vaikuntam prabhakar
-
అనంతపురం మాజీ ఎమ్మెల్యేకు మొండి చేయి చూపిన చంద్రబాబు
-
బాబుకు అసమ్మతి సెగ..ఆరని ఆగ్రహ జ్వాలలు
-
టీడీపీ నేతలకు కొత్త టెన్షన్.. రూటు మార్చిన పచ్చ పార్టీ లీడర్లు!
అభివృద్ధి అనేది టీడీపీ ఎజెండాలో లేని విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకోవడమే పచ్చ పార్టీ నేతల పని. అన్ని ఆటంకాలు అధిగమించి పనులు సాగుతుంటే మాత్రం ఆ ఘనత తమదే అని డప్పు కొట్టుకోవడంలో కూడా టీడీపీ నేతలు ముందుంటారు. అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ నేత డప్పు ఎలా కొట్టుకుంటున్నారంటే.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వైకుంఠం ప్రభాకర చౌదరి అభివృద్ధి అంటే నేనే అని డప్పు కొట్టుకోవడంలో ఆరితేరిపోయారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ తరపున జేసీ దివాకరరెడ్డి ఎంపీగా, ప్రభాకర చౌదరి టౌన్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతపురం టౌన్లో ఏ పని చేయాలన్నా ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరేది కాదు. పట్టణంలో ఏ పనీ చేయకుండా, ఇద్దరు గొడవ పడటంతోనే ఐదేళ్ళు ముగిసిపోయింది. అందుకే టీడీపీ పాలనలో అనంతపురం పట్టణం అభివృద్ధి జరగకపోగా.. మరింత వెనుకపడిపోయింది. గత ఎన్నికల్లో ప్రభాకరచౌదరి మీద విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నగరం అభివృద్ధి పథంలో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతపురం అభివృద్ధికి 650 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కేంద్రంతో మాట్లాడి అనంతపురం నగరం మీదుగా ఓ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అనంతపురం నగరంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. హైవే పనులు కూడా 80 శాతం పూర్తి కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరం అభివృద్ధి అంతా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళడం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి నచ్చడంలేదు. ఇలాగే సాగితే నగరంలో పచ్చ పార్టీకి ఉనికి ఉండదని భయపడి.. అభివృద్ధిని వక్రీకరించడం ప్రారంభించారు. అనంతపురం నగరంలో నిర్మాణమవుతున్న 42, 44 జాతీయ రహదారుల లింక్ హైవే టీడీపీ హయాంలోనే మంజూరు అయిందని.. పనులు ప్రారంభం అయ్యే లోగా ప్రభుత్వం మారిపోయిందంటూ ప్రభాకర్ చౌదరి గోబెల్స్ ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి జాతీయ రహదారిగా ఉన్న అనంతపురం సుభాష్ రోడ్డును స్టేట్ హైవేగా మారుస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలకు నేషనల్ హైవే నిబంధనలు అడ్డురావటంతో నగర అభివృద్ధి గురించి ఆలోచించకుండా టీడీపీ నేతలు హైవే హోదానే తగ్గించేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి దీనికి ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు అనంతపురం నగరంలోని జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పును గుర్తించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అనంతపురం ప్రధాన రహదారిని తిరిగి నేషనల్ హైవే జాబితాలో చేర్చాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా కొత్తగా నాలుగు లేన్ల హైవే నిర్మించాలని.. అనంతపురం క్లాక్ టవర్ దగ్గరున్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో 310 కోట్లతో జాతీయ రహదారి మంజూరు అయింది. హైవే పనులు జరక్కుండా అడుగడుగునా అడ్డు పడిన టీడీపీ నేతలు.. అభివృద్ధి పనులు చివరి దశకు చేరటంతో రూటు మార్చారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పనులన్నీ పూర్తి అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందన్న భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. పచ్చ పార్టీ రాజకీయ డ్రామాలు నమ్మవద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో సీటు కోసం నానాపాట్లు.. సీనియర్ నేతకు సర్దుబాటు అవుతుందా? -
నువ్వా నేనా.. అనంత అసెంబ్లీ టికెట్ దక్కేదెవరికో..?
