unidentified man
-
ఆస్పత్రి లాబీలో కాల్పులు.. ఇద్దరు మృతి
న్యూహాంప్‌షైర్: అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్ర రాజధాని కాంకార్డ్లోని సైకియాట్రిక్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు బలగాల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు. కాల్పుల ఘటన ఆసుపత్రి లాబీ వరకే పరిమితం అయిందని, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామన్నారు. తమ ట్రూపర్ జరిపిన కాల్పుల్లో అనుమానితుడు చనిపోయాడన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సుమారు 185 పడకలున్న న్యూహాంప్‌షైర్ సైకియాట్రిక్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ఏకైక ఆస్పత్రి. -
యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ వద్ద కలకలం
వాషింగ్టన్: వాషింగ్టన్‌లోని యూఎస్ క్యాపిటల్ భవన సముదాయం వద్ద ఆదివారం వేకువజామున అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి కారుతో వచ్చి క్యాపిటల్ వద్ద బారికేడ్లను ఢీకొట్టాడు. వాహనం దిగి గాల్లోకి కాల్పులు జరిపాడు. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అతడు దిగగానే మంటలు చెలరేగి కారు పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో భవన సముదాయంలో కొద్ది మంది సిబ్బందే ఉన్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలు జరిపినప్పటి నుంచి ఫెడరల్ అధికారులకు బెదిరింపులు, ప్రభుత్వ భవనాలపై దాడులు జరుగుతాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. -
కరుణానిధి భార్య ఇంట్లో కలకలం
చెన్నై: అన్నాడీఎంకే సంక్షోభంతో రాష్ట్రమంతా రాజకీయ చర్చోపచర్చలు జరుగుతుండగా డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి ఇంట్లోకి దుండగుడు చొరబడడం కలకలం రేపింది. కరుణానిధి భార్య రజతి అమ్మాల్ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన దుండగుడు ఆమెను తుపాకీతో బెదిరించాడు. రంగంలోకి దిగిన మైలాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ట్రిప్లేన్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఎందుకు ఇంట్లోకి ప్రవేశించాడనే కారణాలపై దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేయడానికి చొరబడ్డాడా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ఉరివేసుకుని గుర్తుతెలియని యువకుడి మృతి
రామాయంపేట మండలం నగరం గ్రామశివారులో ఓ గుర్తుతెలియని యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వృద్దుడు మృతి చెందిన ఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం గత నెల 22న రాత్రి పదిగంటల సమయంలో పాతబోయిన్‌పల్లి చెక్‌పోస్టు సమీపంలో గుర్తు తెలియని వృద్దుడు(65) రోడ్డు పక్కన అపాస్మరకస్థితిలో గాయాలతో ఉండటంతో స్థానికులు బ్లూకోల్ట్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వృద్దుడిని 108లో గాంధీకి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడు, సంబంధీకులు బోయిన్పల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
విశాఖ నగరం గాజువాకలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం చెందాడు. కణితి రోడ్డు గొంతినవానిపాలెం ప్రాంతంలోని ఓ ఇంటి ఆవరణలోని ఇనుపగ్రిల్కు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం ఆ ఇంటి యజమాని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. -
'గుర్తుతెలియని వ్యక్తయితే వైద్యం చేయరా?'
చౌటుప్పల్: మానవత్వం చాటుకోవడానికి మనిషి పేరు, వివరాలు తెలియాల్సిన అవసరం ఉంటుందా? బాధితుడి చిరునామా తెలిస్తే తప్ప బాధ్యత నిర్వర్తించరా? గుర్తు తెలియని వ్యక్తయినంత మాత్రాన చికిత్స అందించకుండా చంపేస్తారా?.. ఇవీ చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిని ప్రజలు అడిగిన ప్రశ్నలు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల కిందట చౌటుప్పల్ ప్రధాన రహదారిపై అపస్మారక స్థితితో పడిఉన్న ఓ వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యులుగానీ, సిబ్బందిగానీ అతడ్ని పట్టించుకున్న పాపాపపోలేదు. గుర్తుతెలియని వ్యక్తికదా, అతడి గురించి మాకేంటనే నిర్లక్ష్యంతో అతడివైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అతను శుక్రవారం మృతిచెందాడు. ఈ తతంగాన్ని గమనించిన తొటి రోగులు విషయాన్ని స్థానిక సీపీఎం నాయకులకు చేరవేశారు. ఆసుపత్రికి చేరుకున్న సీసీఎం నాయకులు వైద్యులను ప్రశ్నించగా.. గుర్తుతెలియని వ్యక్తిని గురించి పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదని, వివరాలు తెలుసుకోకుండా చికిత్స అందించలేమని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన సీపీఎం నేతలు.. వైద్యుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు ఆసుపత్రిలోని రోగులు కూడా వైద్యసిబ్బంది తీరుపట్ల అనేక ఆరోపణలు చేశారు. చికిత్స అందించే అవకాశం ఉండికూడా చిన్నచిన్న రోగాలకు సైతం హైదరాబాద్ కు వెళ్లాలంటున్నారన్నారు.