న్యూఢిల్లీ : సిక్కిం మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత వీ రామారావు మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా రామారావు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. 2002- 2005 మధ్య కాలంలో ఆయన సిక్కింకు గవర్నర్ గా పని చేశారు.
సిక్కిం మాజీ గవర్నర్ మృతిపట్ల ప్రణబ్ సంతాపం
Published Mon, Jan 18 2016 2:02 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM
Advertisement
Advertisement