vanaparhty
-
ఇద్దరు బాలికలకు పాముకాటు..
మహబూబ్‌నగర్: వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలను పాముకాటు వేయగా.. చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మరొకరిని చికిత్స నిమిత్తం ఖిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్య సిబ్బంది పాముకాటు మందులు, అంబులెన్స్ లేవు అని చెప్పడంతో చావుబతుకుల మధ్య బాలికను ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్‌కు తరలించారు.ఈ ఘటనలు వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం కొత్తపల్లి తండా, ఊరంచు తండాలో మంగళవారం చోటుచేసుకున్నాయి. ఆయా కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా.. మండలంలోని కొత్తపల్లి తండాకు చెందిన ముడావత్ రవినాయక్ కుటుంబ సభ్యులతో కలిసి రోజులానే ఇంట్లో నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కూతురు ఇందు (10)ను ఓ పాము కాటు వేసింది.వెంటనే నిద్రలేచిన ఇందు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇళ్లంతా వెతకగా కట్లపాము కనిపించింది. దానిని చంపి పాపను చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలిక మృతిచెందింది. తండ్రి రవినాయక్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.షాపురం ఊరంచు తండాలో..ఇదిలాఉండగా, మండలంలోని షాపురం ఊరంచు తండాకు చెందిన రెడ్యానాయక్ కూతురు లలిత తిమ్మాజిపేట గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల తండాకు వచ్చిన లలిత మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లింది. పొలంలో నడుస్తున్న క్రమంలో ఓ పాము బాలిక లలితను కాటువేసింది. విషయాన్ని తల్లిదండ్రులకు తెలపగా.. కాట్లు గుర్తించి చికిత్స నిమిత్తం ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘నా విజయంలో అమ్మ పాత్ర కీలకమైంది : కలెక్టర్
వనపర్తి : ‘నా విజయంలో అమ్మ పాత్ర కీలకమైంది. మా అమ్మకు మేమిద్దరం ఆడపిల్లలం. మాకు అన్నదమ్ముళ్లు లేరు. చిన్నతనం నుంచే అమ్మ ఉన్నత చదువులు కోసం మామ్మల్ని ఎంతో ప్రోత్సహించారు.’ అని కలెక్టర్ శ్వేతామహంతి తనకు అమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లులందరికీ ఆమె మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మే మొదటి గురువు ప్రతి ఒక్కరికీ మొదటి గురువు అమ్మ. మాట్లాడే మాటలు, నేర్చుకునే అక్షరాలను మొదట అమ్మే నేర్పిస్తారు. వారి ఆత్మధైర్యంతో పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నా విషయంలో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉన్నతమైంది. మా సిస్టర్ ఐఐటీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రతి మదర్స్‌డే కు మేమిద్దరం అమ్మకు స్పెషల్‌గా విషెష్ చెబుతాం. మా అమ్మ లాగే నాకూ ఇద్దరు ఆడపిల్లలు. మగ సంతానం కలగలేదన్న ఆలోచన ఏనాడూ కలగలేదు. ఆడపిల్లలను ప్రోత్సహించాలి ఆడ పిల్లలకు అమ్మ ప్రోత్సాహం చాలా ముఖ్యమైంది. ప్రతిపనిలో నీవు ఆడపిల్లవు! అన్న మాటను ప్రస్తావించకూడదు. ఆడ.. మగ అనే వ్యత్యాసం అనుభవాలు చిన్నతనం నుంచే మనస్సులోకి రానివ్వకుండా పిల్లలను పెంచాలి. సొసైటీలో ఎప్పుడూ ఆడపిల్ల అన్న చులకన భావానికి స్వస్తి చెప్పాలి. విద్యావంతులు ఈ విషయంపై చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. అంతరాలు తొలగాలి.. ఎదుటివారు తప్పుచేసినా ఆడపిల్లను నిందించే సంస్కృతికి స్వస్తి చెప్పాలి. ఆడపిల్ల లేకుండా సమాజమే లేదన్న విషయం గుర్తించాలి. ఆడ.. మగ అనే అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి. అవధుల్లేనిది అమ్మ ప్రేమ. మదర్స్ డే రోజున మీ అమ్మపై మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసేలా శుభాకాంక్షలు చెప్పండి. -
5లక్షల మొక్కలు నాటాం : ఆర్డీఓ
వనపర్తిటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని ఆర్డీ ఓ రాంచందర్ అన్నారు. డివిజన్ పరిధిలో దాదాపు ఐదులక్షల మొక్కలు నాటినట్లు ఆయన వెల్లడించారు. శనివారం పట్టణంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, వడ్డేపల్లి, పెబ్బేరు బాలికల కళాశాలలు సంయుక్తంగా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి 160 మొక్కలు నాటారు. అదే విధంగా పట్టణంలోని 2వ వార్డులో పురచైర్మన్ పలుస రమేష్ గౌడ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ పరమేశ్వరి, సునీల్‌కుమార్, పెబ్బేర్ ఓఎస్డీ రంగస్వామి, అధ్యాపకులు రవికాంత్‌రెడ్డి, పురేందర్‌రెడ్డి, రాజేశ్వరి,సిద్ది లింగయ్య, రవిప్రకాశ్, పుర వైస్ చైర్మన్ బి. కష్ణ, కౌన్సిలర్లు రమాదేవి, వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, ఆవుల రమేష్,పీడీ కమలమ్మ, సతీష్ ఉన్నారు.