పరిశుభ్ర భవనంగా రాష్ట్రపతి భవన్!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో పరిశుభ్రమైన భవనాల జాబితాలో రాష్ట్రపతి భవన్, హైదరాబాద్ హౌజ్, యూపీఎస్సీ బిల్డింగ్తోపాటు జవహార్లాల్ నెహ్రూభవన్ మొదటి స్థానంలో ఉన్నయని.. తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.
ఢిల్లీలోని 36 ప్రముఖ భవంతుల్లో స్వచ్ఛతపై జరిపిన ఈ సర్వేలో.. ఎన్నికల సంఘం, జైపూర్, జామ్నగర్, జైసల్మేర్ భవనాలు చివరి స్థానంలో ఉన్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ పనితీరు అంచనావేసేందుకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మార్చి 16-21 వరకు ఈ సర్వే నిర్వహించింది.