united slogans
-
నివురుగప్పిన నిప్పులా మారిన విజయనగరం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : విజయనగరంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మూడురోజుల పాటు కొనసాగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలకు మంగళవారం విరామం లభించినట్లయింది. పట్టణం మొత్తం పోలీసుల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ప్రజల సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పాలు, నీళ్లు, మందులు వంటి అత్యవసరాలకు సైతం ప్రజలు అవస్థలు పడ్డారు. పరిస్థితి బయటకు ప్రశాంతంగా కనిపిస్తున్నా.. లోలోపల రాజుకుంటూనే ఉందని చెప్పాలి. పోలీసులు వీధి వీధి శోధిస్తూ అనుమానం వచ్చిన వారందర్నీ అదుపులోకి తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూ సడలించడంతో ప్రజలు నిత్యావసరాల కోసం అవస్థలుపడ్డారు. పెట్రోలు బంకులు, ఏటీఎం కేంద్రాలు, పాల బూత్‌ల వద్ద బారులు తీరారు. సమయం సరిపోక కొన్నిచోట్ల తోపులాటలు చోటుచేసుకున్నాయి. రైతుబజార్లలో డబ్బులు చెల్లించకుండానే ప్రజలు కూరగాయలు, సరుకులు ఎత్తుకెళ్లారు. ఉదయం 8 గంటలకు మళ్లీ కర్ఫ్యూ అమల్లోకి రావడంతో వీధుల్లో కనిపించిన వారినల్లా పోలీసులు తరిమేశారు. ఇప్పటివరకూ 110 మందిని అరెస్టుచేసినట్లు ఎస్పీ కార్తికేయ వెల్లడించారు. అయితే ఇంతకు మూడింతలమంది వారి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీధుల్లో యువకులు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించి ఎక్కడెక్కడో తిప్పి మరుసటిరోజు వదిలిపెడుతున్నారు. నేడు రెండుగంటల పాటు కర్ఫ్యూ సడలింపు మంగళవారం గంటసేపు సడలింపు ఇచ్చిన అధికారులు బుధవారం ఉదయం 7 నుంచి 9 వరకూ కర్ఫ్యూను సడలించనున్నారు. త్వరలో జరగనున్న పైడితల్లమ్మ ఉత్సవాలకు సంబంధించి సిరిమాను చెట్టును పట్టణంలోకి తీసుకొచ్చే ఘట్టం బుధవారం పోలీసు బందోబస్తు మధ్య అతి కొద్దిమందితో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. హైదరాబాద్‌పై అందరికీ హక్కు హైదరాబాద్‌పై అందరికీ హక్కు ఉందని రైతన్నలు నినదించారు. మంగళవారం విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలోని ఖడ్గవలస జంక్షన్లో జరిగిన నాగావళి రైతు గర్జనకు వేలాదిగా అన్నదాతలు తరలివచ్చారు. సమైక్య నినాదాలు మార్మోగించారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇక ముక్కలైతే తీవ్రమయ్యే సాగునీటి ఎద్దడితో సీమాంధ్ర రైతాంగానికి విపరిణామాలే ఎదురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ సభ్యుడు చొక్కాపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ పాల్గొన్నారు. -
కేంద్ర కార్యాలయాలకు తాళం
ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ సెగ శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాకింది. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాలతోపాటు, మండల కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఎన్జీవోలు ముట్డడించి సేవలను స్తంభింపజేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నినదిస్తూ ఏపీ ఎన్జీవో జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి విజయవంతమైంది. సమైక్యాంధ్ర ఉద్యమం లో మేము సైతం అంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి కార్యాలయాల నుంచి బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి సమైక్య నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాల యాలైన బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, పోస్టల్, ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాలతో పాటు జాతీయ బ్యాంకులు మూతబడ్డాయి. ఏలూరులో సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్ ఆర్ఎస్ హరనాథ్, చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది రెవెన్యూ ఉద్యోగులు మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులను మాయించివేశారు. పెనుగొండలో 48 గంటల బంద్, ఉండి బంద్ విజ యవంతమైంది. కామవరపుకోటలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బంద్ పాటిం చారు. తణుకులో రెండో రోజు బంద్ ప్రశాం తంగా ముగియగా, భీమవరంలో 72 గంటల బంద్ శుక్రవారంతో ముగిసింది. 45వ రోజునా నిరసనలు హోరు జిల్లా వ్యాప్తంగా 45వ రోజు సమైక్యవాదులు, ఎన్జీవోలు, వివిధ వర్గాల ప్రజలు తమ నిరసన ల హోరున కొనసాగించారు. ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షల్లో హౌసీ ఉపాధ్యాయులు హోసీ ఆడారు. ఉంగుటూరు జెడ్పీ పాఠశాల పీఈటీ షణ్ముక్ అర్ధనగ్నంగా భిక్షాటన చేస్తూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులు ఇలా మారుతారని వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. పంచాతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల దీక్షా శిబిరం వద్ద ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. జెఏసీ ఆధ్వర్యంలో ఎ.వేమ వరంలో సమైక్యవాదులు భిక్షాటన చేశారు. ఆచంటలో వస్త్ర వ్యాపారులు మానవహారం నిర్వహించారు. అత్తిలిలో విద్యార్థులు రాస్తారో కో చేశారు. ఆరోగ్యసిబ్బంది విధులు బహిష్కరించి నినాదాలు చేశారు. ఉంగుటూరులో ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు వాహనాలను శుభ్రం చేశారు. పాలకొల్లులో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీవోలు గాంధీబొమ్మల సెంట ర్లో రాస్తారోకో నిర్వహించారు. రిలే దీక్షలు చేస్తున్న శిబిరాన్ని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. తాడే పల్లిగూడెంలో టాటా ఏస్ యూనియన్ నాయకులు పొలికేక పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. యూనియన్ సభ్యులు ఖోఖో, కుం టి ఆట, కబడ్డీ ఆటలను రోడ్డుపై ఆడారు. విద్యార్థులు రోడ్డుపై డ్రిల్ చేసి నిరసన తెలి పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నాగు ఆధ్వర్యంలో సాయంత్రం ఐదు గంటలకు రోడ్డుపై వ్యాయామ విన్యాసాలు చేశారు. వెంకట్రామన్నగూడెం ఉద్యాన వర్సి టీ ఉద్యోగ జేఏసీ, పెంటపాడు జేఏసీల ఆధ్యర్యంలో రిలే దీక్షలు, నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. తాళ్లపూడిలో జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు మిలియన్ సమైక్య కోలా ట భేరి నిర్వహించారు. సుమారు ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవే టు స్కూళ్ల ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులతో భారీ మానవహారం ఏర్పాటు చేశారు. కొవ్వూరు రైల్వే స్టేషన్ సెం టరులో మానవహారం నిర్వహించారు. కొవ్వూ రు యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబీఎన్ పీఆర్ఆర్ కళాశాల నుంచి సాగిన ర్యాలీలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు బోసుబొమ్మ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ధర్నా, రాస్తారోకో చేశారు. భీమవరంలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థు లు, ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి సమైక్యాంధ్రను సాధించేవరకు విశ్రమించేది లేదని ప్రతిజ్ఞ చేశా రు. ప్రకాశం చౌక్‌లో సమైక్యవాదులు మానవహారం, రాస్తారోకో చేశారు. ఆందోళనకారులు జాతీయ రహదారిపై పడుకుని నిరసన తెలి పారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉపాధ్యాయులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించి నినాదాలు చేశారు. ఉద్యమకారులు కబడ్డీ, వాలీబాల్, తాడు లాగుడు ఆటలు ఆడా రు. రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉండిలో ఎమ్మెల్యే కలవపూడి శివ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ ఉప్పుమడులు వేసి ఉప్పు కావిడులు, ఎండు చేపలు అమ్ముతూ నిరసన చేపట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో కడియద్ద గ్రామానికి చెందిన పార్టీ నాయకులు 25 మంది రిలే దీక్షలు చేశారు. వీరవాసరంలో వైఎస్సార్ సీపీ నియోజక వర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో 12 మంది పాల్గొన్నారు. -
ఊరూ వాడా సమైక్య నినాదం
