vadapally
-
లారీలు అనుమతించాలంటూ ధర్నా
దామరచర్ల(నల్గొండ జిల్లా): ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక లారీలను తెలంగాణలోకి అనుమతించనందుకు నిరసనగా రెండు రాష్ట్రాల సరిహద్దులోని వాడపల్లి కృష్ణా వంతెనపై ఇసుక లారీల యజమానులు, కార్మికులు బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ లారీలను తెలంగాణలోకి అనుమతించకపోవడం దారుణమని వారు చెబుతున్నారు. -
వాడపల్లిలో నిఘా షురూ
ఫ్లడ్‌లైట్లు ఏర్పాట్లు వాడపల్లి(దామరచర్ల) ప్రముఖ పుణ్యక్షేత్రం దామరచర్ల మండలం వాడపల్లిలో పుష్కరాల సందర్భంగా నిఘా ఏర్పాట్లను ప్రారంభించారు. పుణ్యక్షేత్రంలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాలు మరో పదకొండు రోజులుండగానే ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి స్నానఘాట్,పార్కింగ్,దేవాలయ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పుణ్యక్షేత్రంలో పలు చోట్ల ఇప్పటికే ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు పూర్తయినచోట్ల లైటింగ్ టెస్ట్ చేస్తున్నారు. -
‘సాక్షి’ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు
వాడపల్లి (దామరచర్ల) : మండలంలోని వాడపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కష్ణా పుష్కరాలు ఆవశ్యకతపై జరిగిన ఈపోటీలకు 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. విజేతలకు మంగళవారం బహుమతులు అందజేస్తామని వికాస సమితి మండల కమిటీ అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు గుడిపాటి కోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కె.శ్రవణ్‌కుమార్, సాక్షి విలేకరి బండి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు రాధిక, గురులక్ష్మి,నాగలత, సరోజ, రజబ్అలీ, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.