vaishya community
-
ఆర్యవైశ్యులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి : సజ్జల
-
బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారు
హైదరాబాద్: వైశ్య కులంలో పుట్టిన మోదీ బీసీగా ప్రచారం చేసుకుని ప్రధాని అయ్యారని టీమాస్ ఫోరం చైర్మన్, ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. ఈ క్రమంలో దేశంలో పెద్ద మార్పు రావాల్సిన అవసరం ఉందని.. దీనికి గానూ కమ్యూనిస్టులు నిర్మాణాత్మకమైన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల రంగంలో దిగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో మార్క్సిజం–అంబేడ్కర్ ఆలోచనా విధానం–సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. ఐలయ్య మాట్లాడుతూ కింది కులాల వారిని ఐక్యం చేసి రాజ్యధికారం వైపు పయనించేలా చేయాలని సూచించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మద్దికాయల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, తాండ్ర కుమార్, జయరాజు, నల్లా సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. -
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో బ్రాహ్మణులు, వైశ్యులే అధికం
హైదరాబాద్: దేశంలోని బడా కంపెనీలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా బ్రాహ్మణులు, వైశ్యులే అధిక శాతం ఉన్నారని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. గురువారం ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి, టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కంచ ఐలయ్య 65వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’ను నిర్వహించారు. ఓయూ సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కంచ ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలయ్య మాట్లాడుతూ, ప్రైవేటు రంగాల్లో ఉన్న వంద మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో 46 శాతం వైశ్యులు, 44.6 శాతం బ్రాహ్మణులు కమ్మ, రెడ్లు 3.8 శాతం, ఎస్సీ, ఎస్టీలు 3.5 శాతం మాత్రమే ఉన్నారన్నా రు. అందుకే ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. తన రచనలు, మాటల్లో మహిళలను ఎక్కడ విమర్శించడంలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇంటర్ వరకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను, ప్రతి మండలంలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసి తెలుగు, ఇంగ్లిష్ మీడియాలలో విద్యా బోధన జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో దంసా అధ్యక్షుడు ధారవత్ మోహన్, ఉసా, నలిగంలి శరత్, మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు వైశ్యుల పాదయాత్ర ప్రారంభం
వర్గల్ (గజ్వేల్): ఎట్టకేలకు మంగళవారం ఆర్యవైశ్యుల పాదయాత్ర ప్రారంభమైంది. రూ.1,000 కోట్లతో ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో సోమవారం గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కు వైశ్యులు వేర్వేరుగా చేపట్టిన పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం మధ్యాహ్నానానికి పోలీసు కమిషనర్ వద్ద అనుమతి లభించడంతో వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభమైంది. కాగా, ఈ పాదయాత్రలో వైఎస్సార్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్ గుప్త పాల్గొని సంఘీభావం తెలిపారు. కాగా, వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మంగళవారం వర్గల్లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీస్తున్న ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై దేశద్రోహం కేసు నమోదు చేయాలన్నారు. -
తాండూర్ వాసవీక్లబ్కు ‘సూపర్‌స్టార్’ క్లబ్ అవార్డు
తాండూర్ : తాండూర్ వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు కె.సంతోష్‌కుమార్‌కు వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ 5 స్టార్ ప్రసిడెంట్ అవార్డు దక్కింది. ఆదివారం వరంగల్‌లో జరిగిన వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయి సంకల్పం మిడ్కాన్ 2016 కార్యక్రమంలో పలు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా తాండూర్ వాసవీక్లబ్లకు సూపర్‌స్టార్ క్లబ్ అవార్డు రాగా, క్లబ్ అ«ధ్యక్షుడు సంతోష్‌కు 5 స్టార్ అవార్డు దక్కింది. ఈ అవార్డును క్లబ్ గోల్డెన్ స్టార్ పబ్బ విజయ్‌కుమార్ అందజేశారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ ముక్తా శ్రీనివాస్, జోన్ చైర్మన్ బోనగిరి వేణుగోపాల్, ఇంటర్నేషనల్ సభ్యులు రేణుకుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.