ఆ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
అనంతపురం : అనంతపురం జిల్లా శెట్టూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వన్నూరు స్వామి కుటుంబాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబసభ్యులను వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారు.
కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని వన్నూరు స్వామి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.