ఏలూరు, న్యూస్‌లైన్ :
సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ సెగ శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాకింది. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాలతోపాటు, మండల కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఎన్జీవోలు ముట్డడించి సేవలను స్తంభింపజేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నినదిస్తూ ఏపీ ఎన్జీవో జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి విజయవంతమైంది. సమైక్యాంధ్ర ఉద్యమం లో మేము సైతం అంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి కార్యాలయాల నుంచి బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి సమైక్య నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ కార్యాల యాలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసీ, పోస్టల్, ఇన్‌కమ్ టాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయాలతో పాటు జాతీయ బ్యాంకులు మూతబడ్డాయి. ఏలూరులో సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్ ఆర్‌ఎస్ హరనాథ్, చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది రెవెన్యూ ఉద్యోగులు మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బ్యాంకులను మాయించివేశారు. పెనుగొండలో 48 గంటల బంద్, ఉండి బంద్ విజ యవంతమైంది. కామవరపుకోటలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బంద్ పాటిం చారు. తణుకులో రెండో రోజు బంద్ ప్రశాం తంగా ముగియగా, భీమవరంలో 72 గంటల బంద్ శుక్రవారంతో ముగిసింది.
45వ రోజునా నిరసనలు హోరు
జిల్లా వ్యాప్తంగా 45వ రోజు సమైక్యవాదులు, ఎన్జీవోలు, వివిధ వర్గాల ప్రజలు తమ నిరసన ల హోరున కొనసాగించారు. ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ జేఏసీ దీక్షల్లో హౌసీ ఉపాధ్యాయులు హోసీ ఆడారు. ఉంగుటూరు జెడ్పీ పాఠశాల పీఈటీ షణ్ముక్ అర్ధనగ్నంగా భిక్షాటన చేస్తూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రులు ఇలా మారుతారని వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు.
పంచాతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల దీక్షా శిబిరం వద్ద ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి మోకాళ్లపై నిలబడి సమైక్య నినాదాలు చేశారు. జెఏసీ ఆధ్వర్యంలో ఎ.వేమ వరంలో సమైక్యవాదులు భిక్షాటన చేశారు. ఆచంటలో వస్త్ర వ్యాపారులు మానవహారం నిర్వహించారు. అత్తిలిలో విద్యార్థులు రాస్తారో కో చేశారు. ఆరోగ్యసిబ్బంది విధులు బహిష్కరించి నినాదాలు చేశారు. ఉంగుటూరులో ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు వాహనాలను శుభ్రం చేశారు. పాలకొల్లులో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీవోలు గాంధీబొమ్మల సెంట ర్‌లో రాస్తారోకో నిర్వహించారు. రిలే దీక్షలు చేస్తున్న శిబిరాన్ని ఆర్థికవేత్త పెంటపాటి పుల్లారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. తాడే పల్లిగూడెంలో టాటా ఏస్ యూనియన్ నాయకులు పొలికేక పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. యూనియన్ సభ్యులు ఖోఖో, కుం టి ఆట, కబడ్డీ ఆటలను రోడ్డుపై ఆడారు. విద్యార్థులు రోడ్డుపై డ్రిల్ చేసి నిరసన తెలి పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నాగు ఆధ్వర్యంలో సాయంత్రం ఐదు గంటలకు రోడ్డుపై వ్యాయామ విన్యాసాలు చేశారు. వెంకట్రామన్నగూడెం ఉద్యాన వర్సి టీ ఉద్యోగ జేఏసీ, పెంటపాడు జేఏసీల ఆధ్యర్యంలో రిలే దీక్షలు, నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.
తాళ్లపూడిలో జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు మిలియన్ సమైక్య కోలా ట భేరి నిర్వహించారు. సుమారు ఐదు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రైవే టు స్కూళ్ల ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులతో భారీ మానవహారం ఏర్పాటు చేశారు. కొవ్వూరు రైల్వే స్టేషన్ సెం టరులో మానవహారం నిర్వహించారు. కొవ్వూ రు యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబీఎన్ పీఆర్‌ఆర్ కళాశాల నుంచి సాగిన ర్యాలీలో కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు బోసుబొమ్మ సెంటర్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ధర్నా, రాస్తారోకో చేశారు. భీమవరంలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థు లు, ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి సమైక్యాంధ్రను సాధించేవరకు విశ్రమించేది లేదని ప్రతిజ్ఞ చేశా రు.
ప్రకాశం చౌక్‌లో సమైక్యవాదులు మానవహారం, రాస్తారోకో చేశారు. ఆందోళనకారులు జాతీయ రహదారిపై పడుకుని నిరసన తెలి పారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఉపాధ్యాయులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించి నినాదాలు చేశారు. ఉద్యమకారులు కబడ్డీ, వాలీబాల్, తాడు లాగుడు ఆటలు ఆడా రు. రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉండిలో ఎమ్మెల్యే కలవపూడి శివ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ ఉప్పుమడులు వేసి ఉప్పు కావిడులు, ఎండు చేపలు అమ్ముతూ నిరసన చేపట్టారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో కడియద్ద గ్రామానికి చెందిన పార్టీ నాయకులు 25 మంది రిలే దీక్షలు చేశారు. వీరవాసరంలో వైఎస్సార్ సీపీ నియోజక వర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో 12 మంది పాల్గొన్నారు.
కేంద్ర కార్యాలయాలకు తాళం
Published Sat, Sep 14 2013 1:26 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement