V. Rama Rao
-
సిక్కిం మాజీ గవర్నర్ మృతిపట్ల ప్రణబ్ సంతాపం
న్యూఢిల్లీ : సిక్కిం మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వీ రామారావు మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా రామారావు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. 2002- 2005 మధ్య కాలంలో ఆయన సిక్కింకు గవర్నర్ గా పని చేశారు. -
సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత
-
సీనియర్ నేత వీ రామారావు కన్నుమూత
హైదరాబాద్: సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వీ రామారావు(80) ఆదివారం కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. 2002- 2005 మధ్య కాలంలో సిక్కింకు గవర్నర్ గా పనిచేసిన ఆయన.. ఆ పదవి నిర్వహించిన అతికొద్దిమంది తెలుగువారిలో ఒకరు. రామారావు మృతిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. రామారావు స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం. ఆయన 1935 డిసెంబర్ 12న ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆయన స్వస్థలం మచిలీపట్నం అయినా హైదరాబాద్ బీజేపీ నేతగానే ప్రసిద్ధులయ్యారు. హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు (1966, 1972, 1978, 1984ల్లో) ఎమ్మెల్సీగా గెలుపొందారు. మండలిలో బీజేపీ పక్షనాయకుడిగానూ సేవలందించారు. రామారావు మృతి పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. -
కిషన్ వద్దు.. బాబే ముద్దు
బీజేపీ-టీడీపీ పొత్తు వ్యవహారంతో కమలనాథుల్లో అభిప్రాయభేదాలేర్పడ్డాయనటానికి ఇదే నిదర్శనం. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ రూపొందించుకున్న ప్రచార రథమిది. వీటిని పార్టీ కార్యాలయం ఎదుట సీనియర్ నేత, మాజీ గవర్నర్ వి.రామారావు ప్రారంభించారు. కానీ ఈ రథాలపై ఎక్కడా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చిత్రం లేకపోవటం విశేషం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మలు మాత్రం ఏర్పాటు చేశారు. టీడీపీతో పొత్తుండాలని గట్టిగా కోరిన నేతల్లో దత్తాత్రేయ ఒకరు. పొత్తు వద్దేవద్దంటూ కిషన్‌రెడ్డి గట్టిగా వాదించారు. పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, చంద్రబాబు, తన బొమ్మలు వేయించుకున్న దత్తన్న కిషన్‌రెడ్డి బొమ్మ లేకుండానే వాటిని సిద్ధం చేయించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీటి ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కిషన్‌రెడ్డి... దత్తన్న వ్యవహారంతో చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది.