ఇసుక మాఫియాను ధైర్యంగా ఎదుర్కొన్న మహిళా తహసీల్దార్ వనజాక్షిని ఇతర అధికారులకు ఆదర్శం గా చూపి, అండగా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ఆమెపై జరిగిన దాడిని నిర్ద్వంద్వంగా ఖండిం చలేకపోవడం సందేహాలకు తావిస్తున్నది. సాక్షాత్తు తమ పార్టీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌రావే స్వయంగా ఆమెపై జరిపిన దాడి రౌడీ రాజ్యాన్ని గుర్తుకుతెస్తోంది. ప్రజా ప్రతినిధుల పేరిట అక్రమా ర్కులు ప్రభుత్వాధికారులపై దాడులకు దిగుతుంటే ఇక వారు విధులను ఎలా నిర్వహిస్తారు? ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న నేరా నికి నిజాయితీతో పనిచేస్తున్న అధికారిణిపై దాడికి దిగిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని పార్టీ నుంచి, శాసనసభ నుంచి బహిష్కరించాలి. ఆయన పై ఐపీసీ 353 సెక్షన్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, నిందితులందరిపై నాన్-బెయిలబుల్ వారంట్లు జారీచేసి అరెస్టు చేయాలి. ఇసుక మాఫియాతో అధి కార పార్టీ, ప్రభుత్వం కుమ్మక్కయ్యాయంటూ వినవ స్తున్న కథనాలు నిజమేనని భావించాల్సి వస్తుంది.
కోలిపాక శ్రీనివాస్ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
అధికారులు పనిచేసేదెలా?
Published Wed, Jul 15 2015 1:56 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement