Vasantrao Deshpande
-
ఆధార్ అనుసంధానంతో గుదిబండగా గ్యాస్ సిలిండర్లు
గ్యాస్ సిలిండర్ అసలు ధర రూ.415, ప్రభుత్వం బ్యాంకులో జమ చేసే డబ్బులు రూ.553 కలుపుకుంటే రూ.968 అవుతాయి. కానీ, వినియోగదారులు గ్యాస్ కోసం రూ.1022 చెల్లిస్తే వారికి వచ్చేది రూ.968 అంటే రూ.54 ప్రతి వినియోగదారుడు నష్టపోతున్నాడు. అయితే నష్టపోతున్న రూ.54 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా. గ్యాస్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ నిబంధన పెట్టడంతో ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వాటాకు మంగళం పలికింది. ఈ భారమే ప్రజలపై పడుతోంది. ఇక ఆధార్ సమర్పించిన వారే అదనంగా డబ్బులు చెల్లిస్తుండటంతో సమర్పించిన వారు ఆధార్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారని జిల్లా పౌరసరఫరాల అధికారి వసంత్‌రావు దేశ్‌పాండే తెలిపారు. దీపం అనర్హులను తొలగిస్తే.. జిల్లా వ్యాప్తంగా 1,56,395 దీపం కనెక్షన్లు ఉన్నాయి. పేదల కోసం ప్రవేశƒ పెట్టిన ఈ పథకం ద్వారా అనర్హులు కనెక్షన్లు అక్రమంగా పొందారు. సుమారు రూ.45 వేల మంది అక్రమంగా కనెక్షన్లు పొందారని సమాచారం. దీపం లబ్ధిదారుల అర్హులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఇందులో ఇప్పటికే 23 వేల అక్రమ కనెక్షన్లను అధికారులు తొలగించారు. 45వేల అక్రమ కనెక్షన్లు తొలగిస్తే.. ప్రతి నెల ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.553 చొప్పున రూ. 24,88,5,000 ఆదాయం మిగులుతోంది. బండ బాదుడు ఇలా.. 2009-10 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్ ధరను రూ.100 నుంచి రూ.150 వరకు పెంచింది. ఈ నిర్ణయంలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇందులో నుంచి రూ.50 భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కొంతకాలం భరించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రూ.25 కోత పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వస్తున్న రాయితీ, వ్యాట్‌ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో భారం వినియోగదారులపై పడుతోంది. -
పకడ్బందీగా నగదు బదిలీ పథకం అమలు
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్వో) వసంత్‌రావు దేశ్‌పాండే తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాంకు మేళాను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నగదు బదిలీ(డీబీటీ) పథకం ప్రగతిపై ప్రతి శుక్రవారం కలెక్టర్ సమీక్షిస్తున్నారని చెప్పారు. ఖాతాలు లేని వారిని గుర్తించి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలతోపాటు ఉట్నూర్, ఆసిఫాబాద్‌లో బ్యాంకు మేళాలు ఏర్పాటు చేశామని అన్నారు. గ్యాస్ వినియోగదారులు 80,830 మంది ఉండగా నగదు బదిలీలో భాగంగా రూ.4.47 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశామని వివరించారు. గ్యాస్ వినియోగదారుడికి మొదటి విడతగా రూ.435, రెండో విడతగా రెండ్రోజుల అనంతరం రూ.118తో కలిపి మొత్తంగా రూ.553 బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని వివరించారు. జిల్లాలో 4.15లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా నగదు బదిలీ పథకంపై ఆధార్ నమోదుతో 3.82లక్షల వినియోగదారులు పరిగణనలోకి వచ్చారని తెలిపారు. ఇందులో 1.50 లక్షల దీపం పథకం వినియోగదారులు ఉన్నారని, సర్వే సాగుతోందని, ఆధార్, రేషన్‌కార్డు అనుసంధానం 80 శాతం వరకు పూర్తయిందని పేర్కొన్నారు. మంచిర్యాల మండలం గుడిపేటలో ఇటీవల ఇళ్లు కాలిపోగా వారిలో 39 మంది అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. బంగారుతల్లి పథకానికి రేషన్‌కార్డు తప్పనిసరి కావడంతో వచ్చే రచ్చబండ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించి కార్డులు అందేలా చూస్తామన్నారు. కుటుంబంలో పెళ్లయిన వారు రేషన్‌కార్డు పాత జిరాక్స్ కాపీని అందజేస్తే అందులో వారి ఫొటోను తొలగించి ఆ జంటకు మరో రేషన్‌కార్డు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ తేజావత్ వెంకన్న, ఎన్‌ఫోర్స్‌మెంటు డీటీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.