న్యూయార్క్: ఉత్తర కొరియా ఇప్పటికైనా తన అణుక్షిపణి పరీక్షలు నిలిపేస్తే, అణుకార్యక్రమాలు కొనసాగించడం ఆపేస్తే సావధానంగా చర్చలు జరిపేందుకు తాము సిద్ధం అని అమెరికా విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ అన్నారు. ఉత్తర కొరియా వెంటనే అణుక్షిపణులను, బాలిస్టిక్ ఆయుధాలను వృద్ధి చేసే కార్యక్రమాలు ఇక సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
'ప్యాంగ్ యాంగ్ ఇక ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుంటే భవిష్యత్తులో సీరియస్గా చర్చలు జరిపేందుకు మేం ఎప్పుడూ సిద్ధమే' అని కెర్రీ దక్షిణ కొరియా, జపాన్ ప్రతినిధులకు చెప్పారు. ఆదివారం మూడు దేశాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఇందులో ఇటీవల ఉత్తర కొరియా వరుసగా జరుపుతున్న అణుపరీక్షల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశం చర్యల వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న ఆ దేశాన్ని నియంత్రించాలని నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా మరోసారి చర్చలకు తాము సిద్ధం అని జాన్ కెర్రీ ప్రకటించారు.
'అణ్వాయుధాలు సీజ్ చేస్తేనే మాట్లాడతాం'
Published Mon, Sep 19 2016 9:23 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement