udaya laxmi
-
బాధ్యతలు చేపట్టిన ఉదయలక్ష్మి
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) ఇంచార్జి వైస్ ఛాన్స్లర్ గా ఏపీ సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్ బి. ఉదయలక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉదయలక్ష్మిని ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు నేపథ్యంలో నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తొలగించడమే కాకుండా.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. -
ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీగా ఉదయలక్ష్మి
హైదరాబాద్: ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి ఉదంతంతో ఒక్కసారిగా వార్తల్లోకొచ్చిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో.. కొత్తగా.. సాంకేతిక విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉదయలక్ష్మికి ఉత్తర్వులు జారీ చేసింది. -
నాగార్జున వర్సిటీ వీసీగా ఉదయలక్ష్మి!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన రితేశ్వరి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వీసీ సాంబశివరావును తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సాంకేతిక విద్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ ఉదయలక్ష్మిని ఆయన స్థానంలో నియమించనుంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశముంది. ర్యాగింగ్, విద్యార్థి కుల సంఘాల పోరు నివారించడంలో విఫలమయ్యారని సాంబశివరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే సాంబశివరావు స్థానంలో ప్రొఫెసర్ సింహాద్రిని వీసీగా నియమిస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. కాగా, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు శనివారం అందజేసింది.