అనంతపురం సిటీ/ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి అనంతపురంలో సమైక్య సెగ తాకింది. నగరంలో సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఉద్యమించిన క్రమంలో శనివారం జేసీ దివాకర్‌రెడ్డి సుమారు 50 వాహనాలలో తన అనుచరగణంతో అనంతపురం వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న జాక్టో నాయకుల సాక్షి, అనంతపురం : లక్షల గళాలు ఒక్కటౌతున్నాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని గర్జిస్తున్నాయి. శనివారం 25వ రోజు సమైక్య ఉద్యమ సెగ జిల్లాలో ఉప్పెనలా ఎగిసి పడింది. వైఎస్సార్సీపీ చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధంతో ‘అనంత’ అట్టుడికింది. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు డీఆర్వో హేమసాగర్ ఆధ్వర్యంలో అధికారులు నల్లదుస్తులు ధరించి ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగుతల్లి విగ్రహ ం వరకు సమైక్య నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుతల్లి కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని ప్రతినబూనారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. మునిసిపల్ ఉద్యోగులు మాక్ కోర్టు నిర్వహించి.. రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా, ద్విగ్విజయ్సింగ్, కేసీఆర్‌లకు ఉరిశిక్ష పడేలా తీర్పు వెలువరించారు. ఆర్టీఓ కార్యాలయం ఎదుట జాక్టో దీక్షకు మద్దతు తెలపడానికి మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీని చూసిన జాక్టో నాయకులు అడ్డుకున్నారు. జేసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. పాతూరు విద్యుత్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టిన విద్యుత్ ఉద్యోగులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులకూ ఉద్యమ సెగ తగిలింది. కాలువ దీక్షా శిబిరం వద్దకు చేరుకోగానే.. గమనించిన ఉద్యోగులు ఒక్కసారిగా కాలువ శ్రీనివాసులు గో..బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. మునిరత్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్నారులకు విచిత్ర వేషధారణలు ధరింపజేసి ఒంటెలపై నగరంలో ప్రదర్శన చేశారు. పశుసంవర్ధక శాఖ, గోపాల మిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎడ్ల బండ్లతో ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్సులతో ర్యాలీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సుభాష్‌రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద వంటా-వార్పు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, డ్వామా, ఐకేపీ, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నుల శాఖ, పంచాయతీరాజ్ ఉద్యోగులు, విద్యుత్, మునిసిపల్ ఉద్యోగులు, నీటి పారుదల ఉద్యోగులు, ఆల్ మేవా ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కాగా నగరంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. ఊరూ వాడా సమైక్య నినాదం ధర్మవరంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పలు పార్టీలు, ప్రజా సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. స్వర్ణకారుల సంఘం, విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. ముదిగుబ్బలో చిరు వ్యాపారులు బంద్ పాటించారు. గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణాల్లో జాక్టో, వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో విద్యుత్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హిందూపురంలో పౌరాణిక వేషధారణలతో యాదవ కులస్తులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తపాలా, టెలిఫోన్ కార్యాలయాలను సమైక్య వాదులు బంద్ చేయించారు. అంబేద్కర్ సర్కిల్లో విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగులు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. కదిరి పరిసర మండలాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులు రిలే నిరాహార దీక్ష చేశారు. కదిరి డివిజన్ లోని ఉపాధ్యాయులు విజిల్ వేసుకుంటూ వినూత్నంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి అనంతరం రిలేదీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. తనకల్లులో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. విచిత్ర వేషధారణలతో సమైక్య వాదులు ర్యాలీ చేశారు. మడకశిరలో ఉపాధ్యాయులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాహుల్ పెళ్లి కోసం భిక్షాటన చేసి.. సోనియాకు మనియార్డర్ చేశారు. మహమ్మదాబాద్ నుంచి అమడగూరు వరకు సమైక్యవాదులు పాదయాత్ర చేశారు. ఓడీ చెరువు మండలంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండ, సోమందేపల్లె, రొద్దం దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పరిగిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రిలేదీక్షలు చేపట్టారు. రాయదుర్గంలో ఫుట్‌వేర్ వ్యాపారులు, విశ్వభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పశుసంవర్ధశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు, జిరాక్స్ బుక్‌స్టాల్స్ నిర్వాహకుల ఆధ్వర్యంలో చిరిగిన దుస్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కణేకల్లులో ఎన్జీవోలు రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. రాప్తాడులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సీకేపల్లెలో టింబక్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రపై చర్చా వేదిక నిర్వహించారు. పుట్లూరు, నార్పల, బీకేఎస్ మండలాల్లో జేఏసీ, నాన్పొలికల్ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో జేఏసీ, మునిసిపల్, ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. యాడికి, పెద్దపప్పూరులలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో సమైక్యవాదులు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలకు ప్రజల నుంచి సంఘీభావం వెల్లువెత్తింది. మైనార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకొని ఉపాధ్యాయినులు ర్యాలీ నిర్వహించారు. వజ్రకరూరులో దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. -
సమైక్య సెగతో ముఖం చాటేసిన కేంద్ర మంత్రులు
సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సమైక్య నినాదంతో హోరెత్తిస్తున్నారు. కానీ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. కనీసం ప్రజలకు మద్దతు ప్రకటించే ధైర్యం కూడా చేయడం లేదు. విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : సమైక్యాంధ్ర ఉద్యమంతో జిల్లా అట్టుడికిపోతున్నా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు పురందేశ్వరి, కిశోర్ చంద్రదేవ్‌లు పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. రాజీనామాలు చేయాల్సి వస్తుందని తప్పించుకు తిరుగుతున్నారు. వీరి వైఖరిపై ప్రజలు మండిపడుతున్నారు. విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పురందేశ్వరి, అరకు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కిశోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. విశాఖ ఎంపీ టికెట్‌కు టి.సుబ్బరామిరెడ్డి పోటీకి దిగడంతో తన లోక్‌సభ నియోజక వర్గం పరిధిలోని ప్రజలతో సంబంధాలు పెంచుకోవడానికి పురందేశ్వరి కొంత కాలంగా అడపా దడపా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. కిశోర్ చంద్రదేవ్ అరకు ఎంపీగా ఉన్నా ఆయన తన నియోజక వర్గ పరిధిలో పర్యటించిన సందర్భాలు చాలా అరుదు. గత నెల 30వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో జిల్లాలో సైతం ఉద్యమం ప్రారంభమైంది. ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే డిమాండ్ జనం నుంచి తీవ్రమైంది. ఉద్యమం రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండడంతో నియోజక వర్గాలకు వస్తే ఓటర్ల నుంచి ఎదురు దాడికి గురి కావాల్సి వస్తుందనే భయంతో కేంద్ర మంత్రులిద్దరూ ఇటు వైపే రావడం మానేశారు. కిశోర్ చంద్రదేవ్ అయితే తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. పురందేశ్వరి ఈ మాట నేరుగా అనక పోయినా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వద్దన్నారని తాను రాసిన రాజీమానా లేఖను ఆయనకు ఇవ్వకుండానే తిరుగుముఖం పట్టారు. లోక్‌సభలో సమైక్యాంధ్ర గొడవ జరుగుతున్నా పురందేశ్వరి, కిశోర్ చంద్రదేవ్ ఇది తమకు సంబంధంలేని వ్యవహారం అన్నట్లుగా వ్యవహరించారు. అధిష్టానం అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కదనే భయంతో ఉద్యమానికి బహిరంగంగా మద్దతు తెలిపేందుకు కూడా ఇష్టపడడం లేదు. కేంద్ర మంత్రుల తీరుపై జిల్లా జనం మండిపడుతున్నారు. తాము ఓట్లేసి గెలిపించిన ఎంపీలు జనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శకు కూడా రాకపోవడం దారుణమని ఆగ్రహిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమంలో నేరుగా పాల్గొనకుండా ఉద్యమ కారులకు సంఘీభావం తెలపడానికే పరిమితమయ్యారు.