Urban Health Center
-
ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పాలన: డిప్యూటీ స్పీకర్
-
అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించిన ఎంపీ అవినాష్
-
బాబు వచ్చారు జాబులు తీసేశారు
-
అపోలో చేతికి నంద్యాల అర్బన్ హెల్త్ సెంటర్లు
నంద్యాల రూరల్: అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రభుత్వం మంగళం పాడింది. వాటిని కార్పొరేట్ సంస్థ అపోలోకు అప్పగించింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యం శుక్రవారం నంద్యాలలోని వైఎస్సార్‌నగర్, ఆత్మకూరు బస్టాండ్, భీమవరం రోడ్డులోని హరిజనవాడ, ఎంఎస్‌నగర్, దేవనగర్లలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. 2000 సంవత్సరం జూలై 1న 15 వేల మందికి ఒక అర్బన్ హెల్త్‌సెంటర్ చొప్పున ప్రభుత్వం నంద్యాలలో మొత్తం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ వచ్చాయి. అక్టోబర్ 2 నుంచి∙ఈ సెంటర్లు అపోలో క్లీనిక్‌లుగా మారనున్నాయి. ఇప్పటి వరకు హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తమను అపోలో యాజమాన్యం కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియక సతమతమవుతున్నారు. -
అర్బన్ హెల్త్సెంటర్లలో ప్రైవేట్ వైద్యం..!
– గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం – ఎన్జీవోల నుంచి హెల్త్‌సెంటర్ల స్వాధీనం –ఆగస్టు ఒకటి నుంచి ప్రై వేట్ చేతుల్లోకి కర్నూలు(హాస్పిటల్): పట్టణాల్లోని మురికివాడల్లోని ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన అర్బన్‌హెల్త్ సెంటర్లను ప్రభుత్వం ప్రై వేటుపరం చేయనుంది. ఆధునిక వైద్యసేవల పేరుతో పీపీపీ విధానంలో వీటిని ప్రై వేటు సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయా అర్బన్‌హెల్త్ సెంటర్లను ఎన్జీవోల నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఈ విషయమై కొంత మంది ఎన్జీవోలు కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో కర్నూలు నగరంలో 8, ఆదోనిలో 4, నంద్యాలలో 5 అర్బన్‌హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ప్రతి సెంటర్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక కో ఆర్డినేటర్, ఒక వాచ్మెన్, స్వీపర్, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ఉంటారు. మెడికల్ ఆఫీసర్‌కు రూ.18వేలు, ఏఎన్ఎంలకు రూ.10వేలు, కో ఆర్డినేటర్‌కు రూ.9వేలు, ఇతర ఉద్యోగులకు రూ.4,900ల చొప్పున జీతాలు ఇస్తారు. ఇవి గాక సెంటర్ కంటింజెన్సీ కింద నెలకు రూ.3వేలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కోసం రూ.2వేలు, అద్దెభవనంలో ఉంటే అద్దె రూ.2వేలు చెల్లిస్తారు. ఈ సెంటర్లను జిల్లాలో ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తూ వచ్చాయి. వీటి పనితీరు బాగాలేదని, మురికివాడల్లో ప్రజలకు కనీస వైద్యం అందడం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రై వేటు సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా ఆయా సెంటర్లను స్వచ్ఛంద సంస్థల నుంచి స్వాధీనం చేసుకోవాలని డీఎంహెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సెంటర్లు నిర్వహించే ఎన్జీవోలకు డీఎంహెచ్‌వో కార్యాలయం నోటీసులు పంపించింది. ఇప్పటికే పలు కేంద్రాలను స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ఏప్రిల్ నుంచి జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులను సైతం ఇవ్వకుండా నిలిపివేశారు. కేవలం మందులు మాత్రమే ఏపీఎంఎస్ఐడిసి డ్రగ్‌స్టోర్ నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ కారణంగా ఎన్జీవో ద్వారా గాకుండా డీఎంహెచ్‌వో కార్యాలయంతో అక్కడ పనిచేసే సిబ్బంది బాధ్యులుగా ఉంటున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రై వేటు సంస్థలు వీటిని నిర్వహించే విధంగా ప్రభుత్వం విధివిదానాలు రూపొందించనున్నట్లు సమాచారం. సెంటర్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నాం –డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో కర్నూలు అర్బన్‌హెల్త్ సెంటర్లను స్వాధీనం చేసుకోవాలని గతంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎన్జీవోలందరికీ టెర్నినేషన్ ఆర్డర్స్ ఇచ్చాం. వాటిని డిప్యూటీ డీఎంహెచ్‌వోల ద్వారా ప్రస్తుతానికి నడిపించాలని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు వాటిని నడిపిస్తునాం. ఈ విషయమై కొందరు కోర్టుకు వెళ్లారు. వాటిని ప్రై వేటు సంస్థలకు ఇస్తుందనే విషయం మాకు సమాచారం రాలేదు. -
