unrecognised political party
-
మన దాడుల న్యూస్‌తో ప్రచారం వచ్చి గుర్తింపు వస్తుందేమో సార్!
మన దాడుల న్యూస్‌తో ప్రచారం వచ్చి గుర్తింపు వస్తుందేమో సార్! -
జనసేనకు ‘గాజు గ్లాసు’ ఇక లేనట్టే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తులు రిజర్వుడ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వుడ్ గుర్తులుంటాయంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్సీపీ, టీడీపీలకూ ఆయా రిజర్వుడ్ గుర్తులు కేటాయించింది. చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పేర్కొంది. అంటే.. సంబంధింత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. చదవండి: అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని.. -
పేరుకే చిన్న ... పెర్ఫార్మెన్స్ మిన్న
చూడటానికి అవి చిన్న పార్టీలే. కానీ దేశ రాజకీయాల్లో వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. సంకర్ణరాజకీయాల యుగం మొదలయ్యాక ఈ చిరు పార్టీలు పెను ప్రభావం చూపుతున్నాయి. 1989 నుంచి ప్రతి ఎన్నికలోనూ ఈ బుల్లి పార్టీలు కనీసం 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నాయి. గత ఎన్నికల్లోనైతే ఈ పార్టీలన్నీ కలిపి 5.34 కోట్ల వోట్లను పొందాయి. రాష్ట్రీయ ఆమ్ పార్టీ, జనతా రాజ్ పార్టీ, హమ్ సబ్ కీ పార్టీ, గరీబ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల పేరు కూడా మనకు తెలియదు. కానీ వీటిలో కొన్ని పార్టీలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. దేశంలో చిన్న చిన్న రాజకీయపార్టీల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిలో చాలా పార్టీలకు గుర్తింపు కూడా లేదు. 1989 లో చిరు పార్టీల సంఖ్య 77. గత లోకసభ ఎన్నికల్లో ఈ పార్టీల సంఖ్య 321 కి చేరుకుంది. ఈ సారి ఎన్నికల్లో 1600 కి పైగా గుర్తింపు లేని పార్టీలు బరిలో ఉండొచ్చునన్నది అంచనా. వీటి ఓట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 1999 లో ఇవన్నీ కలిపి పదహారు సీట్లు, 2.1 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. 2004 లో 20 సీట్లు, 3.5 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. గత లోకసభ ఎన్నికల్లో 21 సీట్లు, 5.34 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. చిరు పార్టీల పెను బలాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వీటితో అవగాహనకు వచ్చారు. ఇప్పటికే మహారాష్ట్ర లోని రాష్ట్రీయ సమాజ్ పక్ష్, స్వాభిమాన్ పక్ష్ , బీహార్ లో రాష్ట్రీయ లోక సమతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో లోకసత్తా పార్టీ, ఉత్తరప్రదేశ్ లో అప్నా దళ్, తమిళనాడులో ఎండీఎంకె, డీఎండీకె, కే ఎండీకె, పీఎంకే లతో ఎన్నికల అవగాహనకు వచ్చింది. ఈ దిశగా కాంగ్రెస్ పెద్దగా ఎలాంటి ప్రయత్నాలనూ చేస్తున్నట్టు కనిపించడం లేదు.