unplanned
-
ముందుచూపులేని ‘లాక్డౌన్’
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం అవసరమే అయినప్పటికీ అమలు విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికారహితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆక్షేపించారు. కేంద్రం తీరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వలస కూలీలు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, నేతలు రాహుల్ గాంధీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా మహమ్మారి వల్ల పేదలు, బలహీనులే ఎక్కువగా ఇక్కట్ల పాలవుతున్నారని సోనియా గాంధీ పేర్కొన్నారు. లక్షలాది మంది వలస కూలీలు వందలాది కిలోమీటర్లు నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు తనను కలచివేస్తున్నాయని చెప్పారు. వారికి కనీసం కడుపునిండా ఆహారం కూడా అందించకపోవడం బాధాకరమన్నారు. ఈ పరిస్థితికి కేంద్రమే కారణమని ఆరోపించారు. కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి అత్యాధునిక రక్షణ పరికరాలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని సోనియా కోరారు. -
సోనియా అల్లుడికి ఆగ్రహం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా అమలు చేసిన కార్యక్రమం పెద్ద నోట్ల రద్దు అని అన్నారు. ప్రణాళికలు చేసుకున్నట్లు ప్రభుత్వం వద్ద కానీ, ఆర్బీఐ వద్దగానీ ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. పెద్ద నోట్లను రద్ద చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న దాదాపు నెల రోజుల తర్వాత వాద్రా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా డిపాజిట్ దారులు ఐదు వేల కంటే మొత్తాన్ని ఏకకాలంలో చేయాలని, అది కూడా సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే డిపాజిట్లు చేసేందుకు అనుమతి ఉంటుందని తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకునన్న నేపథ్యంలో రాబర్ట్ వాద్రా తన ఫేస్ బుక్ పేజీలో స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతోపాటు తన అభిప్రాయాన్ని కూడా ఒక ఫొటో ప్రేమ్లాగా తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్రం ప్రజలపైనా ప్రయోగాలు చేస్తుందని, ఇంకెంతకాలం, ఇంకెంత ప్రయోగం చేస్తారని ప్రశ్నించారు. ఒకేసారి రూ.5000 కంటే ఎక్కువమొత్తాన్ని జమ చేయాలనే నిర్ణయంతో కేంద్ర ఆర్థిక సంస్థ ఇక విచారణ సంస్థగా మారినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్నపిచ్చి చర్యల కారణంగా అమాయకులైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదంతా చూస్తుంటే చాలా బాధేస్తుందని అన్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు చూసి తాను ఎంతో బాధపడుతున్నానని తెలిపారు.