వంశీకృష్ణను మేకగా చూపిస్తూ.. నిరసన తెలుపుతున్న సాధిక్ వర్గీయులు
విశాఖ దక్షిణ జనసేనలోపెల్లుబికిన నిరసనలు
వంశీకృష్ణను మేకతో పోల్చిన సాధిక్ వర్గీయులు
అడ్డుకున్న వంశీకృష్ణ అనుచరులు
ఇరువర్గాల మధ్య తోపులాట, చెదరగొట్టిన పోలీసులు
డాబాగార్డెన్స్: విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు మరింత ముదిరి పాకానపడ్డాయి. వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ సాధిక్ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. విశాఖ దక్షిణ జనసేన టికెట్ వంశీకృష్ణకు ఇవ్వొద్దంటూ మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న సాధిక్ వర్గీయులు.. తాజాగా బుధవారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వీరిని వంశీకృష్ణ శ్రీనివాస్ వర్గీయులు అడ్డుకుని.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. క్రమంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరువర్గాలను చెదరగొట్టారు.
వంశీకృష్ణతోనే ముసలం మొదలు
జనసేనలోకి వంశీకృష్ణ వచ్చిన తర్వాతే దక్షిణ జనసేనలో విభేదాలు మొదలయ్యాయని ఆ పార్టీ నాయకుడు ఆరోపించారు. ఆయన రౌడీలను తీసుకొచ్చి.. ప్రశాంతంగా ఉన్న పారీ్టలో అలజడులకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆయనకు లొంగలేని వారిని లొంగదీసుకునేందుకు రౌడీలు, గూండాలను తీసుకొచ్చి తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో జనసేన అభిమాని మాట్లాడుతూ తూర్పులో రౌడీయిజం చేయడం వల్లే వంశీకృష్ణ ఓడిపోయారని, ఆయన్ని ఇక్కడకు తీసుకురావడంతో ఇక్కడ కూడా రౌడీయిజానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓ వీర మహిళ మాట్లాడుతూ తామంతా 39వ వార్డులో నివసిస్తున్నామని.. ఎక్కడి నుంచో వచ్చిన వంశీ దాడులు ప్రేరేపిస్తున్నారన్నారు. స్థానికులకే టికెట్ కేటాయించాలంటూ తామంతా నిరసన తెలుపుతుంటే వంశీ వర్గీయులే తమపై అసభ్యంగా ప్రవర్తించారని మరో వీరమహిళ ఆవేదన వ్యక్తం చేశారు. వీరమహిళలపై అసభ్యంగా వ్యవహరించడమే గాక చున్నీలు లాగడం, చేతులు వేయడం వంటివి దిగజారుడు చేష్టలకు పాల్పడ్డారని.. ఇది ఎంతవరకు సమంజసమో వంశీకృష్ణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రంజాన్ మాసంలో ఇలా చేయొచ్చా.?
రంజాన్ మాసంలో మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని.. గరికిన రవి, శివప్రసాద్ తమ పట్ల నీచంగా ప్రవర్తించారని ఓ ముస్లిం మహిళ మండిపడ్డారు. మహిళ అని చూడకుండా అసభ్యంగా వ్యవహరించారని.. మహిళలపై ఇలా దాడులు చేయడం వంశీకి న్యాయమా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వంశీకృష్ణ, అనుచరులపై చర్యలు తీసుకోవాలి
సాధిక్ 39వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యాలయంపై కొంత మంది దాడి చేశారు. ఈ దాడిని ముస్లిం మైనారీ్టలు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని రాష్ట్ర మైనార్టీ కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వంశీకృష్ణ శ్రీనివాస్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
విశాఖ దక్షిణకు బలిపశువునా?
విశాఖ దక్షిణలో జనసేన గెలవాలంటే గెలుపు గుర్రం కావాలని.. అలాంటిది ఓ బలిపశువును తీసుకొచ్చి మాపైకి వదులుతారా అంటూ సాధిక్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మేకపోతుకు వంశీకృష్ణ శ్రీనివాస్ చిత్రపటాన్ని పెట్టి.. ఈ బలిపశువు మాకొద్దంటూ తేలి్చచెప్పారు. దీంతో వంశీ వర్గీయులు వీరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సాధిక్ వర్గీయుడు సూరాడ తాతారావు మాట్లాడుతూ పారీ్టకి ఎప్పటి నుంచే సేవలందిస్తున్నామని.. ఓ బలిపశువును తీసుకొచ్చి టికెట్ కేటాయిస్తే ఎలా సహకరిస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment