గాయపడిన వన్నూర్‌స్వామి, దుర్గాప్రసాద్‌లను వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.