తెయూ చరిత్రలో అపూర్వ ఘట్టం ! | TU in history Unique event | Sakshi
Sakshi News home page

తెయూ చరిత్రలో అపూర్వ ఘట్టం !

Published Mon, Sep 7 2015 4:02 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

తెయూ చరిత్రలో అపూర్వ ఘట్టం !

తెయూ చరిత్రలో అపూర్వ ఘట్టం !

- మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం
- చికాగో యూనివర్సిటీతో ఒప్పందం
- నేడు వర్సిటీని సందర్శించనున్న ‘చికాగో’ బృందం
తెయూ (డిచ్‌పల్లి):
తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. అమెరికాలోని చికాగో స్టేట్ యూనివర్సిటీతో తెలంగాణ యూనివర్సిటీ చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇక్కడి విద్యార్థులు, ఆచార్యులు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చు.

దీంతో ఇక్కడి విద్యార్థులకు.. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల వారికి అంతర్జాతీయ స్థారుులో అవకాశం కలుగనుంది. వర్సిటిలో ప్రస్తుతం 26 కోర్సులు ఉండగా, 80 మంది రెగ్యులర్ బోధన సిబ్బందితో మూడు క్యాంపస్‌లలో కొనసాగుతోంది. జిల్లా వాసులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సి.పార్థసారధి ఇన్‌చార్జి వీసీగా, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు. వర్సిటీ అభివృద్ధికి వీరిరువురూ సమన్వయంతో పని చేస్తున్నారు.
 
అంతర్జాతీయ బోధనా పద్ధతులు తెలుస్తాయి..
తెయూలో మొదటి సంవత్సరం చదువు పూర్తి చేసిన విద్యార్థులు చికాగో యూనివర్సిటీలో రెండో సంవత్సరం చదువుకోవచ్చు. రెండు యూనివర్సిటీల సంయుక్త పట్టా పొందే అవకాశం ఉంటుంది. మన చదువులు ఎలా ఉన్నాయి, అంతర్జాతీయంగా చదువులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. దీంతో పాటు మన విద్యా విధానంలో నాణ్యతను మరింత మెరుగు పర్చుకునేందుకు ఈ ఒప్పంద ం ఉపకరిస్తుంది. ఫ్యాకల్టీ సభ్యులు కూడా అక్కడికి వెళ్లి పాఠాలు బోధించే అవకాశం రానుండటంతో మన బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి, అక్కడి బోధనా పద్ధతులు ఎలా ఉంటారుు.. అని తెలుసుకోవచ్చు.

నేడు తెయూకు చికాగో బృందం..
చికాగో స్టేట్ యూనివర్సిటీ నుంచి ముగ్గురు సభ్యులు సోమవారం తెయూను సందర్శించనున్నారు. కంప్యూటర్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రత్యేక సమావేశంలో ఎంఓయూ కుదుర్చుకుంటారు. ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో ఈ ఒప్పందం సాధ్యమైందని పలువురు అంటున్నారు.  
 
సీఎం కేసీఆర్ సమక్షంలో ఎంఓయూ  
ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెయూ, చి కాగో స్టేట్ యూనివర్సిటీ  అధికారులు ఒప్పంద పత్రాలు (ఎంఓయూ) మార్చుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఈ పత్రాలపై ఇరు వర్సిటీల అధికారులు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ కవిత కూడా పాల్గొన్నారు. పత్రాలపై తెయూ వీసీ సి.పార్థసారధి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,చికాగో యూనివర్సిటీకి చెందిన వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిస్ట్ సంతకాలు చేశారు. చికాగో యూనివర్సిటీ ప్రతినిధి బృందంలో రవి అచంట, రోహన్ అట్లే ఉన్నారు.  ఒప్పంద కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్ర భుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, ఎ మ్మెల్యే జీవన్‌రెడ్డి, తెయూ సైన్స్‌డీన్ ప్రొఫెసర్ వై.జయప్రకాశ్‌రావు, కంప్యూటర్ సైన్స్ హెడ్ ఆ రతి, పీఆర్‌ఓ కే.రాజారాం, స్టాటిస్టిక్స్ హెడ్ సం పత్‌కుమార్, పెద్దోల్ల శ్రీనివాస్  పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement