ధర్మవరం రూరల్ : నిమ్మలకుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు... ధర్మవరం పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన వన్నూర్‌స్వామి కొత్తపేట మున్సిపల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దుర్గాప్రసాద్ ‘సాయి కృప’ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు.
వీరిద్దరూ నిమ్మలకుంటలో జరుగుతున్న పెళ్లికి బుధవారం ద్విచక్రవాహనంలో వెళ్లారు. అక్కడ నుంచి పట్టణానికి తిరిగి వస్తుండగా వెనుకవైపు నుంచి సుమో వాహనం ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. గాయపడిన వన్నూర్‌స్వామి, దుర్గాప్రసాద్‌లను వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు
Published Wed, Feb 22 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
Advertisement
Advertisement