టీడీపీలో ఇద్దరు సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీయబోతోంది?. పట్టు నిలుపుకునేందుకు ఒకరు.. వేరే చోట పట్టు పెంచుకునేందుకు మరొకరు నానా తంటాలు పడుతున్నారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. ఒకరిమీద ఒకరు బాదుడే బాదుడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏంటంటూ నలుగురు జేసీ వర్గీయులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అనంతపురం అసెంబ్లీ పార్టీ ఇంచార్జ్ ప్రభాకర్ చౌదరి పార్టీ నాయకత్వానికి సిఫారసు చేశారు. దీంతో నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేసేదేంటంటూ జేసీ వర్గీయులు సమావేశం నిర్వహించారు. పైగా వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి అర్బన్ టికెట్ ఇవ్వొద్దంటూ తీర్మానం కూడా చేశారు. ఈ విధంగా తెలుగు తమ్ముళ్లలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. 2014లో అనంతపురం టౌన్ నుంచి గెలిచిన ప్రభాకర్ చౌదరి అంతకు ముందు ఒకసారి మున్సిపల్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి అర్బన్ నియోజకవర్గంపై కన్నుపడింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో ఉన్న జేసీ ఫ్యామిలీ 2014 ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చింది. 2014 నుంచి 2019 దాకా అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా జేసీ దివాకర్ రెడ్డి పనిచేశారు. 2019లో పోటీ నుంచి తాను తప్పుకుని కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డిని పోటీ చేయించి, ఘోర పరాభవాన్ని చవిచూశారు. కొడుకు రాజకీయ భవిష్యుత్తపై బెంగపెట్టుకున్న జేసీ ఇప్పుడు మరో ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి తన కొడుకు పవన్‌ను పోటీ చేయించే ఆలోచనలో జేసీ ఉన్నట్లు సమాచారం. అందుకే అనంతపురం పార్లమెంట్ ఇంచార్జి బాధ్యతలు చూస్తున్న పవన్‌రెడ్డికి అనంతపురం అసెంబ్లీ బాధ్యతలు వచ్చేలా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చదవండి: (లోకేష్ పోటీ చేసేది అక్కడినుంచేనా.. ఆ నియోజకవర్గ సర్వేల్లో తేలిందేంటి?) ఈ నేపథ్యంలోనే జేసీ వర్గం అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దూకుడు పెంచింది. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ప్రభాకర్ చౌదరికి తెలియకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాజానగర్‌లో జేసీ వర్గం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం పార్టీలోని రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక ఇంచార్జి ప్రభాకర్ చౌదరి అనుమతి లేకుండానే మీరెలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ చౌదరి వర్గీయులు జేసీ వర్గం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో జేసీ, ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య పరస్పరం వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎవరికి అనుకూలంగా వారు నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. వాస్తవానికి 2014లో జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరినప్పటి నుంచే మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరితో విభేదాలు మొదలయ్యాయి. అనంతపురం నియోజకవర్గంలో పట్టుకోసం జేసీ అప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభాకర్ చౌదరి అడ్డుకుంటూ వచ్చారు. ఎన్నికలయిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న వీరి గొడవలు ఇప్పుడు మళ్లీ మొదలైనట్లే కనిపిస్తున్నాయి. అనంత అసెంబ్లీ టికెట్ ముచ్చటగా మూడోసారి తనకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పట్టుబడుతుండగా, ఈసారి ఎలాగైనా తన కొడుక్కు ఇప్పించుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఎవరికివారు నారా లోకేష్, చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. జేసీ, ప్రభాకర్ చౌదరి గ్రూపు రాజకీయాలతో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ రెండుగా చీలిపోయింది. అసలే పరిస్థితులు బాగాలేవు. మళ్లీ పార్టీలో రెండు గ్రూపుల మధ్య కొట్లాట ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని టీడీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. -
ప్రభాకరా.. ఇదేమి టోకరా!
