Unsafe Abortions
-
లాక్డౌన్ ఎఫెక్ట్: 18.5 లక్షల అబార్షన్లు
హైదరాబాద్: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రులన్ని కరోనా రోగుల చికిత్సకే అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ క్రమంలో లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 18.5 లక్షల అబార్షన్లు గైనకాలజిస్ట్ సలహా లేకుండానే జరిగాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మహిళలల్లో సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పించే ఐపాస్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) ఈ సర్వేను నిర్వహించింది. లాక్డౌన్ మొదటి మూడు దశల్లో మహిళలకు అందిన వైద్య సౌకర్యాలపై ఈ సర్వే దృష్టి పెట్టింది. లాక్డౌన్1, 2 దశల్లో(మార్చి 25 నుంచి మే 3 వరకు) 59 శాతం మహిళలకు అబార్షన్ అంశంలో ఆస్పత్రికి వెళ్లడం, వైద్యులను కలవడం వంటి సదుపాయాలు లభించలేదని తెలిపింది. అన్‌లాక్ దశలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని.. ఈ సంఖ్య 33 శాతానికి పడిపోయిందని సర్వే తెలిపింది. (సర్కారు దవాఖానాల్లో దారుణం) ఈ క్రమంలో ఐడీఎఫ్ సీఈఓ వినోజ్ మానింగ్ మాట్లాడుతూ.. ‘18.5 లక్షల మంది మహిళలకు అబార్షన్ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. కెమిస్ట్ అవుట్లెట్లలో అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు లభించలేదు. కరోనా మహమ్మారిగా మారినందున వైద్య సిబ్బంది పూర్తి శ్రద్ధ, కృషి వైరస్ నియంత్రణ మీదనే ఉంది. ఫలితంగా మిగతా వైద్య సేవలు, ముఖ్యంగా సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగింది. మెజారిటీ ప్రజారోగ్య సౌకర్యాలు, వైద్య సిబ్బంది కోవిడ్-19 చికిత్సలపై దృష్టి సారించారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేశారు. దాంతో సురక్షితమైన గర్భస్రావం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని తెలిపారు. అంతేకాక ‘ఇది చాలా సున్నితమైన అంశం. సురక్షితమైన గర్భస్రావ సేవలను కోరుకునే మహిళలను లాక్డౌన్ ఆంక్షలు ఎలా ప్రభావితం చేశాయో తెలపడమే గాక.. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ అధ్యయనం జరిగింది అని వినోజ్ మానింగ్ తెలిపారు. (కరోనా మృత్యుపాశం) -
కరోనా: సురక్షితంగాని అబార్షన్లు 10 లక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు పిల్లలు కలగకుండా ఉండేందుకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పురుషుల కండోమ్స్, స్త్రీల కండోమ్స్‌తోపాటు మాత్రలు, ఇంజెక్లు, ఆ తర్వాత స్టెరిలైజేషన్లు ఉన్నాయి. వీటిలో వేటిని ఎంత మంది వాడుతారో, ఏవీ వాడకుండా ఎంత మంది పిల్లలను కంటోరో? చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం వద్ద అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ 35 లక్షల స్టెరిలైజేషన్లు, 57 లక్షల ఇంట్రా–యుటరిన్ గర్భనిరోధక పరికరాలు, 18 లక్షల ఇంజెక్షన్లు, 41 కోట్ల సైకిళ్లకు సరిపోయే గర్భ నిరోధక మాత్రలు, 25 లక్షల అత్యవసర గర్బనిరోధక మాత్రలు, 32 కోట్ల కండోమ్స్‌ను మెడికల్ షాపుల ద్వారా కేంద్రం అందుబాటులో ఉంచింది. (వలస కార్మికులకు అండగా హైకోర్టులు) అయినప్పటికీ అనవసరంగా వచ్చే గార్భావకాశాలు కూడా భారత్‌లో ఎక్కువ. అందుకని ఈ ఏడాది కూడా 14.5 లక్షల అబార్షన్లు జరుగుతాయని, వాటిలో 8,34,042 సురక్షితంగానీ నాటు పద్ధతిలో అబార్షన్లు జరుగుతాయని, అయినప్పటికీ 6,79,864 ప్రసవాలు సంభవిస్తాయని ఆరోగ్య శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా అవాంఛిత ప్రెగ్నెసీల సంఖ్య 23 లక్షలకు చేరుకుంటుందని, వాటిలో సురక్షితంగానీ అబార్షన్ల సంఖ్య పది లక్షలకు చేరుకుంటుందని ఆరోగ్య శాఖ అంచనాలు తెలియజేస్తున్నాయి. ప్రసవాల సంఖ్య 8,44,488 చేరుకోవచ్చని ఆరోగ్య శాఖ అంచనా. అవాంఛిత గర్భాలను తీసివేయక పోయినట్లయితే ప్రసవాల సంఖ్య మరింతగా పెరగుతుంది. సురక్షితంగానీ అబార్షన్ల వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదంతోపాటు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. (అక్కడ నిషేధించారు.. మన దేశంలో ఎప్పుడు?) -
అబార్షన్లతో రోజూ 10 మంది మృత్యువాత
జైపూర్: సురక్షితం కాని గర్భ విచ్ఛిత్తుల(అబార్షన్) వల్ల భారత్‌లో రోజుకు పది మంది మహిళలు చనిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఏటా సుమారు 68 లక్షల అబార్షన్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సురక్షితం కాని అబార్షన్ ప్రసవ సంబంధ మరణాలకు మూడో అతి పెద్ద కారణమని, ఏటా అలా జరుగుతున్న మరణాల్లో వీటి వాటా 8 శాతం అని ఐపీఏఎస్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) రాజస్తాన్ కార్యక్రమ మేనేజర్ కరుణా సింగ్ అన్నారు. ఏటా జరుతున్న అబార్షన్లలో కొంత శాతం మాత్రమే లింగనిర్ధారణకు చెందినవని తెలిపారు. ప్రసవ మరణాలు తగ్గించాలంటే సురక్షిత అబార్షన్ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌లో అబార్షన్ చట్టబద్ధమన్న సంగతి దాదాపు 80 శాతం మహిళలకు తెలియకనే రహస్యంగా కడుపు తీయించుకుంటున్నారని పరిశోధనలో తేలినట్లు తెలిపారు. అసురక్షిత అబార్షన్లతో కలిగే మరణాలు, అంగవైకల్యాలు రూపుమామడానికి ఐడీఎఫ్ కృషి చేస్తోంది.