పీహెచ్‌సీలపై ప్రత్యేక శ్రద్ధ
జలుబు లేదా జ్వరమొస్తే రూ.వందలు.. ఇంకొంచెం పెద్ద ఆరోగ్య సమస్య అరుుతే రూ.వేలకు వేలు.. వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే అయ్యే ఖర్చులివి. ఇంత ఖర్చుకు మధ్య తరగతి ప్రజలే కాదు.. సంపన్నులూ వెనుకాడే పరిస్థితి. ఈ నేపథ్యంలో నిరుపేదలు, సామాన్యులకు మొదట గుర్తుకువచ్చేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే. అక్కడ వైద్య పరీక్షలే కాదు మందులూ ఉచితం. అయితే పీహెచ్‌సీల నిర్వహణ, వైద్యులు, సిబ్బంది ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని పీహెచ్‌సీల తీరు ఎలా ఉంది.. ప్రజలకు ఏం కావాలి, ఇంకా ఏయే సౌకర్యాలు కల్పించాలి వంటి అంశాలను తెలుసుకోవాలనుకున్నారు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కేఎం సునంద. ఇందుకు ‘సాక్షి’ని వేదికగా చేసుకున్నారు. వీఐపీ రిపోర్టర్‌గా నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను, స్కానింగ్ సెంటర్‌ను ఆమె పరిశీలించారు. తొలుత తంగెళ్లమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించడానికి వెళ్లిన డాక్టర్ సునంద అక్కడి పరిస్థితులను గమనించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవల తీరు, వైద్యులు, సిబ్బంది వైఖరిపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సునంద : ఈ కేంద్రానికి రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు. గర్భిణులను ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారా డాక్టర్ కె.మిద్దేశ్వరరావు : రోజుకు 30 నుంచి 50 మంది రోగులు వస్తుంటారు మేడమ్. గర్భిణుల వివరాలతో రికార్డులు నిర్వహిస్తున్నాం. ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. సునంద : గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పురుళ్లు పోస్తున్నారా.. బయటకు పంపుతున్నారా మిద్దేశ్వరరావు : మా కేంద్రానికి వచ్చే గర్భిణులందరినీ 9 నెలలపాటు జగ్రత్తగా పరిశీలిస్తూ ఇక్కడే కాన్పులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసరమైతే జిల్లా కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తున్నాం. సునంద : ఇక్కడ అన్నిరకాల మందులూ అందుబాటులో ఉంచుతున్నారా. కె.విజయ, నర్సు : అన్ని మందులూ ఉన్నాయి మేడమ్. ఈ ప్రాంతం మురికివాడ కావడంతో ఎక్కువ మంది కుక్క కాటుకు గురై వైద్యం కోసం వస్తున్నారు. యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేదు మేడమ్. సునంద : అర్బన్ హెల్త్ సెంటర్లలో యూంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం కష్టం. వాటిని శీతల ప్రదేశంలో ఉంచాల్సి ఉన్నందున్న ఫ్రిజ్‌లు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వ ఆసుపత్రులకు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి బాధితులను అక్కడికి పంపించాలి. అనంతరం టాయిలెట్స్ ఉన్న ప్రాంతానికి వెళ్లిన డీఎంహెచ్‌వో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ స్వీపర్ ఎవరని ప్రశ్నించారు. కొప్పుల రామలక్ష్మి : నేను ఇక్కడ స్వీపర్‌గా పనిచేస్తున్నాను మేడమ్. సునంద : టాయిలెట్లు ఇంత మురికిగా ఉన్నాయేంటి. నీరుకూడా వృథాగా పోతోంది. రామలక్ష్మి : ఎప్పుడూ కడుగుతూనే ఉంటానండి. రోగులు వచ్చి వినియోగించుకుంటారు కదాండి. అందుకే మురికిగా ఉన్నాయి. మరింత శుభ్రంగా ఉంచుతాను మేడమ్. సునంద : నీరు వృథాగా పోతోంది కదా. పంపులను జాగ్రత్తగా వాడాలి. ఎప్పుడూ పరిశీలిస్తుండాలి. రామలక్ష్మి : అలాగేనండి. ఆ తర్వాత అక్కడున్న కమ్యూనిటీ ఆర్గనైజర్‌తో డీఎంహెచ్‌వో మాట్లాడారు. ఎంబీ విజయసత్యకళ, సీవో : ప్రతినెలా జీతాలు అందడం లేదు మేడమ్. ఏ నెల జీతాలు ఆ నెలలో ఇచ్చేలా ఏర్పాట్లు చేయండి. సునంద : ప్రభుత్వం నుంచి బడ్జెట్ రావాలి. బడ్జెట్ విడుదల కాగానే జీతాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడి నుండి నగరం నడిబొడ్డులోని రామచంద్రరావు పేటలో గల వంశీ స్కానింగ్ సెంటర్‌కు వెళ్లిన సునంద ఆ సెంటర్ నిర్వాహకురాలిని అక్కడ ఏయే పరీక్షలు చేస్తున్నారు, బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్.