సాక్షి, అనంతపురం టౌన్ : అధికార పార్టీ ప్రలోభాలు పెచ్చుమీరుతున్నాయి. అధికారం తమదే.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తలచారు.. మాయజేసి అయినా..మభ్యపెట్టి అయినా..అక్కడికీ వినకపోతే ప్రలోభపెట్టి అయినా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని పన్నాగం పన్నారు. ముందుగా ఓటర్లకు ఇంటింటికీ వెళ్లి టోకన్లు పంపిణీ చేశారు. కానీ నోటు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఓటర్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్‌చౌదరి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా ఇంటి బయట వేసిన టెంట్లను పెకిలించి, బుధవారం భారీ ఎత్తున నిరసనకు దిగారు. నగరంలోని పలు డివిజన్లకు చెందిన ఓటర్లకు ప్రభాకర్‌చౌదరి అనుచరులు,నాయకులు టోకన్లను పంపిణీ చేశారు. టోకన్లను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇంటి వద్దకు తీసుకెళ్లితే డబ్బులిస్తారని మభ్యపెట్టారు. టోకన్లు తీసుకున్న మహిళలు పెద్ద ఎత్తున ప్రభాకర్‌చౌదరి ఇంటివద్దకు చేరుకున్నారు. టోకన్లు తీసుకొని డబ్బులివ్వాలని కోరారు. అయితే ‘ఇక్కడ డబ్బులేవు.. మళ్లీ ఇస్తాం’ అంటూ కొందరు టీడీపీ నాయకులు ఓటర్లకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. వారు ససేమిరా అన్నారు. నగదు ఇస్తే ఇప్పుడే ఇవ్వండి.. లేకపోతే ఇవ్వలేమని చెప్పండి.. అంతేగానీ టోకన్లు ఇచ్చి, మోసం చేస్తారా? అంటూ నిరసన తెలియజేశారు. ఇంటి బయట వేసిన సేమియానా (టెంటు)ను సైతం తొలగించి ఆందోళన చేశారు. ఆందోళన కాస్త పెద్దది కావడంతో వెంటనే అక్కడి టీడీపీ నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రంగప్రవేశం చేసి వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేసి అక్కడి నుంచి పంపించారు. డబ్బులిచ్చే స్థోమత లేనప్పుడు టోకన్లు ఇచ్చి ఓటర్లను తప్పుదోవ పట్టించాలి? అని నిట్టూర్చారు. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఎమ్మెల్యే ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాలకు జరిమానా విధించి అక్కనుంచి వెళ్లిపోవడం విశేషం. 36వ డివిజన్లో మహిళల ఆందోళన.. నగరంలోని 36వ డివిజన్ లక్ష్మీనగర్‌లో మహిళలు ఆందోళన చేపట్టారు. టీడీపీ పార్టీకి చెందిన రుక్మిణీ అనే మహిళా సంఘం సభ్యురాలు డబ్బులివ్వలేదని ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రతి ఓటరుకూ డబ్బులిస్తామని హామీ ఇచ్చి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో పాటు నగరంలో పలు చోట్ల టీడీపీకి చెందిన పలువురు ఓటర్లు ఆందోళనకు దిగారు. -
అరచేతిలో వైకుంఠం
ప్రచారం : ‘నా హయాంలో అనంతపురం మున్సిపాల్టీని బాగా అభివృద్ధి చేశాను.. నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు నగరాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాను. ఈ ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి’ - ఇదీ అనంతపురం అర్బన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రచారం తీరు. జరిగింది ఇదీ : నిధుల వేట పేరుతో జేబు నింపుకునే కార్యక్రమం చేపట్టారని నాటి నుంచి నేటి వరకు ఊరంతా కోడైకూస్తోంది. నగర నడిబొడ్డులోని విలువైన స్థలాలను కారు చౌకగా అమ్మేసి మున్సిపాల్టీని నిరుపేదగా మార్చారు. తద్వారా ఆయన మాత్రం కోటీశ్వరుడయ్యారనే విమర్శలున్నాయి. అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మామూలుగా