US Secretary of State John Kerry
-
ఉగ్రవాదంపై చర్యలు తీసుకోండి
న్యూయార్క్: పాకిస్తాన్‌ను అడ్డాగా మార్చుకున్న ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తేల్చిచెప్పారు. కశ్మీర్లో హింస, భారత సైనిక స్థావరంపై ఉగ్ర దాడుల నేపథ్యంలో ఆయనీమేరకు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య భేటీ కోసం ఇక్కడికి వచ్చిన షరీఫ్ సోమవారం కెర్రీని కలిశారు. కశ్మీర్లో మారణహోమం, మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని... ఈ సమస్య పరిష్కారానికి అమెరికా సహకారం అవసరమని షరీఫ్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేను కలిసిన సందర్భంలో కూడా షరీఫ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. పాక్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి: యూరి సైనిక స్థావరంపై జరిగిన ఉగ్ర దాడిని అమెరికాలోని భారత సంతతి ప్రజలు ఖండించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని అమెరికాను కోరారు. -
'అణ్వాయుధాలు సీజ్ చేస్తేనే మాట్లాడతాం'
న్యూయార్క్: ఉత్తర కొరియా ఇప్పటికైనా తన అణుక్షిపణి పరీక్షలు నిలిపేస్తే, అణుకార్యక్రమాలు కొనసాగించడం ఆపేస్తే సావధానంగా చర్చలు జరిపేందుకు తాము సిద్ధం అని అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ అన్నారు. ఉత్తర కొరియా వెంటనే అణుక్షిపణులను, బాలిస్టిక్ ఆయుధాలను వృద్ధి చేసే కార్యక్రమాలు ఇక సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 'ప్యాంగ్ యాంగ్ ఇక ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుంటే భవిష్యత్తులో సీరియస్‌గా చర్చలు జరిపేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే' అని కెర్రీ దక్షిణ కొరియా, జపాన్ ప్రతినిధులకు చెప్పారు. ఆదివారం మూడు దేశాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఇందులో ఇటీవల ఉత్తర కొరియా వరుసగా జరుపుతున్న అణుపరీక్షల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం చర్యల వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ఆ దేశాన్ని నియంత్రించాలని నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా మరోసారి చర్చలకు తాము సిద్ధం అని జాన్ కెర్రీ ప్రకటించారు.