
'రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెంటే'
రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు.
విశాఖపట్నం: రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు.
సింహాచలంపై భూసమస్యపై వినతిపత్రం అందజేయడానికే మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశానని ఆయన తెలిపారు. వివిధ వార్తాచానళ్లలో వస్తున్నట్టుగా తమ మధ్య రాజకీయపరమైన చర్చలు జరగలేదని ఆయన వివరణయిచ్చారు. తనపై అసత్య ప్రచారం చేయొద్దని ఆయన కోరారు.