పేరుకే చిన్న ... పెర్ఫార్మెన్స్ మిన్న | small parties make big impact | Sakshi
Sakshi News home page

పేరుకే చిన్న ... పెర్ఫార్మెన్స్ మిన్న

Published Wed, Apr 2 2014 2:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

పేరుకే చిన్న ... పెర్ఫార్మెన్స్ మిన్న - Sakshi

పేరుకే చిన్న ... పెర్ఫార్మెన్స్ మిన్న

చూడటానికి అవి చిన్న పార్టీలే. కానీ దేశ రాజకీయాల్లో వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. సంకర్ణరాజకీయాల యుగం మొదలయ్యాక ఈ చిరు పార్టీలు పెను ప్రభావం చూపుతున్నాయి. 1989  నుంచి ప్రతి ఎన్నికలోనూ ఈ బుల్లి పార్టీలు కనీసం 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటున్నాయి. గత ఎన్నికల్లోనైతే ఈ పార్టీలన్నీ కలిపి 5.34 కోట్ల వోట్లను పొందాయి.


రాష్ట్రీయ ఆమ్ పార్టీ, జనతా రాజ్ పార్టీ, హమ్ సబ్ కీ పార్టీ, గరీబ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల పేరు కూడా మనకు తెలియదు. కానీ వీటిలో కొన్ని పార్టీలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.


దేశంలో చిన్న చిన్న రాజకీయపార్టీల సంఖ్య కూడా పెరుగుతోంది. వీటిలో చాలా పార్టీలకు గుర్తింపు కూడా లేదు. 1989 లో చిరు పార్టీల సంఖ్య 77. గత లోకసభ ఎన్నికల్లో ఈ పార్టీల సంఖ్య 321 కి చేరుకుంది. ఈ సారి ఎన్నికల్లో 1600 కి పైగా గుర్తింపు లేని పార్టీలు  బరిలో ఉండొచ్చునన్నది అంచనా. వీటి ఓట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 1999 లో ఇవన్నీ కలిపి పదహారు సీట్లు, 2.1 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. 2004 లో 20 సీట్లు, 3.5 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి. గత లోకసభ ఎన్నికల్లో 21 సీట్లు, 5.34 కోట్ల ఓట్లు గెలుచుకున్నాయి.


చిరు పార్టీల పెను బలాన్ని గుర్తించిన నరేంద్ర మోడీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి వీటితో అవగాహనకు వచ్చారు. ఇప్పటికే మహారాష్ట్ర లోని రాష్ట్రీయ సమాజ్ పక్ష్, స్వాభిమాన్ పక్ష్ , బీహార్ లో రాష్ట్రీయ లోక సమతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో లోకసత్తా పార్టీ, ఉత్తరప్రదేశ్ లో అప్నా దళ్, తమిళనాడులో ఎండీఎంకె, డీఎండీకె, కే ఎండీకె, పీఎంకే లతో ఎన్నికల అవగాహనకు వచ్చింది. ఈ దిశగా కాంగ్రెస్ పెద్దగా ఎలాంటి ప్రయత్నాలనూ చేస్తున్నట్టు కనిపించడం లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement