Under Construction buliding
-
కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. భవనం శ్లాబ్ కూలీ పలువురికి గాయాలు
హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలోని పాపారాయుడు విగ్రహం వద్ద నిర్మాణంలో భవనం నాలుగో అంతస్తు శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇద్దరు కూలీలు చిక్కున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి -
పాణాలు తీసిన ప్రహరీ
కృష్ణరాజపురం: భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ గోడ కూలి నలుగురు కూలీ కార్మికులు మరణించారు. ఈ సంఘటన బెంగళూరు సమీపంలో హొసకోటె తాలూకా అనుగొండనహళ్లి హోబళి పారిశ్రామిక ప్రాంతంలో ఒక అపార్టుమెంట్ వద్ద జరిగింది. మృతులు, క్షతగాత్రులంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారు. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు గోడ పక్కనే వేసుకున్న తాత్కాలిక షెడ్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. గోడ కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. స్థానికులు, పోలీసులు చేరుకుని వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బిహార్‌కు చెందిన మనోజ్ కుమార్ (35), రామ్‌కుమార్ (25), నితీశ్ కుమార్ (22), మణితన్ దాస్ అనే నలుగురు తీవ్రగాయాలతో మరణించారు. నాసిరకం నిర్మాణం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో కూలీ కార్మికులు పనిచేస్తున్నారు. కారి్మకులు ఉండేందుకు తాత్కాలికంగా షెడ్‌ను నిర్మించారు. అయితే బుధవారం కురిసిన భారీ వర్షం, అలాగే పక్కనే ఉన్న రాజకాలువ పొంగడంతో ప్రమాదం జరిగింది. ప్రహరీని రాజకాలువను ఆక్రమించి, నాసిరకంగా కట్టినట్లు సమాచారం. ఎలాంటి పునాది లేకుండా ఆ కాంపౌండ్‌కు ఆనుకుని షెడ్‌ను నిర్మించారు. దీంతో వర్షానికి తడిసిన ఆ కాంపౌండ్ గోడ పేకమేడలా షెడ్డుమీద కూలి పోయింది. నలుగురికి తీవ్రగాయాలు ఈ ప్రమాదంలో సునీల్ మండల్, శంభు మండల్, దిలీప్, దుర్గేశ్ అనే నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వైట్‌ఫీల్డ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మంత్రి ఎంటీబీ నాగరాజు, ఎస్పీ పురుషోత్తమ్, డీఎస్పీ పి.ఉమాశంకర్ పరిశీలించారు. (చదవండి: నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్ ) -
ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ భవనం కుప్పకూలింది. సత్యనికేతన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం సోమవారం కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు. చారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వారి మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 25 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఎన్డిఆర్ఎఫ్ అధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. అయితే భవనం కుప్పకూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ये हादसा बेहद दुखद है। ज़िला प्रशासन राहत और बचाव के काम में जुटा है। मैं ख़ुद घटना से सम्बंधित हर जानकारी ले रहा हूँ। https://t.co/dO8l2zEWon — Arvind Kejriwal (@ArvindKejriwal) April 25, 2022 ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆయనతోపాటు జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ ప్రమాదం చాలా బాధాకరం. జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తున్నాను' అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. Delhi | NDRF personnel rescued one person from the debris of an under-construction building that collapsed in Satya Niketan, this afternoon pic.twitter.com/aYjXXFsXk3 — ANI (@ANI) April 25, 2022 చదవండి: దొంగల తెలివి...ఏటీఎం మిషన్నే తవ్వేందుకు యత్నం: వీడియో వైరల్ Delhi | A call about the collapse of an under-construction building in the Satya Niketan area has been received. 6 fire tenders rushed to the spot. 5 labours feared to be trapped; rescue operation underway: Delhi Fire Service pic.twitter.com/lZ3XgFTl7G — ANI (@ANI) April 25, 2022 -
ఘోర ప్రమాదం.. భవనం కూలి ఏడుగురి మృతి
under-construction building collapsed in Pune: పుణేలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్లాబ్ కోసం వేసిన ఇనుప రాడ్ల స్ట్రక్చర్ నేలకూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పుణే – అహ్మద్‌నగర్ రోడ్డుపై శాస్త్రినగర్ చౌక్ సమీపంలోని వాడియా ఫార్మ్ స్థలంలో భవన నిర్మాణం జరుగుతోంది. పనుల సమయంలో సుమారు 15 మంది కార్మికులు పనులు చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సంఘటన అనంతరం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇనుపరాడ్ల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కట్టర్ల సహాయంతో ఇనుపరాడ్లను కట్ చేసి కార్మికులను బయటికి తీశారు. -
కుప్పకూలిన కోచింగ్ సెంటర్; ఐదుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భవనం కుప్పకూలిన మరో ఘటన విషాదాన్ని నింపింది. భజన్‌పురా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం శనివారం కూలిపోయింది. పైకప్పు కూలిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం. వీరిలో నలుగురు విద్యార్థులుకాగా, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. గాయపడిన మరో 13మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ భవనంలో కోచింగ్ సెంటర్ నడుస్తుండటంతో పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. మూడు అంతస్తుల భవనం రెండవ, మూడవ అంతస్తులో నిర్మాణం జరుగుతోందని, సాయంత్రం 5 గంటల సమయంలో అకస్మాత్తుగా కూలిపోయిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే రక్షణ సహాయక చర్యలను చేపట్టడానికి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డిఎఫ్ఎస్) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఏడుగురిని రక్షించినట్లు డిఎఫ్ఎస్ అధికారి తెలిపారు. సుమారు 15 మంది శిధిలాలలో చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై వచ్చిన ట్వీట్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానీ, మరికొద్ది సేపట్లో సంఘటనా స్థలానికి వెళ్లబోతున్నానని ట్వీట్ చేశారు. दिल्ली के भजनपुरा इलाके में कोचिंग सेंटर की छत गिर गई है, 11 छात्रों को अस्पताल ले जाया गया है|अभी रेस्क्यू ऑपरेशन जारी है, कई के फंसे होने की आशंका है| pic.twitter.com/tXA006oLjx — Anurag Dhanda (@anuragdhanda) January 25, 2020 -
ఘోర అగ్ని ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా శవాలు
-
ఘోర అగ్ని ప్రమాదం.. గుర్తుపట్టలేనంతగా శవాలు
సాక్షి, ముంబై: ఘోర అగ్ని ప్రమాదం మహారాష్ట్రలో ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనంలో మంటలు చెలరేగటం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. జుహులోని విలే పార్లే ప్రాంతంలో ఓ 13 అంతస్థుల భవన నిర్మాణం జరుగుతోంది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో చాలా మట్టుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలుగా తెలుస్తోంది. వారంతా అందులోనే ఉంటూ పనులు చేస్తున్నారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. గాయపడిన వారిని ఆర్ఎన్ కూపర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడు ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరానప్పటికీ, ప్రత్యక్ష సాక్ష్యులు పెద్ద పేలుడు శబ్ధం విన్నామని చెబుతుండగా.. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎల్పీజీ సిలిండర్ పేలటమే ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృత దేహాలు గుర్తుపట్టలేనంత దారుణంగా తయారయ్యాయని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో నలుగురు కూలీలు కనిపించకుండా పోవటంతో వారు శిథిలాల కింద ఉన్నారేమోనని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు నిర్లక్ష్యమే గనుక కారణమైతే భవన యాజమానిపై కఠిన చర్యలు ఉంటాయని మున్సిపల్ అధికారులు వెల్లడించారు.