Vanjakshi
-
'వాళ్ల పిల్లలు కీచకులుగా మారారు'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం విశాఖలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ సభ్యుల పిల్లలే కీచకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కఠినంగా వ్యవహరించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. రిషితేశ్వరి విషయంలో విధిలేక ప్రిన్సిపల్ బాబురావును అరెస్ట్ చేశారని అన్నారు. తహశీల్దారు వనజాక్షి వ్యవహారంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో మాట్లాడి సెటిల్ చేశారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఛీటింగ్ చీఫ్ మినిస్టర్‌గా బిరుదు ఇవ్వొచ్చు' అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ ఇంగ్లీషులో చదవడం దురదృష్టకరమని అన్నారు. బడ్జెట్లో మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రోజా విమర్శించారు. -
అధికారులు పనిచేసేదెలా?
ఇసుక మాఫియాను ధైర్యంగా ఎదుర్కొన్న మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఇతర అధికారులకు ఆదర్శం గా చూపి, అండగా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ఆమెపై జరిగిన దాడిని నిర్ద్వంద్వంగా ఖండిం చలేకపోవడం సందేహాలకు తావిస్తున్నది. సాక్షాత్తు తమ పార్టీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌రావే స్వయంగా ఆమెపై జరిపిన దాడి రౌడీ రాజ్యాన్ని గుర్తుకుతెస్తోంది. ప్రజా ప్రతినిధుల పేరిట అక్రమా ర్కులు ప్రభుత్వాధికారులపై దాడులకు దిగుతుంటే ఇక వారు విధులను ఎలా నిర్వహిస్తారు? ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న నేరా నికి నిజాయితీతో పనిచేస్తున్న అధికారిణిపై దాడికి దిగిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని పార్టీ నుంచి, శాసనసభ నుంచి బహిష్కరించాలి. ఆయన పై ఐపీసీ 353 సెక్షన్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, నిందితులందరిపై నాన్-బెయిలబుల్ వారంట్లు జారీచేసి అరెస్టు చేయాలి. ఇసుక మాఫియాతో అధి కార పార్టీ, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయంటూ వినవ స్తున్న కథనాలు నిజమేనని భావించాల్సి వస్తుంది. కోలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా