Unnikrishnan
-
అవన్నీ మర్చిపోలేని జ్ఞాపకాలు: ‘మేజర్’ దర్శకుడు శశికిరణ్ తిక్క
‘‘మేజర్’కి తెలుగులో అద్భుతమైన ఆదరణ వస్తోంది. బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. కమల్‌గారి ‘విక్రమ్, అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్విరాజ్’ చిత్రాలతో పోలిస్తే మాది చిన్న చిత్రం.. అయినా వాటితో పాటే ఆదరణ పొందడం హ్యాపీ. ‘మేజర్’కి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తి ఇచ్చింది’అని అన్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఆయన దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్. అనురాగ్, శరత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శశికిరణ్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ►మేజర్ సినిమా వాస్తవానికి 2020 లోనే విడుదల అవ్వాలి. 40 పర్సెంట్ షూటింగ్ కేవలం 3 నెలల్లో పూర్తి చేశాం. అదే వేగంతో చేసుకుంటూ వెళ్తే సినిమా వేగంగా ఫినిష్ అయ్యేది. ఇంతలో లాక్ డౌన్ వచ్చి పడటం వల్ల సినిమా ఆపేయాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ మొదలుపెట్టే టైమ్ కు ప్రకాష్ రాజ్, రేవతి వంటి పెద్ద ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదు. డబ్బింగ్ సహా మొత్తం పనులన్నీ అలా స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాం. ►ఈ చిత్రాన్ని మేము నిజాయితీగా తెరకెక్కించాం. కమర్షియాలిటీ కోసం కావాలంటే పాటలు, ఫైట్స్ పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా ఆ లైన్ క్రాస్ కాలేదు. కథను ఎంత హుందాగా, సహజంగా తెరకెక్కించాలో అదే పద్ధతిలో రూపొందిస్తూ వెళ్లాం. ►నాకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ‘మేజర్’తో ఆ రెండూ నాకు దక్కాయి. నాకే పేరు రావాలనుకోను. నా సినిమాకు మంచి పేరొస్తే నాకు వచ్చినట్లే. ‘మేజర్’ చిత్రాన్ని నిజాయితీగా తెరకెక్కించాం. ►మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే సంతోషం మిగిలింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. మేజర్ సినిమా ప్రివ్యూ చూశాక సందీప్ వాళ్ల మదర్ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది. ►ఇవాళ కొత్త దర్శకులకు ఇండస్ట్రీలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సినిమా మీద ప్యాషన్ ఉండి, ఏదైనా మంచి కథ ఉంటే ఓటీటీల నుంచి, ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీ దగ్గరకు అవకాశాలు రావు మీరే సృష్టించుకోవాలి. యంగ్ ఫిలింమేకర్స్ కు నేను ఇదే చెప్పాలనకుంటున్నా. మా టైమ్ లో ఇంత టెక్నాలజీ లేదు, ఓటీటీ వేదికలు లేవు, స్క్రిప్టు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వారికి ఎన్నో వేదికలు వస్తున్నాయి. ► ‘మేజర్’కు వచ్చిన పేరు, నాకు వచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేయా లనుకుంటున్నాను. బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా తీయాలని ఉంది. నా తర్వాతి సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్లో ఉంటుంది. నా వద్ద అసిస్టెంట్‌గా చేసిన ఒకర్ని ‘గూఢచారి 2’ ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. అయితే ‘గూఢచారి’ ఫ్రాంచైజీలో ఓ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తాను. (చదవండి: బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు) -
రియల్ హీరో ఉన్ని కృష్ణన్ పక్కన "రీల్ మేజర్" ను చూశారా? (ఫొటోలు)
-
వారు కూడా నా కుటుంబమే:అడవి శేష్
-
మేజర్ కోసం అదిరిపోయే ఆరు సెట్లు!
ముంబయ్‌లోని గేట్‌వే ఆఫ్ ఇండియా, తాజ్ ప్యాలెస్‌ని ‘మేజర్’ సినిమా కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా. అడివి శేష్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ఇది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు ఏఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. 26/11 ముంబయ్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిలో తన ప్రాణాలను పణంగా పెట్టి, ప్రజలను కాపాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘మేజర్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం కోసం ఆరు భారీ సెట్స్ నిర్మించిన ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ మాట్లాడుతూ– ‘‘ముంబయ్‌లోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్, ఎన్ఎస్జీ కమాండోలకు సంబంధించిన ‘సెట్‌ని కూడా తీర్చిదిద్దాం. ముఖ్యంగా తాజ్ ప్యాలెస్ సెట్ వేయడానికి బాగా కష్టపడ్డాం. సినిమాలో తాజ్ హోటల్ని సెట్ ప్రాపర్టీలాగా కాకుండా ఓ క్యారెక్టర్లా ఊహించుకోవాలని అడివి శేష్ చెప్పడంతో రియల్ తాజ్ ప్యాలెస్‌లా సెట్ వేశాం. తాజ్‌లో గ్రాండ్ స్టెయిర్ కేస్, టాటా ఐకానిక్ ఇమేజ్, ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్స్ వంటి వాటిని రీ–క్రియేట్ చేశాం. 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్‌ను ఫైబర్, ఉడ్, ఐరన్ ఉపయోగించి తయారు చేశాం’’ అన్నారు. చదవండి: గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే -
ఉన్నికృష్ణన్ ప్రయాణం
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి విలక్షణమైన హిట్ చిత్రాల్లో నటించి, హీరోగా అడివి శేష్ చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన టైటిల్ రోల్లో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తాజా ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శేష్ బర్త్‌డే సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికష్ణన్ జర్నీని, ఆయన జీవన శైలిని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మిస్తోంది. వచ్చే సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానుంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాశ్ రాజ్, సయీ మంజ్రేకర్, రేవతి, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. -
సయీ.. ఆయా
బాలీవుడ్ భామలు టాలీవుడ్‌కి రావడం కొత్తే కాదు. ఇప్పుడు మరో బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఆమె ఎవరో కాదు.. పలు తెలుగు చిత్రాల్లో నటించిన నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె. తండ్రి బాటలో సయీ కూడా తెలుగుకి ఆయా (వచ్చింది) అన్నమాట. ‘మేజర్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించనుందామె. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్–3’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సయీ అందర్నీ ఆకట్టుకున్నారు. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ‘మేజర్’ షూటింగ్లో పాల్గొననున్నారామె. 2008 నవంబర్ 26న జరిగిన ముంబై టెర్రరిస్ట్ దాడుల్లో మృతి చెందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ అడివి నటిస్తున్నారు. ఇందులో శోభిత దూళిపాళ్ల హీరోయిన్. సయీ మంజ్రేకర్‌ది కీలక పాత్ర. జి.యం.బి ఎంటర్టైన్మెంట్ పతాకంపై మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్, ఏప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి Ô¶ శికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. -
మరో దాడి జరిగితే యుద్ధమే..!
ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.. ముంబై/వాషింగ్టన్: 26/11 అంతటి తీవ్ర దాడులు భారత్‌పై మరోసారి జరిగితే భారత్, పాక్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్ గోయెల్ మాట్లాడుతూ ‘భారత్–పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల్ని పారిపోనిచ్చారు ఫొటో జర్నలిస్ట్ సెబాస్టియన్ ముంబై మారణహోమం సందర్భంగా ఉగ్రవాదులను నిలువరించే అవకాశమున్నప్పటికీ భయపడ్డ మహారాష్ట్ర పోలీసులు వారిని పారిపోనిచ్చారని కసబ్ ఫొటోను షూట్చేసిన జర్నలిస్ట్ సెబాస్టియన్ డిసౌజా అలియాస్ సబీ(67) తెలిపారు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2008, నవంబర్ 26న నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా పక్కనే ఉన్న సీఎస్టీలో కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే నా కెమెరా, లెన్సులు తీసుకుని కిందకు పరిగెత్తాను. రైల్వేస్టేషన్‌లోకి దూరి ఓ బోగీలో దాక్కున్నా. కానీ అక్కడి నుంచి ఫొటో తీయడానికి యత్నించగా కుదరలేదు. దీంతో మరో బోగీలోకి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఉగ్రవాదుల ఫొటోలు తీశాను’ అని చెప్పారు. క్రూరంగా నవ్వుతూ కాల్పులు సీఎస్టీ అనౌన్సర్ విష్ణు ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వేస్టేషన్ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె(47) గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నా. కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయింది. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్‌ఫామ్ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పా. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరాను. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న కసబ్ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు’ అంటూ నాటి అనుభవాలను విష్ణు గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఫెయిల్ ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ పౌరుడు కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్ కుమార్ రత్ కసబ్ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్ ఫ్రంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్స్’ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్‌కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఇది ఎవరికైనా తెలిస్తే భారత్‌పై దాడిచేసే మార్గాలు మూసుకుపోతాయన్న భయంతో టాప్ కమాండర్లు హఫీజ్ సయీద్, జకీవుర్ రెమ్మాన్ లఖ్వీ గోప్యత పాటించారు. ముంబైపై 2008, నవంబర్ 26న దాడికి ముందు లష్కరే చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2008, సెప్టెంబర్‌లో ఉగ్రవాదులను తీసుకెళుతున్న బోటు సముద్రంలో ఓ రాయిని ఢీకొని మునిగిపోయింది. దీంతో లష్కరే వర్గాలు కొనప్రాణాలతో ఉన్న తమ ఉగ్రవాదుల్ని కాపాడాయి. ఇక రెండోసారి నవంబర్ 7న ఉగ్రవాదుల బృందం మరోసారి భారత్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఓ బోటు కెప్టెన్‌ను లొంగిపోవాల్సిందిగా ఉగ్రవాదులు కోరగా, అతను నిరాకరించి పడవను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ‘ఆపరేషన్ కసబ్’ ఇలా.. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చాలా రహస్యంగా సాగాయని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘కసబ్‌ను ఉరితీయడం కోసం ఆర్థర్రోడ్ జైలులోని అండా సెల్ నుంచి పుణెలోని ఎర్రవాడ కేంద్ర కారాగారానికి తరలించడానికి నవంబర్ 20న రాత్రి ఏర్పాట్లు పూర్తిచేశాం. రాత్రిపూట కసబ్‌ను పోలీస్ వ్యానులో ఎక్కించాం. మహారాష్ట్ర పోలీసులకు చెందిన ఫోర్స్ వన్ కమాండో బృందం ఈ వాహనానికి రక్షణగా బయలుదేరింది. ఎక్కువ కార్లు ఒకేసారి వెళితే అనుమానం రావొచ్చన్న ఆలోచనతో రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు కొంతదూరం నుంచి ఈ వాహనాలను వెంబడించాయి. ఈ ఆపరేషన్ ముగిసేవరకూ ఇందులో పాల్గొన్న అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అర్ధరాత్రి కసబ్‌ను ఎర్రవాడ జైలు అధికారులకు అప్పగించగానే..‘పార్సిల్ రీచ్డ్ ఫాక్స్’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి సంకేత భాషలో మిగతావారికి సమాచారం చేరవేశారు. ఉరితీత నోటీసులను వారంరోజుల కసబ్‌కు అందజేశాం. చివరికి నవంబర్ 21న తెల్లవారుజామున 3 గంటలకు కసబ్‌ను ఉరితీశారు. ఆ తర్వాత కసబ్ ఉరి వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది’ అని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. -
26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం
‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’. ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ అని! పాకిస్తానీ టెర్రరిస్ట్ కసబ్. ముంబైపై ఉగ్రదాడుల సూత్రధారి! 2008 నవంబర్ 26–27 మధ్య.. ఆ అర్ధరాత్రి, ముంబైలో ఏకకాలంలో కనీసం పదిచోట్ల బాంబు దాడులు జరిపించి, 174 మంది దుర్మరణానికి, మూడొందల మందికి పైగా క్షతగాత్రులవడానికి కారణమైన లష్కరే తోయిబా టెర్రరిస్ట్. అతడి చివరి మాటలివి. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. అంతకు నాలుగేళ్ల క్రితమే.. ముంబై పేలుళ్లు జరిగిన మరుసటి రోజు.. మళ్లీ ఇలాంటి ఘోరం జరగనిచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రతిన పూనింది. మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమైనా మారిందా? మారిందని మనకు అనిపించవచ్చు. అయితే టెర్రరిస్టులను సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీస్ అధికారుల కుటుంబాల పరిస్థితి మాత్రం ఏం మారలేదని అంటున్నారు. అసలు పరిస్థితిని మార్చుకోవలసినంతగా ఎందుకు మనం నిర్లక్ష్యం వహించామని అడుగుతున్నారు. ఆ ఐదుగురి గురించి ఒక మననం. ఆ కుటుంబాల గురించి ఒక అవలోకనం. హేమంత్ కర్కరే ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్. దాదర్‌లోని తన ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది కర్కరేకి. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం! కర్కరే రైల్వే స్టేషన్‌కి వెళ్లే సరికే ఉగ్రవాదులు అక్కడి నుంచి కామా ఆల్బ్లెస్ హాస్పిటల్‌కి మూవ్ అయ్యారు. కర్కరే మిగతా ఆఫీసర్స్‌ని కలుపుకుని ఆల్బ్లెస్కి వెళ్లారు. కొంతమందిని అక్కడ ఉంచి.. కర్కరే, కామ్తే, సలాస్కర్ క్వాలిస్ జీప్ ఎక్కారు. ఒక ఎర్ర కారు వెనుక టెర్రరిస్టులు నక్కి ఉన్నారని వైర్లెస్లో ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి Ðð ళ్లారు. ఎర్ర కారులోని