5లక్షల మొక్కలు నాటాం : ఆర్డీఓ
Published Sat, Jul 16 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
వనపర్తిటౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని ఆర్డీ ఓ రాంచందర్ అన్నారు. డివిజన్ పరిధిలో దాదాపు ఐదులక్షల మొక్కలు నాటినట్లు ఆయన వెల్లడించారు. శనివారం పట్టణంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, వడ్డేపల్లి, పెబ్బేరు బాలికల కళాశాలలు సంయుక్తంగా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి 160 మొక్కలు నాటారు. అదే విధంగా పట్టణంలోని 2వ వార్డులో పురచైర్మన్ పలుస రమేష్ గౌడ్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ పరమేశ్వరి, సునీల్‌కుమార్, పెబ్బేర్ ఓఎస్‌డీ రంగస్వామి, అధ్యాపకులు రవికాంత్‌రెడ్డి, పురేందర్‌రెడ్డి, రాజేశ్వరి,సిద్ది లింగయ్య, రవిప్రకాశ్, పుర వైస్ చైర్మన్ బి. కష్ణ, కౌన్సిలర్‌లు రమాదేవి, వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, ఆవుల రమేష్,పీడీ కమలమ్మ, సతీష్ ఉన్నారు.
Advertisement