under19worldcup
-
"దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది"
ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే సీఎస్కే స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడితో పాటు రుత్‌రాజ్ గైక్వాడ్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. సాధరణంగా చాహర్ పేస్ బౌలర్‌గా జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తాడు. అయితే అతడు దూరం కావడంతో అతడి స్ధానాన్ని జట్టులో ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్ధకమైంది. ఈ నేపథ్యంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అండర్-19 బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్‌కు ఉంది అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్ మెగా వేలంలో హంగర్గేకర్ను సీఎస్కే రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక రాజవర్ధన్ హంగర్గేకర్ అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు. అతడు బంతితో పాటు బ్యాట్‌తో కూడా దుమ్ము దులిపాడు. "దీపక్ చాహర్ త్వరగా కోలుకోవాలని సీఎస్కే మేనేజేమెంట్ కోరుకుంటుంది. ఒక వేళ అతడు అందుబాటులో లేకుంటే హంగర్గేకర్తో ఆ స్ధానాన్ని భర్తీ చేయవచ్చు. అతడు తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టగలడు. అంతేకాకుండా అతడికి సిక్స్ హిట్టింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి చెన్నై విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. చదవండి: WTC Final: అటు ఇంగ్లండ్.. ఇటు ఆస్ట్రేలియా.. టీమిండియాకు అంత ఈజీ కాదు! no looks from hangargekar pic.twitter.com/e4gukWDVtE — ‘ (@Ashwin_tweetz) March 10, 2022 -
177 పరుగులతో వరల్డ్‌కప్ సాధ్యమేనా?
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ జట్టు 177 పరుగులకే ఆలౌటైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, తిలక్ వర్మ(38) ఫర్వాలేదనిపించాడు. అటు తర్వాత ధ్రువ్ జురేల్(22) మోస్తరుగా ఆడగా, మిగతా వారు విఫలమయ్యారు. ఈ ముగ్గురు మినహా మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారత్ ఇన్నింగ్స్‌ను జైస్వాల్, సక్సేనాలు ఆరంభించారు. అయితే 17 బంతులు ఆడిన సక్సేనా రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆపై తిలక్ వర్మతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కాగా, తిలక్ వర్మ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత జైస్వాల్‌కు సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ ప్రియాంగార్గ్(7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఇక జైస్వాల్ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత ఏ ఒక్కరూ పెద్దగా ప్రభావం చూపలేదు. జోరెల్ ఆడుతున్నాడనుకునే సమయంలో అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. జోరెల్ ఔటైన తర్వాత భారత్ ఆటగాళ్లు క్రీజ్‌లోకి వచ్చామన్న పేరుకే వచ్చి పెవిలియన్ బాటపట్టారు. దాంతో భారత్ జట్టు 47.2 ఓవర్లలోనే ఆలౌటైంది. 21 పరగుల వ్యవధిలో భారత్ ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అవిషేక్ దాస్ మూడు వికెట్లు సాధించగా,షోరిఫుల్ ఇస్లామ్, హసన్ షకిబ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. రకిబుల్ హసన్‌కు వికెట్ దక్కింది. ఇద్దరు రనౌట్ రూపంలో వెనుదిరగడంతో భారత్ రెండొందల మార్కును కూడా చేరలేకపోయింది. మరి 178 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని వరల్డ్‌కప్ సాధించడం భారత్‌కు కష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు. -
రనౌట్ కోసం పరుగో పరుగు!
పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ఎవరైనా రనౌట్‌ను తప్పించుకునేందుకు పరుగులు తీస్తూ ఉంటారు. మరి పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఏమిటి రనౌట్ కోసమే అన్నట్లు పరుగులు తీశారు. అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇదే పొరపాటు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే హై టెన్షన్. అందులోనూ అది వరల్డ్‌కప్. కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే 31వ ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన ఆ ఓవర్ మూడో బంతికి ఇద్దరు పాక్ బ్యాట్స్‌మెన్ అయోమయంలో ఒకేవైపు పరుగు తీశారు. స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న ఖాసిమ్ అక్రమ్‌కు రవి బౌల్ చేశాడు. ఆఫ్ సైడ్ ఆడిన ఖాసిమ్ పరుగు కోసం ప్రయత్నించాడు. ఇక నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న కెప్టెన్ నజీర్.. తొలుత రన్ కోసం ముందుకు కదిలాడు. కానీ భారత ఫీల్డర్ అంకోలేకర్ చురుకుగా బంతిని అందుకుని కీపర్ జూరల్‌కు అందించాడు. (ఇక్కడ చదవండి: పది వికెట్లతో పని పట్టారు) అయితే ఫీల్డర్ అంకోలేకర్ వేగాన్ని గమనించిన పాక్ కెప్టెన్ నజీర్ మళ్లీ నాన్ స్ట్రయికర్ వైపు వెనక్కి మళ్లాడు. ఇక టెన్షన్లో పరుగు కోసం వచ్చిన ఖాసిమ్ కూడా నాన్ స్ట్రయికర్ వైపే పరుగు తీశాడు. ఇద్దరూ ఒకేవైపు రన్నింగ్ చేయడం.. ఫీల్డర్ తన చేతిలో ఉన్న బంతిని కీపర్ వైపు విసరడం అంతా మెరుపు వేగంగా జరిగిపోయాయి. అయితే ముందుగా క్రీజ్‌లో బ్యాట్ పెట్టిన నజీర్ బ్రతికిపోయాడు. పరుగు తీసిన ఖాసిమ్ మాత్రం దురదృష్టకరరీతిలో ఔటయ్యాడు. దాంతో పాక్ ప్లేయర్లు మైదానంలోనే ఒకరిపై ఒకరు అసహనం వ్యక్తం చేసుకున్నారు. గతంలో సీనియర్ పాక్ క్రికెట్లోనూ ఇలాంటి ఘటనలు చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. -
పాక్‌ను పాతరేసిన యువ భారత్
అసలే చిరకాల ప్రత్యర్థి. పైగా ఈ టోర్నీలో భారత్‌తో పాటు సమఉజ్జీ ప్రదర్శన ఇచ్చింది. కానీ భారత్‌తో ఆడేటప్పుడు మాత్రం అత్తెసరు జట్టుగా మారిపోయింది. పాక్ బ్యాట్స్‌మెన్‌ను మన బౌలర్లు వెంటాడితే... బౌలర్లనేమో భారత ఓపెనర్లిద్దరే గెలిచేదాకా వేటాడారు. ఫలితం... పాకిస్తాన్‌ను కసిదీరా ఓడించారు. యువ భారత్‌ను సమష్టిగా అంతిమ సమరానికి చేర్చారు. పాచెఫ్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): న్యూజిలాండ్‌లో భారత సీనియర్ జట్టు కివీస్‌పై అన్నీ గెలిచింది. దక్షిణాఫ్రికాలో యువ భారత జట్టు అందరినీ ఓడిస్తోంది. ఇక ఒక్క ఫైనల్ పోరు మాత్రమే బాకీ ఉంది. అద్వితీయ ఆటతో అదరగొట్టిన యువ భారత జట్టు అండర్–19 ప్రపంచకప్‌లో ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రొహైల్ నజీర్ (102 బంతుల్లో 62; 6 ఫోర్లు), ఓపెనర్ హైదర్ అలీ (77 బంతుల్లో 56; 9 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3 వికెట్లు తీయగా... కార్తీక్ త్యాగి, రవి బిష్ణోయ్‌లకు రెండేసి వికెట్లు లభించాయి. తర్వాత భారత్ 35.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 176 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 105 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ‘శత’క్కొట్టాడు. దివ్యాంశ్ సక్సేనా (99 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. వెంటాడిన బౌలర్లు... భారత బౌలర్లు పాక్ బ్యాట్స్‌మెన్ పాలిట కొదమ సింహాల్లా రెచ్చిపోయారు. దీంతో ముగ్గురు మినహా మిగతా వారు అంకెతోనే సరిపెట్టుకున్నారు. హురైరా (4), ఫహాద్ (0), ఖాసీమ్ (9), ఇర్ఫాన్ (3), అబ్బాస్ (2), తాహిర్ (2), ఆమిర్ అలీ (1) ఇలా ‘టాప్ నుంచి టెయిలెండర్ల’ దాకా అందరూ భారత బౌలింగ్ చెరలో చిక్కి శల్యమయ్యారు. ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ నజీర్ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించడమే పాక్ ఇన్నింగ్స్‌లో గొప్ప భాగస్వామ్యం. ఇద్దరు అర్ధసెంచరీలతో జట్టును ఆదుకోగా... హ్యారిస్ 21 పరుగులు చేశాడు. ఇక 31వ ఓవర్ నుంచి భారత బౌలింగ్ మరింత పదునెక్కింది. దీంతో 13 ఓవర్ల వ్యవధి లో పాక్ చివరి 7 వికెట్లను కోల్పోయింది. చితగ్గొట్టిన ఓపెనింగ్ జోడీ... యశస్వి, దివ్యాంశ్ ఆట మొదలు పెట్టాక పరుగులు, అవి రాలేదంటే డాట్ బాల్స్, కుదిరితే ఫోర్లు, బాదితే సిక్సర్లు ఇలా అన్నీ వచ్చిపోయాయి. కానీ ఒక్క వికెట్ రాలితే ఒట్టు. ఈ యువ మెగా టోర్నీలో భారత్‌కు దీటుగా ఉన్న పాక్ బౌలింగ్... భారత్ ఎదురు పడితే మాత్రం బెదిరిపోయింది. ఓపెనర్లు యశస్వి, దివ్యాంశ్ మరొకరికి అవకాశం ఇవ్వకుండా లక్ష్యాన్ని ఛేదించేదాకా క్రీజు వదల్లేదు. అబేధ్యమైన తొలి వికెట్‌కు 176 పరుగులు జోడించి భారత్‌ను దర్జాగా ఫైనల్‌కు చేర్చారు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఈనెల 9న జరిగే ఫైనల్లో భారత్ ఆడుతుంది. ►7 అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ ఏడోసారి ఫైనల్ చేరింది. నాలుగుసార్లు (2000, 2008, 2012, 2018) విజేతగా, రెండుసార్లు (2006, 2016) రన్నరప్‌గా నిలి చింది. ►10 అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో ఛేజింగ్ చేస్తూ భారత్ వరుసగా సాధించిన పదో విజయమిది. 2010 నుంచి భారత్ ఈ టోర్నీలో ఛేజింగ్ చేస్తూ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ►11 ఈ టోర్నీ చరిత్రలో ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం భారత్ కిది వరుసగా 11వసారి. ►1 ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టు నాకౌట్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో నెగ్గడం ఇదే తొలిసారి. ►5 గత ఐదు అండర్–19 ప్రపంచకప్‌లలో సెమీఫైనల్ లేదా ఫైనల్స్‌లో ఐదు సెంచరీలు నమోదు కాగా... ఐదూ భారత ఆటగాళ్లే (2006 సెమీస్– పుజారా (129 నాటౌట్); 2012 ఫైనల్–ఉన్ముక్త్ చంద్ (111 నాటౌట్); 2018 సెమీస్–శుబ్‌మన్ గిల్ (102 నాటౌట్); 2018 ఫైనల్–మన్‌జ్యోత్ (101 నాటౌట్); 2020 సెమీస్–యశస్వి (105 నాటౌట్) చేశారు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: హైదర్ అలీ (సి) రవి బిష్ణోయ్ (బి) యశస్వి 56; హురైరా (సి) సక్సేనా (బి) సుశాంత్ 4; ఫహాద్ (సి) అథర్వ (బి) రవి బిష్ణోయ్ 0; నజీర్ (సి) తిలక్ వర్మ (బి) సుశాంత్ 62; ఖాసీమ్ (రనౌట్) 9; హ్యారిస్ (సి) సక్సేనా (బి) అథర్వ 21; ఇర్ఫాన్ (బి) కార్తీక్ 3; అబ్బాస్ ఎల్బీడబ్ల్యూ (బి) రవి 2; తాహిర్ (సి) జురేల్ (బి) కార్తీక్ త్యాగి 2; ఆమిర్ అలీ (సి) సిద్ధేశ్ వీర్ (బి) సుశాంత్ 1; అమిర్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (43.1 ఓవర్లలో ఆలౌట్) 172. వికెట్ల పతనం: 1–9, 2–34, 3–96, 4–118, 5–146, 6–156, 7–163, 8–169, 9–172, 10–172. బౌలింగ్: కార్తీక్ త్యాగి 8–0– 32–2, సుశాంత్ 8.1–0– 28–3, రవి బిష్ణోయ్ 10–0– 46–2, ఆకాశ్ సింగ్ 7–0–25–0, అథర్వ 7–0–29–1, యశస్వి జైస్వాల్ 3–0–11–1. భారత్ ఇన్నింగ్స్: యశస్వి (నాటౌట్) 105, దివ్యాంశ్ (నాటౌట్) 59; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (35.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 176. బౌలింగ్: తాహిర్ 6–1–17–0, ఖాసీమ్ 8–0–37–0, అమిర్ 5–1– 20–0, అబ్బాస్ 7–0–50–0, ఆమిర్ అలీ 5.2–0–38–0, ఫహాద్ 4–0–12–0. -
వరల్డ్ కప్ యువ భారత్‌దే