ప్రతి ఒక్కరూ స్థిరాస్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా భూములు, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరమైన కష్టాలు పీకల మీదకు వస్తే తప్ప... చిన్నపాటి ఇబ్బందులకు స్థిరాస్తులను అమ్ముకోరు. అప్పోసప్పో చేసి వాటి నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత జీవితంలో ఎవరైనా ఇలానే చేస్తారు. అదే మనది కాదు అనుకున్నప్పుడు ‘పోతే ఏమిటి... మనకొచ్చే నష్టం ఏమిటి’ అన్న ఆలోచన కనిపిస్తుంది. ఇలాంటి ఆలోచనే అనంతపురం మున్సిపాల్టీ మాజీ చైర్మన్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి నేతృత్వంలోని కౌన్సిల్‌కు వచ్చింది. 1995-2000 మధ్య మున్సిపల్ చైర్మన్‌గా ప్రభాకర్ చౌదరి పని చేశారు. ఆ సమయంలో మున్సిపాల్టీకి సంబంధించి నగరంలోని అత్యంత విలువైన స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్ర యించేశారు. అప్పట్లో ఈ స్థలాలపై స్థానికులకు అవగాహన లేకపోవడం, పెద్ద విలువైనవిగా భావించకపోవడంతో చౌదరి తనదైన శైలిలో వ్యవహారం నడిపించి లబ్ధిపొందారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తంతు మున్సిపాల్టీని స్థిరాస్తి లేని నిరుపేదగా మార్చేసింది. మునిసిపల్ (డీ రిజర్వుడు) ఓపెన్ స్థలాలను విక్రయించవచ్చని 1996లో అప్పటి ప్రభుత్వం ఒక జీవో 419 జారీ చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రభాకర్ చౌదరి నేతృత్వంలోని అప్పటి పాలకవర్గం యథేచ్చగా నగరంలో 27 ప్రాంతాలో అత్యంత విలువైన 5 ఎకరాలు (501.705 సెంట్లు) అమ్మేశారు. తద్వారా సంస్థకు నగదు రూపంలో రూ.1,26,54,074 వచ్చింది. ఆ స్థలాలే ఇపుడు ఉండింటే వాటి విలువ ఎంతో ప్రత్యేకించి చెప్పక్కరలేదు. అమ్మేసిన ప్రతి స్థలం ఇప్పటి ధరల ప్రకారం సెంటు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు.. ఆ పైనే ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం ఆ స్థలాల విలువ దాదాపు రూ.50-100 కోట్ల మధ్య ఉంటుందని పలువురు సిబ్బందే చెబుతున్నారు. ఇదే జీవో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలకు వర్తిస్తుంది. అయితే అప్పట్లో అనంతపురం పురపాలక సంఘం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క మునిసిపాలిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున డీ రిజర్వుడు స్థలాలను అమ్ముకోలేదని అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ప్రభాకర్ చౌదరి ఆ పని చేసి ఉండకపోయింటే నేడు అనంతపురం మరింత అభివృద్ధి సాధించి ఉండేదనడంలో సందేహం లేదు. పరిరక్షణ చేత కాదనడం అసమర్థత సంస్థ స్థలాలు అన్యాక్రాంతం అవుతాయని ఎవరైనా చెబితే అది సరైన సమాధానం కాదు. మన సొంత ఆస్తులను ఎలా కాపాడుకుంటామో అదే విధంగా సంస్థ ఆస్తుల పరిరక్షణ విషయంలోనూ జావాబుదారీగా ఉండాలి. పరిరక్షించడం కష్టమనో లేక చేతకాదని చెబితే అది అసమర్థత కిందకే వస్తుంది. అధికారులు అమ్మారని కొందరు చెప్పుకొస్తుంటారు. స్థానిక సంస్థల్లో అధికారుల పాత్ర చాలా తక్కువ. ఏదైనా సరే కౌన్సిల్ నిర్ణయం మేరకే జరగాల్సి ఉంటుంది. అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకోవడమంటూ జరగదు. అలా ఏ అధికారైనా తీసుకుంటే అతనికి చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. కాబట్టి స్థానిక సంస్థల్లో ఏ నిర్ణయమైన కౌన్సిల్ తీర్మానం ద్వారానే జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.