
under-construction building collapsed in Pune: పుణేలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్లాబ్ కోసం వేసిన ఇనుప రాడ్ల స్ట్రక్చర్ నేలకూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పుణే – అహ్మద్‌నగర్ రోడ్డుపై శాస్త్రినగర్ చౌక్ సమీపంలోని వాడియా ఫార్మ్ స్థలంలో భవన నిర్మాణం జరుగుతోంది.
పనుల సమయంలో సుమారు 15 మంది కార్మికులు పనులు చేస్తుండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. సంఘటన అనంతరం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఇనుపరాడ్ల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కట్టర్ల సహాయంతో ఇనుపరాడ్లను కట్ చేసి కార్మికులను బయటికి తీశారు.