వెలగపూడి ఓ క్రిమినల్: వంశీకృష్ణ
విశాఖపట్నం: టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు హత్యారాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీకృష్ణ యాదవ్ విమర్శించారు. వెలగపూడి ఒక క్రిమినల్ అని ధ్వజమెత్తారు. వంగవీటి రాధాకృష్ణ హత్య కేసులో వెలగపూడి ఏ-2 ముద్దాయిగా ఉన్నారని, ఆయన విశాఖలో హత్య రాజకీయాలు పెంచిపోషిస్తున్నారని ఆరోపించారు.
ఓటమి భయంతోనే తనపై అనవసర ఫిర్యాదులు చేశారని అన్నారు. విశాఖ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వంశీకృష్ణ యాదవ్ పోటీచేస్తున్నారు. ఆయన నామినేషన్ను అధికారులు మంగళవారం ఆమోదించారు.