మృణాళిని : మేడమ్. ఇక్కడ నేను కన్సల్టెంట్ రేడియాలజిస్ట్‌గా వ్యవహరిస్తున్నాను. సునంద : అందుకు సంబంధించి మీ అర్హత ఏమిటి. బయట బోర్డు పెట్టారా. మీ పత్రాలు చూపండి. మృణాళిని : రిజిస్ట్రేషన్ చేయించాం మేడమ్. బయట బోర్డు కూడా ఉంది. సునంద : ఇక్కడ స్కానింగ్‌లు చేస్తున్నారా. ఎంత వసూలు చేస్తున్నారు. మృణాళిని : అన్నిరకాల స్కానింగ్లూ చేస్తున్నాం మేడమ్. లింగ నిర్థారణ ప్రకటించడం లేదు. సునంద : రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు. మృణాళిని : గర్భస్థ శిశు పరీక్షలు కాకుండా ఇతర స్కానింగ్‌లు సుమారు 30 నుంచి 40 వరకూ చేస్తాం. సునంద : మీరు చేసే అన్ని పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు మాకు నివేదిక పంపాలి. వైద్యుల సూచనల మేరకు వస్తున్న రోగులకే పరీక్షలు నిర్వహిస్తున్నారా లేక స్వచ్ఛందంగా వచ్చేవారికి కూడా పరీక్షలు చేస్తున్నారా. మృణాళిని : లేదు మేడమ్. డాక్టర్లు పంపిన వారికే పరీక్షలు నిర్వహిస్తున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన డీఎంహెచ్‌వో పరీక్షల కోసం వేచి ఉన్న వారితో మాట్లాడారు. సునంద : ఏమ్మా.. ఏ పరీక్ష కోసం వచ్చారు. ఫాతిమా : కడుపునొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన స్కానింగ్ చేయించుకు రమ్మని పంపారు. సునంద : ఏ వైద్యుడు పంపారు. ఆ చీటీ ఏది. ఫాతిమా : చీటీ నా దగ్గర లేదండి. నా భర్త వద్ద ఉంది. ఆయన బయటకు వెళ్లారు. -
అర్బన్ హెల్త్ సెంటర్లకు మహర్దశ!
విజయనగరం ఆరోగ్యం : జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు (అర్బన్ హెల్త్ సెంటర్లు) మహర్దశ పట్టనుంది. వీటిని పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయూలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్ర భుత్వం ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో ఎనిమిది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో విజయనగరంలో నాలుగు, బొబ్బిలిలో రెండు, సాలూరులో ఒకటి, పార్వతీపురంలో ఒకటి ఉన్నాయి. మొదటిసారిగా జిల్లాలోనిపట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి, ఇక్కడ విజయవంతమైన తరువాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లను అర్బన్ పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. పస్తుతం పట్టణాల్లో 50వేల జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇందులో టెక్నికల్ సిబ్బంది ఎవరూ లేరు. ఒక వైద్యుడు, ఒక స్టాఫ్‌నర్సు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్, వైద్యుడి సహాయకుడు ఒకరు, వాచ్‌మన్ ఒకరు, హెల్పర్ ఒకరు చొప్పన పని చేస్తున్నారు. అర్బన్ పీహెచ్సీగా అప్‌గ్రేడ్ అయితే పీహెచ్సీ మాదిరి ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్సు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్ టెక్నీషి యన్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సీహెచ్ఓ, ఒక హెల్త్ సూపర్వైజర్, ఒక వాచ్‌మన్, ఒక కంటింజెంట్ వర్కర్ ఉంటారు. దీని వల్ల రోగులకు ప్రతిరోజూ 12 గంటల పాటు వైద్య సేవలు అందుతాయి. అంతేకాకుండా అన్ని రకాల వ్యాధులకు ఓపీ సేవలు, కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు, పసవాలు వంటి వైద్య సేవలు అందుతాయి. అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయి. మందులు పూర్తిస్థాయిలో ఉండడం లేదు. దీని వల్ల రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదు. వీటిని పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేస్తే పట్టణవాసులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఎన్ఆర్హెచ్ఎం పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నేషనల్ హెల్త్ మిషన్( ఎన్హెచ్ఎం) ద్వారా నిధులు విడుదల కానున్నాయి. కాగా సీహెచ్ఎన్సీ మాదిరి పట్టణాల్లో కూడా అర్బన్ సీహెచ్ఎన్సీలను ఏర్పాటు చేయనున్నారు. 2.50 లక్షల జనాభాకు ఒక పట్టణ సీహెచ్ఎన్సీ ఏర్పాటు చేయూలని కేంద్రం భావిస్తోంది. వివరాల సేకరణలో వైద్య సిబ్బంది ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది పట్టణాల్లోని వార్డుల్లో ఉన్న జనాభా వివరాల సేకరణలో బిజీగా ఉన్నారు. ఏ వార్డులో ఎంత మంది జనాభా ఉన్నారు. ఎంతమంది గర్భిణులు.. ఎంతమందికి వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. క్షయ, హెచ్ఐవీ, కాన్సర్, బోదకాలు, మలేరియా వంటి వాధులతో ఎంతమంది బాధపడుతున్నారు వంటి పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు.