Vamsikrishna Srinivasa Yadav
-
వైజాగ్ మాల్యా.. వంశీ!
‘మీరు నిర్దేశించిన గడువులోగా తీసుకున్న అప్పు చెల్లించలేదు. కాబట్టి మీ ఆస్తుల్ని జప్తు చేస్తాం. ఇదిగో ఈ కోర్టు నోటీసులు తీసుకోండి.’ ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తరచూ వినేమాట. మీకు మాల్యా తెలుసు కదా.. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసి విదేశాలకు చెక్కేశారు. కానీ.. మన వైజాగ్ మాల్యా వంశీకృష్ణ మాత్రం.. అప్పులు ఎగొట్టేందుకు ప్రయత్నించి.. కోర్టుల నుంచి మొట్టికాయలు తిని.. తిన్నదంతా కక్కిన ఘనుడు. ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పు తీసుకోవడం.. వారు చెల్లించమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడం.. రుణాలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించడం.. చివరికి కోర్టు నుంచి నోటీసులొస్తే.. మరో చోట అప్పోసొప్పో చేసి ఆ రుణం తీర్చడం.. మళ్లీ నోటీసులు.. మళ్లీ కోర్టు చుట్టూ ప్రదక్షిణలు.. ఇది వంశీకృష్ణకు హాబీగా మారిపోయింది. దాదాపు విశాఖలో ఉన్న సింహభాగం ఫైనాన్స్ కంపెనీల దగ్గర వంశీకృష్ణ.. ఓ డీఫాల్టర్ అనే ముద్ర పడిపోయింది. కేవలం అప్పుల విషయంలోనే కాదు.. రాజకీయాల్లోనూ వంశీ ఒక డీఫాల్టర్ అనే చెప్పుకోవాలి.సాక్షి, విశాఖపట్నం: వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు చెబితే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు భయపడుతుంటాయి. అప్పు ఇస్తే.. తొలుత ఆయన చుట్టూ.. తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది బాబోయ్ అంటూ బ్యాంకర్లు తలలు పట్టుకుంటారు. షిప్పింగ్ కంపెనీని నడుపుతున్న వంశీ.. దాన్ని నడిపేందుకు పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల వద్ద నుంచి రుణాలు తీసుకునేవారు. 2011 నుంచి వంశీకి ఇదే పని. ఏ ఫైనాన్స్ కంపెనీ కనిపిస్తే.. వారి దగ్గరికి వెళ్లడం.. అప్పులు చెయ్యడం.. ఆనక దాన్ని చెల్లించకుండా తప్పించుకు తిరగడమే అలవాటు మారిపోయింది. మార్గదర్శితో మొదలై... 2011లో రామోజీరావుకు చెందిన మార్గదర్శిలో చిట్ వేశారు. మధ్యలోనే ఆ చిట్ని పాడేసి డబ్బులు తీసుకున్నారు. మిగిలిన నెలల చిట్ డబ్బుల్ని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు. నాలుగు నెలలు వరుసగా నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో మార్గదర్శి కోర్టులో పిటిషన్ వేసి.. ఆ డబ్బులు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంది. మరోసారి చిట్ వేసేందుకు మార్గదర్శి అనుమతి ఇవ్వకపోవడంతో సంక్షేమ చిట్స్ అనే మరో సంస్థను పట్టుకొని.. అక్కడా డబ్బులు కొల్లగొట్టి సేమ్ సీన్ రిపీట్ చేశారు. ఫైనాన్స్ సంస్థలకూ శఠగోపం చిట్‌ఫండ్ సంస్థలకు ఎగనామం పెట్టిన వంశీ.. 2015 నుంచి వరుసగా దొరికిన ఫైనాన్స్ సంస్థ దగ్గర దొరికినంత రుణాల్ని తీసుకున్నారు. ఆ తరువాత ఫైనాన్స్ సంస్థలకు శఠగోపం పెట్టేశారు. కొన్ని సంస్థలు చివరికి కోర్టులను ఆశ్రయించి వంశీ దగ్గర నుంచి వసూలు చేసుకున్నాయి. మరికొన్నింటికి డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో ఆస్తుల్ని జప్తు చేసుకున్నాయి. కొంత మంది వ్యక్తుల దగ్గరా డబ్బులు తీసుకొని వారికి కూడా రిక్త హస్తాలు చూపించి డబ్బులు ఎగ్గొట్టాలనుకున్న ఘనుడు వంశీకృష్ణ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 21 సార్లు డీఫాల్టర్‌గా బ్యాంకుల చుట్టూ తిరిగాడు మన వైజాగ్ మాల్యా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా... ఎమ్మెల్యేగా గెలిచి.. ఫైనాన్స్ సంస్థలను బెదిరించి.. అప్పులు మాఫీ చేసుకోవాలనే కుయుక్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వంశీ గురించి ప్రజలకు ముందే తెలిసిపోయింది. 2009లో రాజకీయ ఆరంగ్రేటం చేసి పీఆర్పీ తరఫున పోటీ చేసిన వంశీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టలో చేరారు. 2014 ఎన్నికల్లో యాదవ సామాజికవర్గం నుంచి శాసనసభకు ఒకర్ని పంపించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పు టికెట్ కేటాయించారు. అప్పుడూ వంశీ రుణాల గోల గురించి తెలిసిన తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ వైజాగ్ మాల్యాని ఇంటికే పరిమితం చేశారు. వంశీ బుద్ధి తెలుసుకున్న పార్టీ 2019లో సీటు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ఇక 2021లో 21వ వార్డులో కార్పొరేటర్‌గా అవకాశం కలి్పస్తే అతికష్టమ్మీద గట్టెక్కారు. వంశీ వక్రబుద్ధిని ప్రజలు ముందే గ్రహించి ప్రతి ఎన్నికలోనూ పాఠం నేర్పినా.. సదరు వైజాగ్ మాల్యా మాత్రం తన అప్పుల పరంపరని కొనసాగిస్తూ ఫైనాన్స్ సంస్థలకే కన్నం వేసేందుకు యత్నించారు.ఈ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదా? తూర్పు ప్రజలకు తన రుణ స్వరూపం తెలిసిపోయిందని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కన్నతల్లిలా ఆదరించిన వైఎస్సార్సీపీని వదిలిపెట్టి.. జనసేనలోకి చేరారు. తూర్పులో ప్రజల నుంచి పరాభవం తప్పదని దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వాస్తవానికి వంశీ యవ్వారం దక్షిణ ప్రజలకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే సదరు వంశీ షిప్పింగ్ సంస్థ ఎక్కువగా అక్కడే కార్యకలాపాలు నిర్వహించింది. దక్షిణలోనే విశాఖ పోర్టు కావడం.. సదరు వంశీ చేసిన అడ్డగోలు వ్యవహారాల గురించి ఆ నోటా ఈ నోటా అక్కడ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే.. వంశీ ఓట్లు అడగడానికి వస్తుంటే.. తమని కూడా అప్పులు అడగడానికి వస్తున్నాడేమోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ వంశీకి పరాభవం తప్పదని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
మహిళలపై ఇలా దాడులు చేయడం వంశీకృష్ణకి న్యాయమా?
డాబాగార్డెన్స్: విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు మరింత ముదిరి పాకానపడ్డాయి. వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ సాధిక్ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. విశాఖ దక్షిణ జనసేన టికెట్ వంశీకృష్ణకు ఇవ్వొద్దంటూ మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న సాధిక్ వర్గీయులు.. తాజాగా బుధవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వీరిని వంశీకృష్ణ శ్రీనివాస్ వర్గీయులు అడ్డుకుని.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. క్రమంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు. వంశీకృష్ణతోనే ముసలం మొదలు జనసేనలోకి వంశీకృష్ణ వచ్చిన తర్వాతే దక్షిణ జనసేనలో విభేదాలు మొదలయ్యాయని ఆ పార్టీ నాయకుడు ఆరోపించారు. ఆయన రౌడీలను తీసుకొచ్చి.. ప్రశాంతంగా ఉన్న పారీ్టలో అలజడులకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆయనకు లొంగలేని వారిని లొంగదీసుకునేందుకు రౌడీలు, గూండాలను తీసుకొచ్చి తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో జనసేన అభిమాని మాట్లాడుతూ తూర్పులో రౌడీయిజం చేయడం వల్లే వంశీకృష్ణ ఓడిపోయారని, ఆయన్ని ఇక్కడకు తీసుకురావడంతో ఇక్కడ కూడా రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ వీర మహిళ మాట్లాడుతూ తామంతా 39వ వార్డులో నివసిస్తున్నామని.. ఎక్కడి నుంచో వచ్చిన వంశీ దాడులు ప్రేరేపిస్తున్నారన్నారు. స్థానికులకే టికెట్ కేటాయించాలంటూ తామంతా నిరసన తెలుపుతుంటే వంశీ వర్గీయులే తమపై అసభ్యంగా ప్రవర్తించారని మరో వీరమహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వీరమహిళలపై అసభ్యంగా వ్యవహరించడమే గాక చున్నీలు లాగడం, చేతులు వేయడం వంటివి దిగజారుడు చేష్టలకు పాల్పడ్డారని.. ఇది ఎంతవరకు సమంజసమో వంశీకృష్ణ చెప్పాలని డిమాండ్ చేశారు. రంజాన్ మాసంలో ఇలా చేయొచ్చా.? రంజాన్ మాసంలో మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని.. గరికిన రవి, శివప్రసాద్ తమ పట్ల నీచంగా ప్రవర్తించారని ఓ ముస్లిం మహిళ మండిపడ్డారు. మహిళ అని చూడకుండా అసభ్యంగా వ్యవహరించారని.. మహిళలపై ఇలా దాడులు చేయడం వంశీకి న్యాయమా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వంశీకృష్ణ, అనుచరులపై చర్యలు తీసుకోవాలి సాధిక్ 39వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యాలయంపై కొంత మంది దాడి చేశారు. ఈ దాడిని ముస్లిం మైనారీ్టలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని రాష్ట్ర మైనార్టీ కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వంశీకృష్ణ శ్రీనివాస్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విశాఖ దక్షిణకు బలిపశువునా? విశాఖ దక్షిణలో జనసేన గెలవాలంటే గెలుపు గుర్రం కావాలని.. అలాంటిది ఓ బలిపశువును తీసుకొచ్చి మాపైకి వదులుతారా అంటూ సాధిక్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మేకపోతుకు వంశీకృష్ణ శ్రీనివాస్ చిత్రపటాన్ని పెట్టి.. ఈ బలిపశువు మాకొద్దంటూ తేలి్చచెప్పారు. దీంతో వంశీ వర్గీయులు వీరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సాధిక్ వర్గీయుడు సూరాడ తాతారావు మాట్లాడుతూ పారీ్టకి ఎప్పటి నుంచే సేవలందిస్తున్నామని.. ఓ బలిపశువును తీసుకొచ్చి టికెట్ కేటాయిస్తే ఎలా సహకరిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే'
విశాఖపట్నం: రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. సింహాచలంపై భూసమస్యపై వినతిపత్రం అందజేయడానికే మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశానని ఆయన తెలిపారు. వివిధ వార్తాచానళ్లలో వస్తున్నట్టుగా తమ మధ్య రాజకీయపరమైన చర్చలు జరగలేదని ఆయన వివరణయిచ్చారు. తనపై అసత్య ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.