టెర్రరిస్టులు వీళ్లను గుర్తించి కాల్పులు జరిపారు. మొదట కర్కరే ఏకే 47 కింద పడింది. ఆ వెంటనే కర్కరే నేలకు ఒరిగాడు. హేమంత్ కర్కరే, కవిత కుటుంబం: భార్య కవిత, కొడుకు ఆశాశ్, కూతుళ్లు సయాలి, జూయీ. ఇదీ హేమంత్ కుటుంబం. కవిత (57) 2014లో బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారు. ఆమె అభీష్టానుసారం పిల్లలు.. తల్లి అవయవాలను ఆసుపత్రికి డొనేట్ చేశారు. తన భర్త మరణానికి కారణం భద్రతా లోపాలేనని కవిత ఎప్పుడూ అంటుండేవారు. పోలీస్ సిబ్బందికి అధునాతనమైన ఆయుధాలను ఇవ్వాలని, వాళ్లను ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేసే వ్యవస్థ ఉండాలని ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. తుకారామ్ ఆంబ్లే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. టెర్రరిస్టులు మెరైన్ డ్రైవ్ వైపు వెళుతున్నారని సమాచారం రావడంతో.. ఆ దారిని బ్లాక్ చేసే డ్యూటీని తుకారామ్‌కి అప్పజెప్పింది డిపార్ట్మెంట్. కారును ఆపాడు. ఒట్టి చేతుల్తో కసబ్‌తో కలియబడి అతడి దగ్గరున్న బుల్లెట్లన్నీ లాగేసుకున్నాడు. తుకారామ్ ఆ పని చేయకపోయుంటే.. కసబ్ తనని తను కాల్చుకుని ఉండేవాడేమో. టెర్రరిస్టులతో జరిగిన ఆ ఘర్షణలోనే తుకారామ్ మరణించాడు. తుకారామ్ ఆంబ్లే, తారాబాయి కుటుంబం: తుకారామ్ ఆంబ్లేకి నలుగురు కూతుళ్లు. పవిత్ర, వందన, వైశాలి, భారతి. కొడుకులు లేరు. భార్య తారాబాయి. ఉగ్రదాడుల్లో తుకారామ్ చనిపోయే నాటికి పవిత్రకు, వందనకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆ ఇంట్లో ప్రస్తుతం తారాబాయి, వైశాలి, భారతి ఉంటున్నారు. ‘‘ఇప్పటికీ.. మా నాన్న డ్యూటీ అయిపోయాక, ఇంట్లోకి రాగానే తలపై నుంచి టోపీ తీసి రోజూ పెట్టే చోటే తగిలించి, మా వైపు చూసి నవ్వుతూ ‘ఏంటి విశేషాలు..’ అని అడుగుతున్నట్లే ఉంటుంది. కానీ మాకు తెలుసు మా నాన్న తిరిగి రారని. వస్తే బాగుండని అనిపిస్తుంది’’ అని అంటుంది వైశాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సందీప్ ఆర్మీ ఆఫీసర్. తాజ్ హోటల్లోని ఆరో ఫ్లోర్లో ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు అక్కడికి ఎన్.ఎస్.సి. (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) టీమ్‌ని లీడ్ చేసింది సందీపే. మొత్తం పదిమంది కమాండోలు. వారికి గైడ్‌లైన్స్ ఇస్తున్న సమయంలో వెనుక నుంచి జరిగిన కాల్పుల్లో సందీప్ చనిపోయాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, అమ్మ ధనలక్ష్మి కుటుంబం: అమ్మ ధనలక్ష్మి, నాన్న ఉన్నికృష్ణన్.. సందీప్, వీళ్ల ముగ్గురే. సందీప్ ఒకడే సంతానం. పెళ్లి కావలసి ఉంది. ఉగ్రవాదులతో తలపడుతున్నప్పుడు.. ‘‘ముందుకు వెళ్లకండి. నేను హ్యాండిల్ చేస్తాను’’ అన్నవి అతడి చివరి మాటలు. ఆపరేషన్‌లో పాల్గొన్న మిగతా కమాండోలను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు. ‘‘నా కొడుకు చనిపోలేదు. బతికే ఉన్నాడు’’ అని అంటుంటారు ధనలక్ష్మి.. ఎవరు ఆనాటి సంఘటనను ప్రస్తావించినా. అశోక్ కామ్తే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎటాక్ జరుగుతున్న ఏరియా అతడి పరిధిలోని కాదు. కానీ టెర్రరిస్టులు అనగానే అక్కడి ఆఫీసర్స్కి సహకారం అందించడానికి బయల్దేరాడు. సి.ఎస్.ఎం.