రెండేళ్ల కనిష్టానికి రూపాయి
36 పైసలు క్షీణించి 66.82 వద్ద ముగింపు
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి మారకం సోమవారం రెండేళ్ల కనిష్ట స్థాయికి చేరింది. విదేశీ నిధులు తరలిపోతున్న నేపథ్యంలో బ్యాంక్‌లు, ఎగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో రూపాయి 36 పైసలు క్షీణించి 66.82 వద్ద ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి 66.46 వద్ద ముగిసింది. దీంతో పోల్చితే సోమవారం నష్టాల్లోనే 66.60 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత 66.86కు క్షీణిం చింది. చివరకు 36 పైసల నష్టంతో రెండేళ్ల కనిష్ట స్థాయి 66.82 వద్ద ముగి సింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 63 పైసలు నష్టపోయింది. స్టాక్ మార్కెట్ నష్టపోవడం, విదేశాల్లో డాలర్ బలపడడం రూపాయి సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం వచ్చే వారం జరగనున్నందున ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని వెరాసిటీ గ్రూప్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ చెప్పారు.