గ్యాస్ సిలిండర్ అసలు ధర రూ.415, ప్రభుత్వం బ్యాంకులో జమ చేసే డబ్బులు రూ.553 కలుపుకుంటే రూ.968 అవుతాయి. కానీ, వినియోగదారులు గ్యాస్ కోసం రూ.1022 చెల్లిస్తే వారికి వచ్చేది రూ.968 అంటే రూ.54 ప్రతి వినియోగదారుడు నష్టపోతున్నాడు. అయితే నష్టపోతున్న రూ.54 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా. గ్యాస్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ నిబంధన పెట్టడంతో ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న వాటాకు మంగళం పలికింది. ఈ భారమే ప్రజలపై పడుతోంది. ఇక ఆధార్ సమర్పించిన వారే అదనంగా డబ్బులు చెల్లిస్తుండటంతో సమర్పించిన వారు ఆధార్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారని జిల్లా పౌరసరఫరాల అధికారి వసంత్‌రావు దేశ్‌పాండే తెలిపారు.
దీపం అనర్హులను తొలగిస్తే..
జిల్లా వ్యాప్తంగా 1,56,395 దీపం కనెక్షన్లు ఉన్నాయి. పేదల కోసం ప్రవేశƒ పెట్టిన ఈ పథకం ద్వారా అనర్హులు కనెక్షన్లు అక్రమంగా పొందారు. సుమారు రూ.45 వేల మంది అక్రమంగా కనెక్షన్లు పొందారని సమాచారం. దీపం లబ్ధిదారుల అర్హులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు. ఇందులో ఇప్పటికే 23 వేల అక్రమ కనెక్షన్లను అధికారులు తొలగించారు. 45వేల అక్రమ కనెక్షన్లు తొలగిస్తే.. ప్రతి నెల ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.553 చొప్పున రూ. 24,88,5,000 ఆదాయం మిగులుతోంది.
బండ బాదుడు ఇలా..
2009-10 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో సిలిండర్ ధరను రూ.100 నుంచి రూ.150 వరకు పెంచింది. ఈ నిర్ణయంలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇందులో నుంచి రూ.50 భరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కొంతకాలం భరించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత రూ.25 కోత పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ వస్తున్న రాయితీ, వ్యాట్‌ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవడంతో భారం వినియోగదారులపై పడుతోంది.
ఆధార్ అనుసంధానంతో గుదిబండగా గ్యాస్ సిలిండర్‌లు
Published Thu, Oct 10 2013 2:57 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
Advertisement