Udta Punjab movie
-
నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్
Shahid Kapoor Recalls Wife Mira Reaction After Watching Udta Punjab: విభిన్న సినిమాలు, నటనతో అలరిస్తున్నాడు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్. తాజాగా షాహిద్ నటిస్తున్న చిత్రం 'జెర్సీ'. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను 'కబీర్ సింగ్'గా రీమెక్ చేసిన తర్వాత షాహిద్ చేస్తున్న మరో రీమెక్ చిత్రం ఇది. నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ తనను ఓ సినిమా చూసి వదిలేద్దామనుకుందంటూ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. 'ఉడ్తా పంజాబ్' చిత్రంలో తన నటనను చూసి తను రాంగ్ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నానని మీరా భావించినట్లు షాహిద్ పేర్కొన్నాడు. 'మీరా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మాకు వివాహం జరిగిన ప్రారంభంలో నా ఉడ్తా పంజాబ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్‌కు ముందు నటీనటుల కోసం ఎడిటింగ్ గదిలో ప్రత్యేక షో వేశారు. నేను నాతోపాటు మీరాను కూడా తీసుకెళ్లాను. సినిమా చూస్తున్నంతా సేపు మీరా మాములుగానే ఉంది. కానీ మూవీ ఇంటర్వెల్ సీన్ వచ్చాకా మీరా ప్రవర్తన చూసి షాక్ అయ్యాను. తను నా పక్క నుంచి లేచి దూరంగా వెళ్లి నిల్చుంది. నేను ఏమైందని అడిగా. దానికి తను 'నువ్ ఇలాంటి వాడివా ? నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా ? నువ్ ఆ టామీ సింగ్లాంటివాడివా? నీతో నేనింకా కలిసి ఉండను. నేను తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నేను వెళ్లిపోతా.' అని చెప్పింది. తన మాటలకు ఒక్కసారిగా షాకయ్యా. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. తర్వాత తనకు అదంతా సినిమా. అందులోనే అలా నటిస్తారని అర్థమయ్యేలా చెబితే గానీ మీరా కుదుటపడలేదు. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను.' అని షాహిద్ చెప్పుకొచ్చాడు. షాహిద్, మీరా 2015లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కుమార్తె మిషా, కుమారుడు జైన్ ఉన్నారు. -
40 సెన్సార్ కట్స్: సినిమా పేరు మార్చాలి
ఈ ఏడాది రూపుదిద్దుకున్న వాటిలో అత్యంత వివాదాస్పద సినిమాగా ఇప్పటికే పేరుమోసిన 'ఉడ్తా పంజాబ్' కు సెన్సార్ బోర్డు 40 కట్స్ చెప్పింది. డ్రగ్స్ వినియోగం, మాఫియా చుట్టూ తిరిగే ఈ సినిమాలో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా చూపారని ఎక్కడికక్కడ కట్స్ విధించారు బోర్డు సభ్యులు. డ్రగ్స్ సబ్జెక్ట్ తో తీసిన సినిమాలో డ్రగ్స్ (వాస్తవానికి షూటింగ్ లో వేరే పదార్థాలు వాడతారు) చూపకపోతే ఎలా? అంటూ సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శక నిర్మాతలు ట్రిబ్యూల్ ను, సమాచార ప్రసారాల శాఖ అధికారులను కలిసేప్రయత్నంలో ఉన్నారు. అభిషేక్ చౌబే దర్శకత్వంలో షాహిద్ కపూర్, కరీనా, ఆలియా భట్ లు ప్రధాన పాత్రల్లో నటించిన 'ఉడ్తా పంజాబ్' జూన్ 17న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ చిక్కుల్లోపడి ఆలస్యమైంది. ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ కూడా 'ఉడ్తా పంజాబ్' లో చూపిన అంశాలను ప్రస్తావిస్తూ ట్విటర్ లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. ఆ సినిమాలో చూపించిన విషయాలు ఒక్క పంజాబ్ లోనే దేశం, ప్రపంచం అంతటా కనిపిస్తాయని, అందుకే దానికి ఉడ్తా పంజాబ్ అని కాకుండా ఉడ్తా ఇండియా అనో, ఉడ్తా వరల్డ్ అనో టైటిల్ పెట్టాలని సూచించారు. ఇక హీరో షాహిద్ మాత్రం మరోలా స్పందించాడు. ఉడ్తా పంజాబ్ విడుదలైన తర్వాత అన్ని రాష్ట్రాలు ఈ సినిమాకి పన్ను మినహాయింపును ప్రకటించడం ఖాయమని, సినిమా అంత గొప్పగా, సమాజానికి పనికివచ్చేలా రూపొందించామని షాహిద్ అన్నాడు.