Two telugu students
-
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు నీట మునిగి చనిపోయిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతులను కోయలమూడి అజయ్‌కుమార్ (23), వోలేటి తేజ కౌశిక్ (22)గా గుర్తించినట్లు మీడియా కథనం పేర్కొంది. అర్లింగ్టన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న అజయ్, తేజ యూఎస్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఓక్లహోమాకు వెళ్లారు. మంగళవారం అక్కడి టర్నర్‌ఫాల్స్ అనే జలపాతంలో వారిలో ఓ వ్యక్తి ఈతకు వెళ్లి మునిగిపోగా, అతడ్ని రక్షించడానికి దూకిన మరో వ్యక్తి కూడా నీళ్లలో మునిగిపోయాడు. -
వేద పాఠశాల విద్యార్ధులు గల్లంతు
-
అయోధ్యలో వేద పాఠశాల విద్యార్ధులు గల్లంతు
బియాస్ నది ఘటన మరవకు మందే మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు సరయూ నదిలో గల్లంతయ్యారు. హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని వేదపాఠశాల నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు వెళ్లారు. అందులోభాగంగా బుధవారం ఉదయం ఫోటో దిగేందుకు సరయూ నదిలోకి దిగారు. ఆ క్రమంలో నీటి ప్రవాహానికి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. దాంతో అక్కడే ఉన్న తోటి విద్యార్థులు హాహాకారాలు చేయడంతో స్థానికులు నదిలోకి దూకి... గల్లంతైన విద్యార్థులు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులు మల్కాజ్ గిరి వాణినగర్ కు చెందిన కిరణ్, చక్రపాణిలుగా గుర్తించినట్లు వేద పాఠశాలకు చెందిన ప్రతినిధిలు చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.