Varsity
-
మాదాపూర్ కేరీర్ ఫేయిర్‌లో విదేశీ వర్సిటీ ప్రతినిధులతో ఉత్సాహంగా విద్యార్థులు (ఫొటోలు)
-
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
15న రీసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ: వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు రీసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఒకే రోజు మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు ర్యాంకు కార్డులు, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను వర్సిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ విభాగం విడుదల చేశారు. తొలిసారిగా ఎస్కేయూ రీసెట్‌ను ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. గత నెల ఫలితాలు విడుదలయ్యాయి. -
ఉద్యాన వర్సిటీ కొత్త వీసీపై చర్చ
తాడేపల్లిగూడెం : డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ కొత్త ఉపకులపతి నియామకంపై వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఉపకులపతి బాధ్యతలు స్వీకరించి త్వరలో మూడేళ్లు కావస్తోంది. వీసీ పదవీకాలం నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలు. ఈ గడువు ముగిశాక కూడా వీసీని ప్రభుత్వం కొనసాగించవచ్చు. కొత్త వీసీ వచ్చేవరకు అన్నట్టుగా ఫర్దర్ అన్టిల్ ఆర్డర్ అనే ఆదేశాలను ఇచ్చే అవకాశాలూ ఉంటాయి. 2007లో వెంకట్రామన్నగూడెంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత తొలి ఉపకులపతిగా ఎస్డీ.శిఖామణి, రిజిస్ట్రార్‌గా డాక్టర్ పి.సూర్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరి ఉద్యోగ కాలం ముగిసిన తర్వాత కొంతకాలం పాటు ప్రిన్సిపాల్ సెక్రటరీ టు గవర్నమెంట్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి శర్మ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్ సూర్యనారాయణరెడ్డి తర్వాత ఇప్పటివరకు ఈ సీటు ఇన్చార్జిల ఏలుబడిలో ఉంది. డాక్టర్ బి.శ్రీనివాసులు ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఐఏఎస్ అధికారి శర్మ తర్వాత 2013 డిసెంబర్లో వర్సిటీ రెండో ఉపకులపతిగా ఐసీఏఆర్‌లో దీర్ఘకాలం పనిచేసిన డాక్టర్ బీఎంసీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్లో ముగియనుంది. ఆయననే మరికొంతకాలం కొనసాగిస్తారా లేదంటే ఆయన ఉద్యోగకాలం ఇక్కడ ముగిసిన తర్వాత కొత్తవారిని వీసీగా నియమిస్తారా అనే విషయంపై వర్సిటీ స్నాతకోత్సవం తర్వాత చర్చ ప్రారంభమైంది. వివాదరహితుడిగా పేరొందిన బీఎంసీ రెడ్డిని మరికొంతకాలం వీసీగా కొనసాగించాలని స్నాతకోత్సవం తర్వాత వర్సిటీ వర్గాలు కోరినట్టు సమాచారం. వీసీ రేసులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గతంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆలపాటి సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. గతంలో వీసీ నియామక ప్రక్రియ సమయంలో కూడా ఆలపాటి తెరమీదకు వచ్చారు. ఆయనకు సీనియారిటీతో పాటు, గతంలో కాంగ్రెస్ ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసి తర్వాత బీజేపీలో చేరిన నేతకు బంధుత్వం ఉందని సమాచారం. -
వివాదంలో మరో విశ్వవిద్యాలయం
న్యూఢిల్లీ: హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వివాదం ఇంకా చల్లారకముందే దేశ రాజధాని లో ప్రముఖ యూనిర్శిటీ వార్తల్లో నిలిచింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం కలకలం రేపింది. తన సమస్యను వారంలోగా తేల్చాలని ...లేకుంటే ప్రాణత్యాగం చేస్తానని బెదిరిస్తూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను ఉద్దేశించి రెండు లేఖలు రాశాడు. తనకు రావాల్సిన గ్రాంట్ ను మంజూరు చేయకుండా వివక్షను గురి చేసి, వేధిస్తున్నారని దళిత స్కాలర్ మదన్ మెహర్ ఆరోపిస్తున్నాడు. తన పీహెచ్‌డీని ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిలిపి వేసిన తన ఫెలోషిప్‌ను తక్షణమే కొనసాగించాలని అతడు డిమాండ్ చేశాడు. వారంలోగా తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖలో తెలిపాడు. అయితే యూనివర్శిటీ వాదన దీనికి భిన్నంగా ఉంది. సదరు విద్యార్థి బ్రస్సెల్స్, బెల్జియంలో పర్యటన కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న రూ 66,000 ను యూనివర్శిటీకి తిరిగి చెల్లించాల్సింది ఉందన్నారు. విద్యార్ధి తన ఫెలోషిప్ కొనసాగించడానికి అనుమతించే ముందు, ఆ మొత్తం డబ్బులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుదని వైస్ ఛాన్సలర్ హెచ్. శర్మ బుధవారం పేర్కొన్నారు. వర్శిటీ కంట్రోలర్, ఫైనాన్స్ అధికారి నుంచి అనుమతి లేకపోవడంతోనే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొడిగింపును నిలిపి వేసినట్టు చెప్పారు. మరోవైపు విద్యార్థిని ఒక కంట కనిపెట్టమని యూనివర్శిటీ భద్రతా అధికారిని అప్రమత్తం చేశామని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మరో అధికారి హామీ ఇచ్చారు. మరోవైపు సమస్యలపై వర్సిటీ అధికారులు ఫిబ్రవరి 8న విద్యార్థులతో భేటీ కానుంది. కాగా జనవరి 17 న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో రోహిత్(26) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. -
తెయూ చరిత్రలో అపూర్వ ఘట్టం !
- మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం - చికాగో యూనివర్సిటీతో ఒప్పందం - నేడు వర్సిటీని సందర్శించనున్న ‘చికాగో’ బృందం తెయూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. అమెరికాలోని చికాగో స్టేట్ యూనివర్సిటీతో తెలంగాణ యూనివర్సిటీ చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇక్కడి విద్యార్థులు, ఆచార్యులు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు. దీంతో ఇక్కడి విద్యార్థులకు.. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల వారికి అంతర్జాతీయ స్థారుులో అవకాశం కలుగనుంది. వర్సిటిలో ప్రస్తుతం 26 కోర్సులు ఉండగా, 80 మంది రెగ్యులర్ బోధన సిబ్బందితో మూడు క్యాంపస్‌లలో కొనసాగుతోంది. జిల్లా వాసులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారధి ఇన్చార్జి వీసీగా, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. వర్సిటీ అభివృద్ధికి వీరిరువురూ సమన్వయంతో పని చేస్తున్నారు. అంతర్జాతీయ బోధనా పద్ధతులు తెలుస్తాయి.. తెయూలో మొదటి సంవత్సరం చదువు పూర్తి చేసిన విద్యార్థులు చికాగో యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుకోవచ్చు. రెండు యూనివర్సిటీల సంయుక్త పట్టా పొందే అవకాశం ఉంటుంది. మన చదువులు ఎలా ఉన్నాయి, అంతర్జాతీయంగా చదువులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. దీంతో పాటు మన విద్యా విధానంలో నాణ్యతను మరింత మెరుగు పర్చుకునేందుకు ఈ ఒప్పంద ం ఉపకరిస్తుంది. ఫ్యాకల్టీ సభ్యులు కూడా అక్కడికి వెళ్లి పాఠాలు బోధించే అవకాశం రానుండటంతో మన బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి, అక్కడి బోధనా పద్ధతులు ఎలా ఉంటారుు.. అని తెలుసుకోవచ్చు. నేడు తెయూకు చికాగో బృందం.. చికాగో స్టేట్ యూనివర్సిటీ నుంచి ముగ్గురు సభ్యులు సోమవారం తెయూను సందర్శించనున్నారు. కంప్యూటర్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రత్యేక సమావేశంలో ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో ఈ ఒప్పందం సాధ్యమైందని పలువురు అంటున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఎంఓయూ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెయూ, చి కాగో స్టేట్ యూనివర్సిటీ అధికారులు ఒప్పంద పత్రాలు (ఎంఓయూ) మార్చుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఈ పత్రాలపై ఇరు వర్సిటీల అధికారులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. పత్రాలపై తెయూ వీసీ సి.పార్థసారధి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,చికాగో యూనివర్సిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిస్ట్ సంతకాలు చేశారు. చికాగో యూనివర్సిటీ ప్రతినిధి బృందంలో రవి అచంట, రోహన్ అట్లే ఉన్నారు. ఒప్పంద కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్ర భుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, ఎ మ్మెల్యే జీవన్‌రెడ్డి, తెయూ సైన్స్‌డీన్ ప్రొఫెసర్ వై.జయప్రకాశ్‌రావు, కంప్యూటర్ సైన్స్ హెడ్ ఆ రతి, పీఆర్ఓ కే.రాజారాం, స్టాటిస్టిక్స్ హెడ్ సం పత్కుమార్, పెద్దోల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వర్సిటీల్లో ర్యాగింగ్‌పై నిఘా!
సాక్షి, హైదరాబాద్: గుంటూరు ఆచార్య నాగార్జునవర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ వేధింపులే కారణాలుగా తేలిన నేపథ్యంలో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యం, ర్యాగింగ్, తరగతులకు గైర్హాజరు, వర్సిటీ కాలేజీల్లోకి అసాంఘిక శక్తుల ప్రవేశం తదితర చర్యల కట్టడికి ఉపక్రమిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ శుక్రవారం జీఓ నెంబర్ 398 విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని యూనివర్సిటీ కాలేజీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్ యంత్రాలు తప్పనిసరిచేయాలి. ఈ మేరకు నిర్ణీత శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్పులను మంజూరు చేయాలి. బయటి వ్యక్తులు వర్సిటీల్లో ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆగస్టు 31వ తేదీనాటికి పూర్తి కావాలని అన్ని యూనివర్సిటీల ఉపకులపతులను ప్రభుత్వం ఆదేశించింది. -
టాప్ 400 వర్సిటీల్లో 5 భారత సంస్థలకు చోటు
లండన్: ప్రపంచ అత్యున్నత ప్రమాణాలున్న టాప్ 400 వర్సిటీల్లో మనదేశానికి చెందిన పంజాబ్ విశ్వవిద్యాలయం (226-250 గ్రూప్), ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ ఐఐటీలు (351-400 గ్రూప్) నిలిచాయి. 2012లో మూడు మాత్రమే ఉన్న ఈ సంఖ్య 2013-14లో ఐదుకు చేరింది. అత్యుత్తమ బోధన, పరిశోధనలు, విజ్ఞానం బదిలీ, అంతర్జాతీయ దృక్కోణం తదితర అంశాలను పరిశీలించిన టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్ (టీహెచ్డబ్ల్యూయూఆర్) సంస్థ తాజా జాబితాను ప్రకటించింది.