డెలాయిట్ శుభారంభం
కార్పొరేట్ బాస్కెట్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: డీసీ కార్పొరేట్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో డెలాయిట్ జట్టు శుభారంభం చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డెలాయిట్ 92-68 పాయింట్ల తేడాతో యునెటైడ్ హెల్త్ కేర్‌ను చిత్తు చేసింది. డెలాయిట్ తరఫున ఇర్ఫాన్ 26, హాగ్స్ 20, అనిల్ 19 పాయింట్లు స్కోర్ చేశారు. యూహెచ్‌సీ ఆటగాళ్లలో డెన్నిస్ ఒక్కడే 41 పాయింట్లు సాధించగా... వివేకన్ 10 పాయింట్లు చేశాడు. మరో మ్యాచ్‌లో జెన్‌ప్యాక్ట్ 95-72 స్కోరుతో విర్టుసాపై ఘన విజయం సాధించింది. జెన్ప్యాక్స్ ఆటగాళ్లు సాయి 25, సునీల్ 21, శ్రీకర్ 16, రోహన్ 15 పాయింట్లు చేయగా... విర్టుసా తరఫున సిద్ధార్థ్ 30, సతీశ్ 28, కోటి 12 పాయింట్లు సాధించారు.
ఇతర మ్యాచుల్లో హెచ్ఎస్బీసీ 49-33తో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌పై గెలుపొందింది. హెచ్ఎస్బీసీ ఆటగాళ్లలో అరవింద్, శరత్ చంద్ర చెరో 12 పాయింట్లు సాధించగా, టాటా తరఫున ప్రాన్షు 10, విజయ్, అభిజ్ఞ్యాన్ చెరో 6 పాయింట్లు చేశారు. మరో మ్యాచ్‌లో గూగుల్ 47-10 స్కోరుతో ఏడీపీని ఓడించింది. గూగుల్ తరఫున కృషన్ 13, భవత్ 9, ఆయుష్ 7 పాయింట్లు చేయగా, ఏడీపీ ఆటగాళ్లలో గర్వ్ 6, విశాల్ 4 పాయింట్లు చేశారు.