అబార్షన్ల వల్ల భారత్‌లో రోజుకు పది మంది మహిళలు చనిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జైపూర్: సురక్షితం కాని గర్భ విచ్ఛిత్తుల(అబార్షన్) వల్ల భారత్‌లో రోజుకు పది మంది మహిళలు చనిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఏటా సుమారు 68 లక్షల అబార్షన్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సురక్షితం కాని అబార్షన్ ప్రసవ సంబంధ మరణాలకు మూడో అతి పెద్ద కారణమని, ఏటా అలా జరుగుతున్న మరణాల్లో వీటి వాటా 8 శాతం అని ఐపీఏఎస్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) రాజస్తాన్ కార్యక్రమ మేనేజర్ కరుణా సింగ్ అన్నారు. ఏటా జరుతున్న అబార్షన్లలో కొంత శాతం మాత్రమే లింగనిర్ధారణకు చెందినవని తెలిపారు.
ప్రసవ మరణాలు తగ్గించాలంటే సురక్షిత అబార్షన్ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌లో అబార్షన్ చట్టబద్ధమన్న సంగతి దాదాపు 80 శాతం మహిళలకు తెలియకనే రహస్యంగా కడుపు తీయించుకుంటున్నారని పరిశోధనలో తేలినట్లు తెలిపారు. అసురక్షిత అబార్షన్‌లతో కలిగే మరణాలు, అంగవైకల్యాలు రూపుమామడానికి ఐడీఎఫ్ కృషి చేస్తోంది.