టి. రైల్వే స్టేషన్లో హేమంత్ కర్కరేకి, విజయ్ సలాస్కర్కి జత కలిశాడు. వారితో కలిసి క్వాలిస్ జీప్ ఎక్కాడు. వీళ్ల జీప్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుంటే.. చివరి వరకు అతడి తుపాకీ గర్జిస్తూనే ఉంది. కర్కరే, సలాస్కర్, తర్వాత అశోక్ కామ్తే టెర్రరిస్టుల బులెట్లకు బలి అయ్యాడు. అశోక్ కామ్తే, వినీత కుటుంబం: అశోక్, ఆయన భార్య వినీత, ఇద్దరు కొడుకులు రాహుల్, అర్జున్, అశోక్ తల్లిదండ్రులు, చెల్లి షర్మిల అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. అశోక్ మరణంతో ఆ కుటుంబం ఆత్మస్థయిర్యం సడలింది కానీ, అశోక్ భార్య ధీశాలిగా కుటుంబం కోసం నిలబడ్డారు. భర్త జీవిత చరిత్రను ‘టు ద లాస్ట్ బుల్లెట్’ అనే పుస్తకంగా తెచ్చారు. వినీత లా చదివారు. కార్మికుల కేసులను వాదిస్తుంటారు. అశోక్ చనిపోయాక, ఆయన ఉండే గదికి ఆ కుటుంబం ఒక బోర్డును పెట్టింది. ‘‘మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాం. మీరు మా హీరో’ అని అందులో రాసి ఉంటుంది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే తన భర్త.. ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడని వినీత ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. విజయ్ సలాస్కర్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. యాంటీ–ఎక్స్టార్షన్ (బలవంతపు వసూళ్ల నిరోధం) హెడ్డు. కర్కరే, కామ్తేలతో పాటు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. విజయ్ సలాస్కర్ భార్య స్మిత కుటుంబం: విజయ్ సలాస్కర్ భార్య స్మిత. కూతురు దివ్య ఏకైక సంతానం. విజయ్ చనిపోయేటప్పటికే ఆమె వయసు 21. ‘‘డాడీ ఎప్పుడూ త్వరగా ఇంటికి రారు. కానీ ఆ రోజు రాత్రి (నవంబర్ 26) త్వరగా వచ్చారు. ‘‘త్వరగా వచ్చారేంటి డాడీ’’ అన్నాను. ‘‘నిన్ను సర్ప్రైజ్ చేద్దామనీ’’ అని నవ్వుతూ అన్నారు. ‘‘అయితే లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తినాల్సిందే’’ అన్నాను. మమ్మీ తిట్టింది. ‘‘ముందు ఆయన్ని భోజనం చెయ్యనివ్వు. తర్వాత వెళ్దువు’’ అంది. నేను.. నా బెడ్రూమ్లోకి వెళ్లాను. అంతే. ఆ తర్వాత డాడీకి ఏదో కాల్ వచ్చింది. వెంటనే వెళ్లిపోయారు. 11.57 కి ‘‘ఎక్కడున్నారు?’’ అని మమ్మీ డాడీకి ఫోన్ చేసింది. ‘‘స్పాట్’లో అని చెప్పారట డాడీ. చెప్పుడూ చెప్పే జవాబే! ‘‘ఇదేం బాగోలేదు’’ అంటోంది మమ్మీ. కొంతసేపటి తర్వాత టీవీ స్క్రోలింగ్‌లో డాడీ చనిపోయినట్లు వచ్చింది’’.. అని మాత్రం షేర్ చేసుకోగలుగుతున్నారు దివ్య. ఆ తర్వాతి ఘటనలు గుర్తు చేసుకోడానికి ఆమె ఇష్టపడడం లేదు. వీళ్లైదుగురే కాదు. బ్రేవ్ హార్ట్స్ ఇంకా ఉన్నాయి. హవల్దార్ గజేంద్రసింగ్, నాగప్ప మహాలే, కిశోర్, షిండే, సంజయ్ గోవిల్కర్ వంటి ఎందరో ఉగ్రమూకలతో ప్రాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షతగాత్రులయ్యారు. పాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షత గాత్రులయ్యారు. -
తొలి పాటకే జాతీయ అవార్డు
నేను పాడిన తొలి పాటకే జాతీయ అవార్డు రావడం చెప్పలేనంత ఆనందంగా ఉందని తొమ్మిదేళ్ల బాల గాయని ఉత్తర ఉన్నికృష్ణ అన్నారు. ‘సైవం’ చిత్రంలో ‘అళగా అళగా’ పాటను ఆలపించిందామె. ప్రముఖ గాయకుడు ఉన్నికృష్ణ కూతురు ఉత్తర. ఉన్నికృష్ణ కూడా తన తొలి చిత్రం ‘కాదలన్’తో 1994లో జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.