మంచు తుఫాన్ తో అమెరికాలో పలుచోట్ల గాఢాంధకారం
క్రిస్మస్ పండగ రోజున లక్షలాది మంది ఉత్తర అమెరికా, ఈస్టర్న్ కెనడా వాసులు గాడాంధకారంలో గడిపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా కలిగిన విద్యుత్ అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు సిబ్బంది రేయింబళ్లు కష్టించి పనిచేస్తున్నారు. మంచు తుఫాన్ కు సుమారు 24 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.
ఇప్పట్లో వాతావరణం సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితి లేదని యూఎస్ జాతీయ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గ్రేట్ లేక్స్, మిడ్ వెస్ట్ ప్రాంతాల్లో భారీగా మంచు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కెనడాలో విపరీతమైన చలి నుంచి ఉపశమనం పొందడానికి గ్యాస్ జనరేటర్లు ఉపయోగించారని.. అయితే కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు వెలువడటంతో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. అమెరికాలో మంచు తుఫాన్ కు 14 మంది బలయ్యారని అధికారులు తెలిపారు. టొరంటోలో ఉష్టోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతోందని అధికారులు తెలిపారు