U. durgaprasad rao
-
ఈడీ విచారణకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించండి: విజయసాయిరెడ్డి
సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజయసాయిరెడ్డి వినతి సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లడానికి అనుమతించాలని ఆడిటర్ విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. ఈ మేరకు ఆయన గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ, అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్పీలేట్ అథారిటీల ముందు విచారణలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లాలని.. ఇందుకోసం మార్చి 31 వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులను సడలించాలని కోరారు. దీనిపై విచారణను ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు, ఆడిటర్‌గా క్లయింట్లకు సేవలు అందించేందుకు కర్ణాటక, తమిళనాడు వెళ్లేందుకు అనుమతించాలంటూ సాయిరెడ్డి దాఖలు చేసుకున్న మరో పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. -
16 లేదా 17న తుది చార్జిషీట్
ప్రత్యేక కోర్టుకు నివేదించిన సీబీఐ జగన్ బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువివ్వాలని వినతి సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వచ్చే సోమవారం లేదా మంగళవారం తుది చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ.. ఇక్కడి ప్రత్యేక కోర్టుకు నివేదించింది. దర్యాప్తునకు సుప్రీంకోర్టు విధించిన గడువు పూర్తయిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు గురువారం విచారించారు. అయితే బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు తమకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. బుధవారం కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. దీంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. మోపిదేవికి బెయిల్ వద్దు: సీబీఐ వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై వాదనలను ప్రత్యేక కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.