మిఠాయిలతో మోదీకి స్వాగతం
ఉఫా: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం రష్యా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ఘనస్వాగతం లభించింది. భారత ప్రధాని రాకను శుభసూచికంగా భావించిన రష్యా అధికార యంత్రాంగం ఏకంగా ఎయిర్ పోర్టులోనే మిఠాయి తినిపించిమరీ మోదీకి స్వాగతం పలికింది.
ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం ఉజ్బెకిస్థాన్ నుంచి రష్యాలోని ఉఫా పట్టణానికి చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సు సహా షాంఘై సంహకార సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గోంటారు. బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా దేశాల అధ్యక్షులు ఇప్పటికే ఉఫా పట్టణానికి చేరుకున్నారు. భారత్కు రష్యా చరిత్రాత్మక స్నేహితుడని, తాను పాల్గొనబోయే సమాశాలు తప్పక ఫలవంతం అవుతాయని రష్యా అధికారులతో ప్రధాని మోదీ అన్నారు.