undertrial prisoner
-
జిల్లా కోర్టులో కాల్పుల కలకలం.. అండర్ ట్రయల్ ఖైదీ మృతి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా కోర్టు వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. కొందరు గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం అండర్ ట్రయల్ ఖైదీపై కాల్పులు జరిపారు. దీంతో తూటాలు తగిలి ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు, అండర్ ట్రయల్ ఖైదీ లఖన్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు హర్యానా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ సంఘటనలో అండర్ ట్రయల్ ఖైదీతో ఉన్న హర్యానా పోలీసు అధికారికి సైతం గాయలయ్యాయి. అయితే, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అండర్ ట్రయల్ ఖైదీనే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. గాయపడిన పోలీసు అధికారిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. కాల్పులకు పాల్పడిన దుండగులను ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే ఉన్న పోలీసులు సైతం వారిని పట్టుకునే ప్రయత్నం చేయకపోవటం వల్ల దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ కార్యాలయం ఎదుట కారు కలకలం.. బాంబు స్క్వాడ్‌కు సమాచారం! -
విచారణ ఖైదీలకు సుప్రీంకోర్టు ఊరట
న్యూఢిల్లీ: విచారణ ఖైదీలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సగం జైలు శిక్ష అనుభవించిన ఖైదీలను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబర్ 1 నుంచి వారానికొకసారి రెండు నెలలపాటు న్యాయాధికారులు(మేజిస్ట్రేట్, సెషన్స్ జడ్జి, చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) జైళ్లను సందర్శించాలని పేర్కొంది. జైళ్ల సందర్శనలో సగం జైలు శిక్ష అనుభవించిన ఖైదీలను గుర్తించాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విచారణ ఖైదీలకు ఊరట లభించనుంది. విచారణ పూర్తికాక, బెయిల్ దొరకని ఖైదీలు విడుదల కానున్నారు.